-
కొత్త చట్టం.. విడాకులు మరింత ఖరీదు
బీజింగ్ : చైనా కోర్టు వెల్లడించిన ఓ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆన్లైన్ చర్చకు దారి తీసింది. విడాకులు ఇవ్వాలని భావించే వ్యక్తి.. గతంలో తన భార్య చేసిన ఇంటి పనికి కూడా డబ్బులు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ప్రస్తుతం ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. మహిళల పని పట్ల మీకు ఇంత చిన్న చూపా అంటు ఎక్కువ మంది విమర్శలు చేస్తుండగా.. కనీసం ఇప్పటికైనా గుర్తించారు అంటూ కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం అమల్లోకి వచ్చిన చైనా కొత్త సివిల్ కోడ్ ప్రకారం, విడాకులు తీసుకునే జంటల్లో.. వారు కలిసి ఉన్న రోజుల్లో భార్యలు ఇంట్లో ఎక్కువ బాధ్యతలు తీసుకుంటే అందుకు గాను వారు పరిహారం కోరవచ్చు. భరణం కాక ఇది అదనం. ఈ ఏడాదే చట్టం అమల్లోకి వచ్చింది. ఆ వివరాలు.. చెన్-వాంగ్ దంపతులకు ఐదు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో కోర్టు ఆమెకు భర్త నుంచి భరణం ఇప్పించింది. ఇదిలా ఉండగా ఈ నెల 4 నుంచి కొత్త సివిల్ లా అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో వాంగ్ కొత్త చట్టం ప్రకారం తామిద్దరు కలిసి ఉన్న ఐదేళ్లలో ఇంటి పనులు చేసినందుకు గాను తనకు ఎక్స్ట్రా డబ్బులు చెల్లించాల్సిందిగా కోరుతూ బీజింగ్ కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా వాంగ్ ‘‘గడిచిన ఐదేళ్లలో ఇంటి పని, పిల్లల బాగోగులు అన్ని నేను చూసుకున్నాను. చెన్ కొంచెం కూడా నాకు హెల్ప్ చేసేవాడు కాదు. ఆఫీస్ బాధ్యతలు మాత్రమే నిర్వహించేవాడు. రోజంతా పిల్లలు, ఇంటి పనితో సరిపోయేది. ఈ మేరకు నాకు మరి కాస్త ఎక్కువ పరిహారం ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను’’ అన్నది. వాంగ్ వాదనలు విన్న కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఐదు సంవత్సరాలు పాటు వాంగ్ చేసిన ఇంటి పనికి గాను 7,700 డాలర్లు(5,56,937.15 రూపాయలు) చెల్లించాల్సిందిగా ఆదేశిస్తూ.. తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై చైనీస్ ట్విట్టర్ వీబోలో వాడివేడి చర్చ నడుస్తోంది. ‘‘ఇంట్లోనే ఉండే భార్యలు తాము చేసే పనికి 50 వేల యువాన్ల పరిహారాన్ని పొందవచ్చు’’ అనే హాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ తీర్పు పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మహిళలు ఎవరు ఇంటి పట్టున ఉండకూడదు. ఒకవేళ భవిష్యత్తులో మీరు విడాకులు పొందాలనుకుంటే.. మీకు ఎలాంటి పరిహారం లభించదు. ఇంటి పని చేస్తున్నందుకు గాను మీకు కేవలం 50 వేల పై చిలుకు యువాన్లు మాత్రమే లభిస్తుంది. ఏంటి ఈ ఖర్మ’’ అని కామెంట్ చేస్తుండగా.. ‘‘మరి కొందరు ఫుల్ టైం పిల్లలను చూసుకునే ఓ బామ్మ ఆరు నెలలకు గాను ఇంతకంటే ఎక్కువ ఫీజే తీసుకుంటుది. భార్యలు చేసే పని మీకు ఇంత చీప్‌గా కనిపిస్తుందా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తీర్పుపై ఓ న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘‘జంట ఎన్ని సంవత్సరాలు వైవాహిక జీవితం గడిపారు.. వాంగ్ ఇంటి పని, చెన్ ఆదాయం, స్థానిక జీవన వ్యయం ఆధారంగా ఈ మొత్తాన్ని నిర్ణయించినట్లు’’ స్థానిక మీడియాలో పేర్కొన్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనా ప్రకారం, చైనా మహిళలు రోజూ దాదాపు నాలుగు గంటలు వేతనం లేని ఇంటి పనులు చేయడంలో గడుపుతారు. పురుషుల కంటే 2.5 రెట్లు మరియు సగటు కంటే ఎక్కువ. చదవండి: తాగుబోతు భర్తకు ఝలక్ ఇచ్చిన భార్య, దాంతో కన్నీళ్లు తుడిచి.. కష్టాలు కడతేర్చి! -
కీలక నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ..
న్యూఢిల్లీ: చైనాపై నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ సమ్మెను కొనసాగిస్తోంది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలపై పక్షపాతం చూపినందుకు 59 చైనా యాప్‌లను నిషేదించగా.. తాజాగా చైనా సోషల్ మీడియా బ్లాగింగ్ వెబ్సైట్ వీబో యాప్ నుంచి వైదొలగాలని ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో చైనీస్ మొబైల్ యాప్‌లను నిషేదించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే పీఎం మోదీ వీబో నుంచి వైదొలగుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మోదీ కొన్ని సంవత్సరాల క్రితం ట్విటర్‌కు సమానమైన చైనా యాప్ వీబోలో చేరారు. (నేపాల్ ప్రధానికి అండగా ఇమ్రాన్ ఖాన్!?) అయితే నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. నరేంద్రమోదీ ఖాతా ఇంకా యాక్టివ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీబోలో వీఐపీ ఖాతాలు మూసివేయడానికి కొన్ని నిబంధనలు ఉండటంతో అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా.. గతంలో చైనీస్ యాప్‌లైన వీబో, వీచాట్ యాప్‌లు ప్రధాని మోదీ, భారత రాయబార కార్యాలయం చేసిన పోస్టులను ఏకపక్షంగా తొలగించిన విషయం తెలిసిందే. ఇలా తొలగించిన పోస్టుల్లో 20 మంది భారత సైనికులు అమరులైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యల వీడియో కూడా ఉంది. సరిహద్దు వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ జారీచేసిన ప్రకటనను సైతం ఇష్టారాజ్యంగా తొలగించిన సంగతి తెలిసిందే. (టిక్‌టాక్‌కు మరో ఎదురుదెబ్బ..) -
అద్భుత ఫీచర్లతో లెనోవో స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా మొబైల్ మేకర్ మరో విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. జెడ్ సిరీస్‌లో భాగంగా అదిరిపోయే ఫీచర్లతో జెడ్6 ప్రొ పేరుతో లెనోవో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. 100 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ హైపర్ విజన్ కెమెరాతోపాటు, ఎలక్షన్ సందర్భంగా ఫేక్‌న్యూస్‌ను అడ్డుకునేందుకు తీసుకొచ్చిన ఫేస్బుక్ కొత్త టూల్, వాట్సాప్ డార్క్‌మోడ్ అథెంటిఫికేషన్ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. 100ఎంపీ కెమెరా సామర్థ్యం ఉన్న తొలి ఫోన్ ఇదే కానుంది. ఈ మేరకు ఈ ఫోన్‌కు చెందిన ఓ ఇమేజ్ను, వీడియోను ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చాంగ్ చెంగ్ మార్చి 27వ తేదీన చైనా సోషల్ మీడియా వైబోలో పోస్ట్ చేశారు.ఈ ఏడాది మొబైల్ వరల్డ్‌కాంగ్రెస్‌లో దీనిపై ప్రకటించిన సంస్థ జూన్ నెలలో మార్కెట్లలో తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫీచర్లపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, అంచనాలు ఇలా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ప్రధానంగా వెలుగులోకి వచ్చిన లెనోవో జడ్6 ప్రొ ఫీచర్లు. -
నెట్లో చక్కర్లు కొడుతున్న రెడ్మి 6 ప్రొ
షావోమి మరికొన్ని మూడు రోజుల్లో లాంచ్ చేయబోతున్న షావోమి రెడ్మి 6 ప్రొ ఇంటర్నెట్లో లీకైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సంబంధించిన ఇమేజ్‌లు ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎంఐ ప్యాడ్ 4 టాబ్లెట్‌తో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 25న కంపెనీ మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది. తాజాగా లీకైన ఇమేజెస్‌లో స్మార్ట్‌ఫోన్ డిజైన్ వివరాలు హైలెట్ అయ్యాయి. చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ వైబో ఈ ఇమేజ్‌లను లీక్‌చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్ మాదిరి టాప్-నాచ్ డిస్ప్లేను కలిగి ఉందని తెలుస్తోంది. టీనా లిస్టింగ్ కూడా ఈ ఫీచర్‌ను అంతకముందే రివీల్ చేసింది. అంతేకాక నిలువుగా అమర్చిన రెండు కెమెరాలను కూడా ఈ ఫోన్ కలిగి ఉందని లీక్ అయిన ఇమేజ్‌లు చూపిస్తున్నాయి. వెనుకవైపు సర్క్యూలర్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇది కలిగి ఉందట. ఎంఐయూఐ 9.6 ఆధారిత ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తోనూ రెడ్మి 6 ప్రొ మార్కెట్లోకి వస్తుందని టాక్. టీనా లిస్టింగ్ అంతకముందు రివీల్ చేసిన దాని ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌కు 5.84 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ డిస్ప్లే, ఆక్టాకోర్ సీపీయూ, 2 గిగాహెడ్జ్, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుందని తెలిసింది. రెడ్మి 6 ప్రొతో మార్కెట్లోకి వస్తున్న ఎంఐ ప్యాడ్ 4, 8 అంగుళాల స్క్రీన్‌తో మార్కెట్లోకి వస్తుందని కంపెనీ ఇప్పటికేధృవీకరించేసింది. అంతకముందు రిపోర్టుల ప్రకారం ఎంఐ ప్యాడ్‌కు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ఎస్ఓసీ, 13 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటున్నాయని తెలిసింది. -
ఇవాంకా ఏందిది? మెదడు వాచిపోయింది!
వాషింగ్టన్/బీజింగ్: గడిచిన రెండు రోజులుగా దాదాపు ప్రపంచమంతా ‘ట్రంప్-కిమ్ భేటీ’ గురించే మాట్లాడుకుంది. సింగపూర్‌లోని సెంతోసా దీవిలో గల రిసార్టులో సుదీర్ఘంగా చర్చలు జరిపిన అమెరికా-ఉత్తరకొరియా దేశాధినేతలు ఎట్టకేలకు ఉమ్మడిగా శాంతిసందేశాన్ని ఇచ్చారు. సుమారు 40 గంటలు సాగిన కార్యక్రమ ఖర్చు రూ.100కోట్ల పైమాటే. ఇరుదేశాల మేలు కోరే మిత్రురాలు సింగపూరే ఖర్చంతా భరించింది. ఈ చరిత్రాత్మక సన్నివేశాన్ని కవర్ చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 3 వేల మంది జర్నలిస్టులు తరలివెళ్లారు. ఉత్తరకొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణ సహా పలు ఒప్పందాలపై సంతకాలు చేసిన ఇరునేతలు ప్రశాంతంగా తమ తమ దేశాలకు పయనమయ్యారు. ఇదిలా ఉంటే, కిమ్-ట్రంప్ భేటీపై అమెరికా అధ్యక్షుడి కూతురు, వైట్‌హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ చేసిన కామెంట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇవాంకా ట్వీట్ వైరల్: అణుబాంబులు వేస్తానని బెదిరించినా, చివరికిప్పుడు అమెరికాతో చర్చలకు ముందుకొచ్చినా కిమ్ జాంగ్ వెనకున్నది చైనాయే అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా, ఓ చైనీస్ సామెత ఇదంటూ ఇవాంకా చేసిన ట్వీట్‌పై డ్రాగన్ దేశస్తులు జుట్టు పీక్కుంటున్నారు. ‘Those who say it can not be done, should not interrupt those doing it -Chinese Proverb (ఇది అసాధ్యమని అన్నవాళ్లంతా సుసాధ్యం అవుతున్నవేళ ఆటంకాలు కల్గించొద్దు- చైనీస్ సామెత)’ అని ఇవాంకా రాశారు. బ్రెయిన్ ఎగ్జాస్టెడ్!: అసలే భాషా(వీరా)భిమానులైన చైనీయులు.. ఇవాంకా చెప్పిన సామెత ఎక్కడిదా? అని సెర్చింగ్ మొదలెట్టారు. చివరాఖరికి అలాంటి అర్థాన్నిచ్చే సామెత ఏదీ తమ భాషలో లేదనే నిర్ధారణకు వచ్చారు. చైనీస్ సోషల్ మీడియా వేదికలైన వీచాట్, వెయిబో, క్యూక్యూల్లో ఇవాంకా పోస్టుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ‘‘వామ్మో ఇవాంకా.. ఒక్క సామెతతో మా మెదడు నరాలను తెంపేశావుగా!’’ అని కొందరు, ‘‘ మీ రాతల్లో అర్థం ఉన్నా, సామెత మాత్రం ఇక్కడిది కాదు’’అని ఇంకొందరు, ‘‘బహుశా పాండా ఎక్స్‌ప్రెస్ రెస్టారెంట్లో ఫార్చూన్ కుకీ(లోపల చైనీస్ సామెత రాసుండే బిస్కెట్)లో ఆమెకిది దొరికి ఉండొచ్చు..’’ అని మరొకరు కామెట్లు చేశారు. -
నగ్నంగా ఫొటోలు తీసుకుని.. బుక్కయ్యారు!
చైనాలోని ఓ నగరంలో నగ్నంగా ఫొటోలు తీసుకుని వాటిని చైనీస్ సోషల్ మీడియా వైబోలో పోస్ట్ చేసినందుకు ఓ జంటను పోలీసులు అరెస్టు చేశారు. చైనాలోని యునాన్ రాష్ట్రంలో ఈ జంట నగ్నంగా ఫొటోలు తీసుకుని, వాటిని వైబోలో పెట్టారు. వాళ్లను 10-15 రోజుల పాటు తమ అదుపులోనే ఉంచుతామని పోలీసులు చెప్పారు. పర్యాటకులు ఎక్కువగా వస్తుండే డాలి పట్టణంలోనే వాళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే, వీళ్లిద్దరూ తమ కళను ప్రదర్శించడానికే అలా నగ్నంగా ఫొటోలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఒక యూత్ హాస్టల్ బయట, బార్ ముందు, మిడిల్ స్కూల్ దగ్గర ఈ ఫొటోలు తీసుకున్నారు. ఇది కొత్త ట్రెండ్ అని, ఫ్యాషన్ అని జనం అనుకోవచ్చు గానీ, పరమ దరిద్రంగా ఉందని ఒక యూజర్ కామెంట్ చేశారు. మిమ్మల్ని మీరు నగ్నంగా చూపించాలనుకుంటే చైనా నుంచి బయటకు పోవాలని మరో కామెంట్ వచ్చింది. ఆ పోస్ట్ చూసిన తర్వాత పోలీసులు వాళ్లను ట్రాక్ చేసి అరెస్టు చేశారు. ఇంటర్నెట్లో పోర్నోగ్రఫీని ప్రచారం చేస్తున్నందుకు వాళ్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. వాళ్లకు రూ. 30 వేల వరకు జరిమానా పడే అవకాశం ఉంది. -
క్షణాల్లో మిలియన్ ఫ్రెండ్స్.. ఐదులక్షల లైక్‌లు
బీజింగ్: క్షణాల్లో మిలియన్ స్నేహితులను సంపాధించుకోవడం ఇప్పుడు సాధ్యమేనా.. సాధ్యమే అని నిరూపించారు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీపెన్ హాకింగ్. చైనా వర్షన్‌కు చెందిన ట్విటర్ ఖాతాలో చేరిన కాసేపట్లోనే దాదాపు పది లక్షలమంది ఆయనను అనుసరించడం మొదలుపెట్టారు. ఆ సంఖ్య పెరుగుతుంది. భారత్‌లో ట్విట్టర్ వర్షన్ మాదిరిగా చైనాలో కూడా వైబో అనే ట్విటర్ మాధ్యమానికి చెందిన ఓ సామాజిక అనుసంధాన వేదిక ఉంది. అందులో హాకింగ్ మంగళవారం చేరారు. ఆయన చేరిన క్షణాల్లోనే అనూహ్యంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. వారి సంఖ్య పది లక్షలు దాటిపోయింది. ఇక ఆయన చేసిన తొలి పోస్టింగ్కైతే ఏకంగా ఐదులక్షల లైక్‌లు వచ్చాయి. 'చైనాలోని నా స్నేహితులందరికి శుభాకాంక్షలు. సోషల్ మీడియా ద్వారా చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని కలుసుకోగలుగుతున్నాను. నాజీవితాన్ని గురించి నేను చేస్తున్న పని గురించి మీకు దీని ద్వారా తెలపాలని అనుకుంటున్నాను. దీంతోపాటు మీరు తిరిగి సమాధానం ఇవ్వడం ద్వారా ప్రశ్నించడం ద్వారా కూడా మిమ్మల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను' అని హాకింగ్ అన్నారు. -
బాబోయ్.. నేను చచ్చిపోలేదు!
చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దాళ్ల వరకు ప్రతి ఒక్కరికీ అతడు ఫేవరెట్ నటుడు. ఫైటింగులకు ఫైటింగులు.. నవ్వులకు నవ్వులు. అతడెవరో ఈపాటికే అర్థమై ఉంటుంది కదూ.. అతడే అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ స్టార్ జాకీ చాన్. అలాంటి జాకీ చాన్ చచ్చిపోయాడంటూ ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక్కసారిగా గగ్గోలు పుట్టింది. దాంతో.. తాను బ్రహ్మాండంగా బతికే ఉన్నానని, తాను విమాన ప్రమాదంలో చనిపోయినట్లు వచ్చిన కథనాలు చూసి షాకయ్యానని జాకీచాన్ చెప్పుకోవాల్సి వచ్చింది. చైనా సోషల్ మీడియా వైబోలో తన పేరుతో 'రెడ్ పాకెట్స్' గురించి జరుగుతున్న స్కాంను కూడా నమ్మొద్దని ఇదే ప్రకటనలో ఇటు ట్విట్టర్లోను, అటు ఫేస్బుక్లో కూడా పెద్ద పోస్టింగ్ పెట్టాడు. తనకు ఒకే ఒక్క అఫీషియల్ వైబో పేజి ఉందని, అందువల్ల వేరే ఫేక్ పేజీలు చూసి మోసపోవద్దని కోరాడు. అమీర్‌ఖాన్ నటించిన 'పీకే' సినిమాను చైనాలో గతవారం చూసిన జాకీచాన్.. తన అభిమానుల కోసం పెద్ద లేఖనే రాశాడు. ప్రస్తుతం ఆయన కేన్స్‌లో జరుగుతున్న 68వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో బిజీగా ఉన్నాడు. I was shocked by two news reports when I got off the plane. First of all, don't worry! I'm still alive. Second,... http://t.co/EnvVR7OMqu — Jackie Chan (@EyeOfJackieChan) May 16, 2015 -
చైనా సోషల్ మీడియాలోనూ మోదీ హవా!
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా సోషల్ మీడియాలోనూ దూసుకుపోతున్నారు. గత వారం చైనా సోషల్ మీడియా ఖాతాను తెరిచిన మోదీ తన ఫాలోవర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నారు. చైనా ట్విటర్ గా పేర్కొనే 'వీబో'లో ఎకౌంట్ ఓపెన్ చేసిన ఆరు రోజుల్లోనే మోదీ 46 వేల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఒక విదేశీ నాయకుడు చైనా సోషల్ మీడియాలో ఈ రకమైన ఘనతను సాధించడం చాలా అరుదైన విషయంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో పాటు చైనా మీడియాలో కూడా మోదీ పర్యటనపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. చైనా డైలీ, గ్లోబల్ టైమ్స్ తదితర పత్రికలు మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. మే 14 నుంచి 16 వరకు చైనాలో పర్యటించనున్న మోదీ.. ఆ దేశాధినేతలతో చర్చలు జరుపుతారు. చైనా పర్యటనలో భాగంగా మోదీ జియాన్, బీజింగ్, షాంఘై నగరాల్లో పర్యటించనున్నారు. అనంతరం 17వ తేదీన మోదీ మంగోలియా చేరుకుంటారు. అక్కడి దేశాధినేతలతో మోదీ సమావేశం కానున్నారు. -
చైనా సోషల్ మీడియాను వదలని మోదీ
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్ర మోదీ మరో ముందడుగు వేశారు. చైనా సోషల్ మీడియాలోనూ ఖాతా తెరిచారు. చైనా ట్విటర్ గా పేర్కొనే 'వీబో'లో ఎకౌంట్ ఓపెన్ చేశారు. 'వీబో'లో చేరినట్టు ట్విటర్ ద్వారా తెలిపారు. చైనా భాషలో సందేశం పోస్ట్ చేశారు. 'హలో చైనా!.. వీబోతో చైనా స్నేహితులతో సంబంధాలను మరింత ముందుకు తీసుకెళతానని ట్విటర్ లో పేర్కొన్నారు. చైనా పర్యటనకు కొద్ది వారాల ముందు ఆయన 'వీబో'లో ఖాతా తెరవడం విశేషం. మోదీ చైనా పర్యటనను విజయవంతం చేసేందుకు ఇరుదేశాల ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముందని ఆసియా వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హాంగ్ జిలియన్ తెలిపారు. కాగా, కోటి 9 లక్షల 2 వేల 510 మంది ఫోలోవర్లతో ట్విటర్ లో మోదీ మూడో స్థానంలో ఉన్నారు.