న్యూఢిల్లీ: చైనాపై నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ సమ్మెను కొనసాగిస్తోంది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలపై పక్షపాతం చూపినందుకు 59 చైనా యాప్‌లను నిషేదించగా.. తాజాగా చైనా సోషల్ మీడియా బ్లాగింగ్ వెబ్‌సైట్ వీబో యాప్ నుంచి వైదొలగాలని ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో చైనీస్ మొబైల్ యాప్‌లను నిషేదించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే పీఎం మోదీ వీబో నుంచి వైదొలగుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మోదీ కొన్ని సంవత్సరాల క్రితం ట్విటర్‌కు సమానమైన చైనా యాప్ వీబోలో చేరారు. (నేపాల్ ప్రధానికి అండగా ఇమ్రాన్ ఖాన్!?)
అయితే నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. నరేంద్రమోదీ ఖాతా ఇంకా యాక్టివ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీబోలో వీఐపీ ఖాతాలు మూసివేయడానికి కొన్ని నిబంధనలు ఉండటంతో అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా.. గతంలో చైనీస్ యాప్‌లైన వీబో, వీచాట్ యాప్‌లు ప్రధాని మోదీ, భారత రాయబార కార్యాలయం చేసిన పోస్టులను ఏకపక్షంగా తొలగించిన విషయం తెలిసిందే. ఇలా తొలగించిన పోస్టుల్లో 20 మంది భారత సైనికులు అమరులైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యల వీడియో కూడా ఉంది. సరిహద్దు వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ జారీచేసిన ప్రకటనను సైతం ఇష్టారాజ్యంగా తొలగించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment