నెట్‌లో చక్కర్లు కొడుతున్న రెడ్‌మి 6 ప్రొ | Xiaomi Redmi 6 Pro Images Leak Before Launch | Sakshi
Sakshi News home page

నెట్‌లో చక్కర్లు కొడుతున్న రెడ్‌మి 6 ప్రొ

Published Thu, Jun 21 2018 6:25 PM | Last Updated on Thu, Jun 21 2018 6:26 PM

Xiaomi Redmi 6 Pro Images Leak Before Launch - Sakshi

లీకైన రెడ్‌మి 6 ప్రొ ఇమేజ్‌

షావోమి మరికొన్ని మూడు రోజుల్లో లాంచ్‌ చేయబోతున్న షావోమి రెడ్‌మి 6 ప్రొ ఇంటర్నెట్‌లో లీకైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సంబంధించిన ఇమేజ్‌లు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఎంఐ ప్యాడ్‌ 4 టాబ్లెట్‌తో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను జూన్‌ 25న కంపెనీ మార్కెట్‌లోకి లాంచ్‌ చేస్తోంది. తాజాగా లీకైన ఇమేజెస్‌లో స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ వివరాలు హైలెట్‌ అయ్యాయి. చైనీస్‌ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ వైబో ఈ ఇమేజ్‌లను లీక్‌చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎక్స్‌ మాదిరి టాప్‌-నాచ్‌ డిస్‌ప్లేను కలిగి ఉందని తెలుస్తోంది. టీనా లిస్టింగ్‌ కూడా ఈ ఫీచర్‌ను అంతకముందే రివీల్‌ చేసింది. అంతేకాక నిలువుగా అమర్చిన రెండు కెమెరాలను కూడా ఈ ఫోన్‌ కలిగి ఉందని లీక్‌ అయిన ఇమేజ్‌లు చూపిస్తున్నాయి. వెనుకవైపు సర్క్యూలర్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ను ఇది కలిగి ఉందట. 

ఎంఐయూఐ 9.6 ఆధారిత ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌తోనూ రెడ్‌మి 6 ప్రొ మార్కెట్‌లోకి వస్తుందని టాక్‌. టీనా లిస్టింగ్‌ అంతకముందు రివీల్‌ చేసిన దాని ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌కు 5.84 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే, ఆక్టాకోర్‌ సీపీయూ, 2 గిగాహెడ్జ్‌, 5ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉంటుందని తెలిసింది. రెడ్‌మి 6 ప్రొతో మార్కెట్‌లోకి వస్తున్న ఎంఐ ప్యాడ్‌ 4, 8 అంగుళాల స్క్రీన్‌తో మార్కెట్‌లోకి వస్తుందని కంపెనీ ఇప్పటికేధృవీకరించేసింది. అంతకముందు రిపోర్టుల ప్రకారం ఎంఐ ప్యాడ్‌కు క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 660 ఎస్‌ఓసీ, 13 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌, 5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటున్నాయని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement