ప్రతీకాత్మక చిత్రం
బీజింగ్ : చైనా కోర్టు వెల్లడించిన ఓ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ చర్చకు దారి తీసింది. విడాకులు ఇవ్వాలని భావించే వ్యక్తి.. గతంలో తన భార్య చేసిన ఇంటి పనికి కూడా డబ్బులు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ప్రస్తుతం ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. మహిళల పని పట్ల మీకు ఇంత చిన్న చూపా అంటు ఎక్కువ మంది విమర్శలు చేస్తుండగా.. కనీసం ఇప్పటికైనా గుర్తించారు అంటూ కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం అమల్లోకి వచ్చిన చైనా కొత్త సివిల్ కోడ్ ప్రకారం, విడాకులు తీసుకునే జంటల్లో.. వారు కలిసి ఉన్న రోజుల్లో భార్యలు ఇంట్లో ఎక్కువ బాధ్యతలు తీసుకుంటే అందుకు గాను వారు పరిహారం కోరవచ్చు. భరణం కాక ఇది అదనం. ఈ ఏడాదే చట్టం అమల్లోకి వచ్చింది.
ఆ వివరాలు.. చెన్-వాంగ్ దంపతులకు ఐదు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో కోర్టు ఆమెకు భర్త నుంచి భరణం ఇప్పించింది. ఇదిలా ఉండగా ఈ నెల 4 నుంచి కొత్త సివిల్ లా అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో వాంగ్ కొత్త చట్టం ప్రకారం తామిద్దరు కలిసి ఉన్న ఐదేళ్లలో ఇంటి పనులు చేసినందుకు గాను తనకు ఎక్స్‌ట్రా డబ్బులు చెల్లించాల్సిందిగా కోరుతూ బీజింగ్ కోర్టును ఆశ్రయించింది.
ఈ సందర్భంగా వాంగ్ ‘‘గడిచిన ఐదేళ్లలో ఇంటి పని, పిల్లల బాగోగులు అన్ని నేను చూసుకున్నాను. చెన్ కొంచెం కూడా నాకు హెల్ప్ చేసేవాడు కాదు. ఆఫీస్ బాధ్యతలు మాత్రమే నిర్వహించేవాడు. రోజంతా పిల్లలు, ఇంటి పనితో సరిపోయేది. ఈ మేరకు నాకు మరి కాస్త ఎక్కువ పరిహారం ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను’’ అన్నది. వాంగ్ వాదనలు విన్న కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఐదు సంవత్సరాలు పాటు వాంగ్ చేసిన ఇంటి పనికి గాను 7,700 డాలర్లు(5,56,937.15 రూపాయలు) చెల్లించాల్సిందిగా ఆదేశిస్తూ.. తీర్పు వెల్లడించింది.
ఈ తీర్పుపై చైనీస్ ట్విట్టర్ వీబోలో వాడివేడి చర్చ నడుస్తోంది. ‘‘ఇంట్లోనే ఉండే భార్యలు తాము చేసే పనికి 50 వేల యువాన్‌ల పరిహారాన్ని పొందవచ్చు’’ అనే హాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ తీర్పు పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మహిళలు ఎవరు ఇంటి పట్టున ఉండకూడదు. ఒకవేళ భవిష్యత్తులో మీరు విడాకులు పొందాలనుకుంటే.. మీకు ఎలాంటి పరిహారం లభించదు. ఇంటి పని చేస్తున్నందుకు గాను మీకు కేవలం 50 వేల పై చిలుకు యువాన్లు మాత్రమే లభిస్తుంది. ఏంటి ఈ ఖర్మ’’ అని కామెంట్ చేస్తుండగా.. ‘‘మరి కొందరు ఫుల్ టైం పిల్లలను చూసుకునే ఓ బామ్మ ఆరు నెలలకు గాను ఇంతకంటే ఎక్కువ ఫీజే తీసుకుంటుది. భార్యలు చేసే పని మీకు ఇంత చీప్‌గా కనిపిస్తుందా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో తీర్పుపై ఓ న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘‘జంట ఎన్ని సంవత్సరాలు వైవాహిక జీవితం గడిపారు.. వాంగ్ ఇంటి పని, చెన్ ఆదాయం, స్థానిక జీవన వ్యయం ఆధారంగా ఈ మొత్తాన్ని నిర్ణయించినట్లు’’ స్థానిక మీడియాలో పేర్కొన్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) అంచనా ప్రకారం, చైనా మహిళలు రోజూ దాదాపు నాలుగు గంటలు వేతనం లేని ఇంటి పనులు చేయడంలో గడుపుతారు. పురుషుల కంటే 2.5 రెట్లు మరియు సగటు కంటే ఎక్కువ.
చదవండి:
తాగుబోతు భర్తకు ఝలక్ ఇచ్చిన భార్య, దాంతో
కన్నీళ్లు తుడిచి.. కష్టాలు కడతేర్చి!
Comments
Please login to add a commentAdd a comment