చైనా సోషల్ మీడియాలోనూ మోదీ హవా! | Modi picks up 46,000 followers in 6 days | Sakshi
Sakshi News home page

చైనా సోషల్ మీడియాలోనూ మోదీ హవా!

Published Mon, May 11 2015 8:42 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

చైనా సోషల్ మీడియాలోనూ మోదీ హవా! - Sakshi

చైనా సోషల్ మీడియాలోనూ మోదీ హవా!

బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా సోషల్ మీడియాలోనూ దూసుకుపోతున్నారు. గత వారం చైనా సోషల్ మీడియా ఖాతాను తెరిచిన మోదీ తన ఫాలోవర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నారు.  చైనా ట్విటర్ గా పేర్కొనే 'వీబో'లో ఎకౌంట్ ఓపెన్ చేసిన ఆరు రోజుల్లోనే మోదీ 46 వేల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఒక విదేశీ నాయకుడు చైనా సోషల్ మీడియాలో ఈ రకమైన ఘనతను సాధించడం చాలా అరుదైన విషయంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.  దీంతో పాటు చైనా మీడియాలో కూడా మోదీ పర్యటనపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.  చైనా డైలీ, గ్లోబల్ టైమ్స్ తదితర పత్రికలు మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి.

 

మే 14  నుంచి 16 వరకు చైనాలో  పర్యటించనున్న మోదీ..  ఆ దేశాధినేతలతో చర్చలు జరుపుతారు.  చైనా పర్యటనలో భాగంగా మోదీ జియాన్, బీజింగ్, షాంఘై నగరాల్లో పర్యటించనున్నారు.  అనంతరం 17వ తేదీన మోదీ మంగోలియా చేరుకుంటారు. అక్కడి దేశాధినేతలతో మోదీ సమావేశం  కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement