
భోపాల్: కొన్ని శక్తులు దేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. భారతదేశ మత, సాంస్కృతిక సంప్రదాయాలను కొన్ని శక్తులు వ్యతిరేకిస్తున్నాయని ద్వజమెత్తారు. మహా కుంభమేళాను ఉద్దేశిస్తూ ఇటీవల ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై మోదీ ఘాటుగా స్పందించారు. వారంతా బానిస మనస్తత్వం కలిగిన వారిగా అభివర్ణించారు ప్రధాని మోదీ.
ఈ తరహా వ్యాఖ్యలతో దేశ ఐక్యతను దెబ్బ తీయడమే అవుతుంది కానీ దాని వల్ల కలిసొచ్చే ఏమీ లేదన్నారు. అనేక సార్లు విదేశీ శక్తులు సైతం ఈ వ్యక్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.విశ్వాసాలు, నమ్మకాలు, ఆలయాలు, మతం, సంస్కృతితో పాటు మన పండుగలు, సంప్రదాయాలు, ఆచారాలను వీరంతా మంటగలుపుతున్నారు. దాని ఫలితంగా దేశ ఐక్యతను దెబ్బతీయడమే వారు పనిగా పెట్టుకున్నారని మోదీ మండిపడ్డారు.
ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ లోని చత్తార్ పుర్లో భాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సెంటర్ సైన్స్ రీసెర్చ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హాజరైన ప్రజలను ఉద్దేశించిన మోదీ మాట్లాడారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులతో చాలా ప్రమాదకరమన్నారు. మన దేశ సాంప్రదాయలు, సంస్కృతిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారు బానిస మసనస్తత్వంతో ఉంటూ దేశ ఐక్యతను దెబ్బ తీయడానికి యత్నిస్తున్నాయన్నారు.
మహా కుంభ మేళాలో తొక్కిసలాల జరిగిన నాటి నుంచి అటు కేంద్ర ప్రభుత్వంపై ఇటు యూపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. మహా కుంభమేళా అనేది మృత్యు కుంభ్ మేళా అని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ వ్యాఖ్యానించగా, అఖిలేస్ యాదవ్, మల్లిఖార్జున ఖర్గే వంటి వారు సైతం తీవ్ర విమర్శలు చేశారు.