China social media
-
సీఈవో రాబిన్ లీకి చేదు అనుభవం
-
చైనా సోషల్ మీడియాలోనూ మోదీ హవా!
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా సోషల్ మీడియాలోనూ దూసుకుపోతున్నారు. గత వారం చైనా సోషల్ మీడియా ఖాతాను తెరిచిన మోదీ తన ఫాలోవర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నారు. చైనా ట్విటర్ గా పేర్కొనే 'వీబో'లో ఎకౌంట్ ఓపెన్ చేసిన ఆరు రోజుల్లోనే మోదీ 46 వేల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఒక విదేశీ నాయకుడు చైనా సోషల్ మీడియాలో ఈ రకమైన ఘనతను సాధించడం చాలా అరుదైన విషయంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో పాటు చైనా మీడియాలో కూడా మోదీ పర్యటనపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. చైనా డైలీ, గ్లోబల్ టైమ్స్ తదితర పత్రికలు మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. మే 14 నుంచి 16 వరకు చైనాలో పర్యటించనున్న మోదీ.. ఆ దేశాధినేతలతో చర్చలు జరుపుతారు. చైనా పర్యటనలో భాగంగా మోదీ జియాన్, బీజింగ్, షాంఘై నగరాల్లో పర్యటించనున్నారు. అనంతరం 17వ తేదీన మోదీ మంగోలియా చేరుకుంటారు. అక్కడి దేశాధినేతలతో మోదీ సమావేశం కానున్నారు. -
చైనా సోషల్ మీడియాను వదలని మోదీ
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్ర మోదీ మరో ముందడుగు వేశారు. చైనా సోషల్ మీడియాలోనూ ఖాతా తెరిచారు. చైనా ట్విటర్ గా పేర్కొనే 'వీబో'లో ఎకౌంట్ ఓపెన్ చేశారు. 'వీబో'లో చేరినట్టు ట్విటర్ ద్వారా తెలిపారు. చైనా భాషలో సందేశం పోస్ట్ చేశారు. 'హలో చైనా!.. వీబోతో చైనా స్నేహితులతో సంబంధాలను మరింత ముందుకు తీసుకెళతానని ట్విటర్ లో పేర్కొన్నారు. చైనా పర్యటనకు కొద్ది వారాల ముందు ఆయన 'వీబో'లో ఖాతా తెరవడం విశేషం. మోదీ చైనా పర్యటనను విజయవంతం చేసేందుకు ఇరుదేశాల ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముందని ఆసియా వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హాంగ్ జిలియన్ తెలిపారు. కాగా, కోటి 9 లక్షల 2 వేల 510 మంది ఫోలోవర్లతో ట్విటర్ లో మోదీ మూడో స్థానంలో ఉన్నారు.