నగ్నంగా ఫొటోలు తీసుకుని.. బుక్కయ్యారు! | chinese couple booked for posting naked photos in social media | Sakshi
Sakshi News home page

నగ్నంగా ఫొటోలు తీసుకుని.. బుక్కయ్యారు!

Published Sat, May 28 2016 10:27 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

నగ్నంగా ఫొటోలు తీసుకుని.. బుక్కయ్యారు! - Sakshi

నగ్నంగా ఫొటోలు తీసుకుని.. బుక్కయ్యారు!

చైనాలోని ఓ నగరంలో నగ్నంగా ఫొటోలు తీసుకుని వాటిని చైనీస్ సోషల్ మీడియా వైబోలో పోస్ట్ చేసినందుకు ఓ జంటను పోలీసులు అరెస్టు చేశారు. చైనాలోని యునాన్ రాష్ట్రంలో ఈ జంట నగ్నంగా ఫొటోలు తీసుకుని, వాటిని వైబోలో పెట్టారు. వాళ్లను 10-15 రోజుల పాటు తమ అదుపులోనే ఉంచుతామని పోలీసులు చెప్పారు. పర్యాటకులు ఎక్కువగా వస్తుండే డాలి పట్టణంలోనే వాళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే, వీళ్లిద్దరూ తమ కళను ప్రదర్శించడానికే అలా నగ్నంగా ఫొటోలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఒక యూత్ హాస్టల్ బయట, బార్ ముందు, మిడిల్ స్కూల్ దగ్గర ఈ ఫొటోలు తీసుకున్నారు. ఇది కొత్త ట్రెండ్ అని, ఫ్యాషన్ అని జనం అనుకోవచ్చు గానీ, పరమ దరిద్రంగా ఉందని ఒక యూజర్ కామెంట్ చేశారు. మిమ్మల్ని మీరు నగ్నంగా చూపించాలనుకుంటే చైనా నుంచి బయటకు పోవాలని మరో కామెంట్ వచ్చింది. ఆ పోస్ట్ చూసిన తర్వాత పోలీసులు వాళ్లను ట్రాక్ చేసి అరెస్టు చేశారు. ఇంటర్‌నెట్‌లో పోర్నోగ్రఫీని ప్రచారం చేస్తున్నందుకు వాళ్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. వాళ్లకు రూ. 30 వేల వరకు జరిమానా పడే అవకాశం ఉంది.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement