కొడుకు తల ఇరుక్కుంటే.. వీడియో తీస్తూ..! | china father Trolled For recording boy resuce operation | Sakshi
Sakshi News home page

కొడుకు తల ఇరుక్కుంటే.. వీడియో తీస్తూ..!

Published Tue, Oct 31 2017 5:12 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

china father Trolled For recording boy resuce operation - Sakshi

బీజింగ్ : బుడి బుడి అడుగులు వేసే తమ బుజ్జాయిలకు ఏదైనా చిన్నగాయం కావడం, లేదా వారు ఏడవడం చేస్తేనే తల్లిదండ్రుల మనసు చివుక్కుమంటుంది. కానీ ఓ నాలుగేళ్ల బుడ్డోడు బాల్కనీలో ఆడుకుంటుండగా పొరపాటున రెండు ఇనుపకడ్డీల మధ్య తల ఇరుక్కుపోయింది. సిబ్బంది చిన్నారిని కాపాడుతుంటే ఆ తండ్రి మాత్రం.. ఏ బాధ లేకుండా ఈ తతంగాన్ని వీడియో తీయడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. చైనాలోని ఫుజియన్ ప్రావిన్స్‌లోని పుటియన్ నగరంలో గత వారం ఈ ఘటన చోటుచేసుకుంది.

గతవారం ఇంటి బాల్కనీలో ఆడుకుంటుండగా ఆ చిన్నారి తల ఇనుపకడ్డీల మధ్య ఇరుక్కుపోయింది. వెంటనే ఆ బాలుడు.. డాడీ నన్ను కాపాడమంటూ ఆర్తనాదాలు చేశాడు. కొడుకు ఏడుపులు విన్న తండ్రి విషయాన్ని గమనించి అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేశాడు. వారు అక్కడికి చేరుకుని బాలుడి తలను అటూఇటూ కదుపుతూ బయటకు తీసే యత్నం చేస్తున్నారు ఆ సమయంలో ఆ బాలుడి తండ్రి తన సెల్ ఫోన్లో ఈ తతంగాన్ని తీరికగా వీడియో తీశాడు. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు బాలుడి తండ్రిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బాబు ఏడుస్తుంటే.. సముదాయించాల్సింది పోయి.. తీరికగా ఫొటోలు, వీడియోలు తీసి పోస్ట్ చేస్తావా? నువ్వు ఆ బాలుడి తండ్రివేనా అంటూ మరికొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement