China Gym Roof Collapse At Friendswood High School Kills Few, One Arrested Updates - Sakshi
Sakshi News home page

వీడియో: చైనాలో ఘోరం.. జిమ్‌ పైకప్పు కుప్పకూలి పలువురి దుర్మరణం

Published Mon, Jul 24 2023 9:56 AM | Last Updated on Mon, Jul 24 2023 10:14 AM

China Gym Roof collapse Kills Few one arrested Updates - Sakshi

బీజింగ్‌: చైనాలో ఘోరం జరిగింది. ఓ జిమ్‌ పైకప్పుకూలిపోయి పది మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. హెయిలాంగ్జియాంగ్‌ ప్రావిన్స్‌లో ఆదివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో  ఈ ఘటన చోటు చేసుకుంది. 

క్విక్విహార్‌లోని రోడ్‌.34 మిడిల్‌ స్కూల్‌లో ఈ జిమ్‌ ఉంది. ఆదివారం సాయంత్రం ఉన్నట్లుండి పైకప్పు కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.  పలువురిని శిథిలాల నుంచి బయటకు లాగాయి. 

అయితే ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆరుగురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందినట్లు స్థానికమీడియా సంస్థలు కథనం ప్రచురించాయి. భారీ వర్షం శిథిలాల తొలగింపు ప్రక్రియను అవాంతరం కలిగిస్తోంది. దీంతో ఇంకా పూర్తి కాకపోవడంతో.. వాటి కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement