
విశాల్ (ఫైల్)
కంటోన్మెంట్: జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన మారేడుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు సికింద్రాబాద్ గ్యాస్‌మండీ ప్రాంతానికి చెందిన యంజాల విశాల్ (30) ఆసిఫ్ నగర్‌లోనే పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతను రెగ్యులర్‌గా మారేడుపల్లిలోని హెచ్2ఓ జిమ్‌లో కసరత్తు చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం 7.00 గంటల సమయంలో జిమ్‌కు వెళ్లాడు. వార్మప్ చేస్తున్న క్రమంలోనే జిమ్‌లోనే కుప్పకూలిపోయాడు. జిమ్ నిర్వాహకులు 108కు సమాచారం అందించి, ఆంబులెన్స్‌లో యశోదా ఆసుపత్రికి తరలించారు. అయితే విశాల్ అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు ధ్రువీకరించారు. విశాల్ కసరత్తు చేస్తూ జిమ్‌లో కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment