roof collapsed
-
కూలిన మరో ఎయిర్పోర్ట్ టెర్మినల్ రూఫ్.. మూడు రోజుల్లో రెండో ఘటన
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టెర్మినల్ రూఫ్ ఘటనను మరిచిపోకముందే గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది.భారీ వర్షం కారణంగా రాజ్‌కోట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వెలువల ఉన్న పైకప్పు శనివారం కుప్ప కూలిపోయింది. ప్రయాణికుల పికప్, డ్రాప్ పాయింట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.VIDEO | Canopy collapses at the passenger pickup and drop area outside #Rajkot airport terminal amid heavy rains. (Source: Third Party) pic.twitter.com/gsurfX2O1S— Press Trust of India (@PTI_News) June 29, 2024 కాగా శుక్రవారం ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1 వద్ద పైకప్పు కూలిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దుమ్నా ఎయిర్‌పోర్టులో భారీ వర్షాల కారణంగా టెర్మినల్ రూప్ పడిపోయింది. కాగా గుజరాత్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసిందిశనివారం దక్షిణ గుజరాత్‌కు 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. -
కుప్పకూలిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై కప్పు
-
కుప్పకూలిన జిమ్ పైకప్పు.. పలువురి మృతి
బీజింగ్: చైనాలో ఘోరం జరిగింది. ఓ జిమ్ పైకప్పుకూలిపోయి పది మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. హెయిలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లో ఆదివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్విక్విహార్లోని రోడ్.34 మిడిల్ స్కూల్లో ఈ జిమ్ ఉంది. ఆదివారం సాయంత్రం ఉన్నట్లుండి పైకప్పు కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. పలువురిని శిథిలాల నుంచి బయటకు లాగాయి. అయితే ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆరుగురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందినట్లు స్థానికమీడియా సంస్థలు కథనం ప్రచురించాయి. భారీ వర్షం శిథిలాల తొలగింపు ప్రక్రియను అవాంతరం కలిగిస్తోంది. దీంతో ఇంకా పూర్తి కాకపోవడంతో.. వాటి కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 【#黑龍江 一中學體育館樓頂坍塌 已致10人死亡】 🇨🇳23日,黑龍江 #齊齊哈爾 市的一所中學的體育館樓頂發生坍塌。事故發生時體育館內共有19人,其中4人自行脫險,15人被困。截至24日凌晨三點,被困人員中已有9人死亡,4人被救出無生命危險,仍有2人被困。#China #Heilongjiang pic.twitter.com/IQEVhQytuZ — 鳳凰衛視PhoenixTV (@PhoenixTVHK) July 24, 2023 -
ఘోర ప్రమాదం: 23 మంది మృతి
ఘజియాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లో భవనం కూలి సుమారు 23 మంది వరకూ మృత్యువాత పడ్డారు. మురాద్‌నగర్ శ్మశానవాటిక కాంప్లెక్స్‌లో పైకప్పు కూలిపోయింది. రామ్ ధాన్ అనే వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడానికి 25మందికి పైగా శ్మశానానికి వెళ్లారు. కాగా, ఆ సమయంలో వర్షం రావడంతో వారంతా శ్మశానంలో ఉన్న కాంప్లెక్స్‌లో వెళ్లగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు అక్కడిక్కడే మరణించగా, కొంతమంది ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: అడ్వాన్స్ ఇవ్వలేదని ప్రయాణికురాలి పీక కోశాడు..) -
స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో గోడ కూలి మహిళ మృతి
సాక్షి, చిత్తూరు: తిరుపతి స్విమ్స్ శ్రీ పద్మావతి స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో ఆదివారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనం గ్రౌండ్, మొదటి అంతస్తును కరోనా వార్డుగా వినియోగిస్తున్నారు. పై మూడంతస్తుల నిర్మాణం పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 10.10 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న ఓ గోడ కూలి విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా వర్కర్ రాధిక(37)పై పడింది. అలాగే, కరోనా బారిన పడి చికిత్స కోసం ఆస్పతిలోకి ప్రవేశిస్తున్న మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. పెద్ద పెట్టున గోడకూలిన శబ్దానికి సిబ్బంది, కరోనా బాధితులు హడలిపోయారు. తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో ఉన్న రాధికను అంబులెన్స్‌లో స్విమ్స్ అత్యవసర విభాగానికి తరలించగా అప్పటికే మృతిచెందారు. విషయం తెలుసుకున్న మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఘటనా స్థలానికి చేరుకొని, గాయపడిన వారికి కరోనా వార్డులోనే చికిత్స చేస్తున్నారు. గోడ కూలిన ఘటన స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం పరిశీలించారు. గోడ కూలడానికి గల కారణలు తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులు, వారి కుటంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన చెప్పారు. -
తమిళనాడులో ఘోర ప్రమాదం
-
తమిళనాడులో ఘోర ప్రమాదం
సాక్షి, చెన్నై : తమిళనాడు నాగపట్నం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొరయార్‌లో టీఎన్ఎస్టీసీ బస్ డిపో గ్యారేజీ పైకప్పు కూలి తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో వారిలో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నాగపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. వీరంతా విధులు ముగించుకుని, విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పురాతనమైన ఈ భవనం పైకప్పు కూలిపోయినట్లు తెలిపారు. మృతుల్లో నలుగురు మెకానిక్‌లు, ముగ్గురు డ్రైవర్స్, ఓ కండక్టర్ ఉన్నారు. మృతులను మునియప్ప, చంద్రశేఖర్, ప్రభాకర్, రామలింగం, మణివన్నన్, ధనపాల్, అన్బరసన్, బాలుగా గుర్తించారు. ఇక తీవ్రంగా గాయపడినవారిలో వెంకటేశన్, సెంథిల్, ప్రేమ్‌కుమార్ ఉన్నారు. కాగా పురాతనమైన భవనం ఏ క్షణంలో అయినా కూలే ప్రమాదం ఉందని తెలిపినా అధికారులు పట్టించుకోలేదని మృతుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం మృతుల ఒక్కో కుటుంబానికి రూ.7.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.1.50 లక్షల పరిహారం చెల్లించనుంది. -
గురుద్వారాపై పిడుగు.. కూలిన పైకప్పు
బ్రిటన్‌లోని లీసెస్టర్ నగరంలో ఓ గురుద్వారాపై పిడుగుపడింది. దాంతో దాని పైకప్పు కూలిపోయినా.. అదృష్టవశాత్తు భక్తులంతా బయటపడ్డారు. లీసెస్టర్ నగరంలోని రాంగర్హియా గురుద్వారాలో దాదాపు 11 మంది పెద్దవయసు మహిళలు ప్రార్థనలు చేస్తుండగా, ఉన్నట్టుండి పిడుగు పడి, పైకప్పునకు రంధ్రం పడింది. దీంతో భక్తులంతా భయపడి బయటకు పరుగులు తీశారు. కాసేపటికే పైకప్పుతో పాటు వెనకవైపు గోడ కూడా కూలిపోయింది. అయితే అప్పటికే పిడుగు శబ్దం విన్న భక్తులు బయటకు పరుగులు తీయడంతో కేవలం ఒక్క వ్యక్తికి మాత్రం కొద్దిపాటి గాయాలయ్యాయి. అదే ఒక అరగంట ముందు గనక పిడుగు పడి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని, అప్పుడు దాదాపు 250 మంది భక్తులు లోపల ఉన్నారని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఇండీ పనేసర్ తెలిపారు. ఎవరూ గాయపడకపోవడం దేవుడి దయ అని, పైకప్పు కూలిపోయినా కూడా ఆలయంలోని పవిత్ర గ్రంథాలు కూడా ఏమాత్రం పాడవ్వలేదని ఆయన చెప్పారు. భజనలు చేస్తున్న వృద్ధమహిళల్లో ఒకరు వాటిని జాగ్రత్తగా తీసుకుని సురక్షిత ప్రదేశంలో పెట్టారని, ఇది కూడా చాలా అదృష్టమేనని పనేసర్ అన్నారు.