
ఘజియాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లో భవనం కూలి సుమారు 23 మంది వరకూ మృత్యువాత పడ్డారు. మురాద్‌నగర్ శ్మశానవాటిక కాంప్లెక్స్‌లో పైకప్పు కూలిపోయింది. రామ్ ధాన్ అనే వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడానికి 25మందికి పైగా శ్మశానానికి వెళ్లారు. కాగా, ఆ సమయంలో వర్షం రావడంతో వారంతా శ్మశానంలో ఉన్న కాంప్లెక్స్‌లో వెళ్లగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు అక్కడిక్కడే మరణించగా, కొంతమంది ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: అడ్వాన్స్ ఇవ్వలేదని ప్రయాణికురాలి పీక కోశాడు..)
Comments
Please login to add a commentAdd a comment