
సాక్షి, చెన్నై : తమిళనాడు నాగపట్నం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొరయార్‌లో టీఎన్‌ఎస్‌టీసీ బస్ డిపో గ్యారేజీ పైకప్పు కూలి తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో వారిలో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నాగపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. వీరంతా విధులు ముగించుకుని, విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పురాతనమైన ఈ భవనం పైకప్పు కూలిపోయినట్లు తెలిపారు. మృతుల్లో నలుగురు మెకానిక్‌లు, ముగ్గురు డ్రైవర్స్, ఓ కండక్టర్ ఉన్నారు. మృతులను మునియప్ప, చంద్రశేఖర్, ప్రభాకర్, రామలింగం, మణివన్నన్, ధనపాల్, అన్బరసన్, బాలుగా గుర్తించారు. ఇక తీవ్రంగా గాయపడినవారిలో వెంకటేశన్, సెంథిల్, ప్రేమ్‌కుమార్ ఉన్నారు. కాగా పురాతనమైన భవనం ఏ క్షణంలో అయినా కూలే ప్రమాదం ఉందని తెలిపినా అధికారులు పట్టించుకోలేదని మృతుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం మృతుల ఒక్కో కుటుంబానికి రూ.7.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.1.50 లక్షల పరిహారం చెల్లించనుంది.
Comments
Please login to add a commentAdd a comment