బస్సులో కోడిపుంజు మర్చిపోయిన ప్రయాణికుడు.. అధికారులు ఏం చేశారంటే! | Passenger Forgot Rooster In RTC Bus Karimnagar Officials Announce Auction, See Details Inside - Sakshi
Sakshi News home page

Karimnagar: ఆసక్తికరంగా కోడిపుంజు వ్యవహారం.. కరీంనగర్‌ బస్టాండ్‌లో బహిరంగ వేలం

Published Thu, Jan 11 2024 3:54 PM | Last Updated on Thu, Jan 11 2024 5:01 PM

Passenger Forgot Rooster In RTC Bus Karimnagar Officials Announce auction - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ ఆర్టీసీ డిపోలో కోడిపుంజు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల క్రితం ఓ ప్రయాణికుడు ఆర్టీసీ బస్‌లో మర్చిపోయిన కోడిపుంజును డిపో అధికారులు జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. అయితే మూడు రోజులుగా కోడింపుజును తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోడంతో తాజాగా అధికారులు దానిని వేలంపాట వేసేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం కోడిపుంజును వేలం వేయనున్నట్లు, ఆసక్తిగలవారు పాల్గొనాలని కరీంనగర్‌-2 డిపో మేనేజర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

వివరాలు.. జనవరి 9న వరంగల్‌ నుంచి ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వేములవాడ వెళ్లింది. అక్కడ ప్రయాణికులను దించేసి తిరిగి కరీంనగర్‌ డిపోకు చేరుకోగా బస్సులో కోడిపుంజు ఉండటాన్ని డ్రైవర్‌, కండక్టర్‌ గుర్తించాడు. ఓ ప్రయాణికుడు సంచిలో ఉన్న కోడిపుంజును మరిచిపోయినట్లు తెలుసుకొని దానిని కంట్రోలర్‌కు అప్పగించారు. కోడిపుంజును డిపోలోని 2డిపో భ‌ద్ర‌త విభాగం ఆర్టీసీ అధికారులు ఓ జాలిలో బంధించారు.

మూడు రోజుల నుంచి బస్టాండ్‌ డిపోలోనే కోడిపుంజు బంధీగా ఉంటుంది. అయితే పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో దానిని వేలం వేయాలని నిర్ణయించారు ఆర్టీసీ అధికారులు. ఈ మేరకు కరీనంగర్‌-2 డిపో మేనేజర్‌ పేరిటా పత్రికా ప్రకటన విడుదల చేశారు. జనవరి 12న మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజుకు సంబంధించి కరీంనగర్‌ బస్‌ స్టేషన్‌ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు, ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని తెలిపారు. 
చదవండి: పెద్దపల్లి: పుట్టామధుకు అవిశ్వాస గండం?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement