Bus Depot
-
బస్సులో కోడిపుంజు మర్చిపోయిన ప్రయాణికుడు.. అధికారులు ఏం చేశారంటే!
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ ఆర్టీసీ డిపోలో కోడిపుంజు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల క్రితం ఓ ప్రయాణికుడు ఆర్టీసీ బస్‌లో మర్చిపోయిన కోడిపుంజును డిపో అధికారులు జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. అయితే మూడు రోజులుగా కోడింపుజును తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోడంతో తాజాగా అధికారులు దానిని వేలంపాట వేసేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం కోడిపుంజును వేలం వేయనున్నట్లు, ఆసక్తిగలవారు పాల్గొనాలని కరీంనగర్-2 డిపో మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాలు.. జనవరి 9న వరంగల్ నుంచి ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వేములవాడ వెళ్లింది. అక్కడ ప్రయాణికులను దించేసి తిరిగి కరీంనగర్ డిపోకు చేరుకోగా బస్సులో కోడిపుంజు ఉండటాన్ని డ్రైవర్, కండక్టర్ గుర్తించాడు. ఓ ప్రయాణికుడు సంచిలో ఉన్న కోడిపుంజును మరిచిపోయినట్లు తెలుసుకొని దానిని కంట్రోలర్‌కు అప్పగించారు. కోడిపుంజును డిపోలోని 2డిపో భద్రత విభాగం ఆర్టీసీ అధికారులు ఓ జాలిలో బంధించారు. మూడు రోజుల నుంచి బస్టాండ్ డిపోలోనే కోడిపుంజు బంధీగా ఉంటుంది. అయితే పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో దానిని వేలం వేయాలని నిర్ణయించారు ఆర్టీసీ అధికారులు. ఈ మేరకు కరీనంగర్-2 డిపో మేనేజర్ పేరిటా పత్రికా ప్రకటన విడుదల చేశారు. జనవరి 12న మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజుకు సంబంధించి కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు, ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని తెలిపారు. చదవండి: పెద్దపల్లి: పుట్టామధుకు అవిశ్వాస గండం? -
బస్ డిపోలో రజనీకాంత్ సందడి.. ఫోటోలు వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ జీవితం గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి.. తనదైన నటన, స్టైల్‌తో సూపర్ స్టార్‌గా ఎదిగాడు. అంతకు ముందు కుటుంబ పోషణ కోసం బస్ కండక్టర్‌గా పని చేశాడు. కొన్నాళ్ల తర్వాత ఉద్యోగం వదిలేసి చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు. కెరీర్ తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఆ తర్వాత విలన్‌గానూ నటించాడు. చాలా కాలం తర్వాత హీరోగా అవకాశం రావడం.. బాక్సాఫీస్ వద్ద అవి విజయవంతం కావడంతో రజనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం తమిళనాడు వరకే పరిమితమైన అభిమాన దళం... ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించింది. డెభై ఏళ్ల వయసులో కూడా రజనీ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ప్రస్తుతం ఆ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు రజనీకాంత్. The man who never forgets his roots despite earning in crores. ||#Rajinikanth | #Jailer | #600CrJailer|| pic.twitter.com/M9l4zcFTsJ — Manobala Vijayabalan (@ManobalaV) August 29, 2023 ఎంత ఎదిగినా..ఒదిగే సాధారణంగా ఏ హీరో అయినా తొలినాళ్లలో చాలా సింపుల్‌గా ఉంటాడు. ఒకటి రెండు హిట్లు పడితే చాలు.. మాట, యూటిట్యూడ్.. అన్నీ మారిపోతాయి. ఫ్యాన్స్‌కు దూరంగా ఉంటారు. కానీ రజనీకాంత్ అలా కాదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారు. సైడ్ క్యారెక్టర్లు చేసే స్థాయి నుంచి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగినా.. ఆయన మాట, ప్రవర్తనలో మార్పు రాలేదు. సూపర్‌స్టార్ అనే గర్వం కొంచెం కూడా ఉండదు. చాలా సింపుల్‌గా జీవితాన్ని గడిపేందుకే రజనీ ఇష్టపడతాడు. బస్ డిపోలో రజనీ సందడి సినిమాల్లోకి రాకముందు రజనీ బెంగళూరులోని బీఎంటీసీ బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేశాడు. తాజాగా ఆయన ఆ బస్ డిపోకి వెళ్లి సందడి చేశాడు. కొద్ది సేపు బస్ స్టేషన్ అంతా తిరిగి.. పాత రోజులను గుర్తు చేసుకున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులతో ముచ్చటించారు. ఎలాంటి సమాచారం లేకుండా వచ్చిన సూపర్‌స్టార్ రజనీని చూసి అక్కడి సిబ్బంది ఆశ్యర్యపోయింది. అతనితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. రజనీ కూడా చాలా ఓపిగ్గా అందరితో సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. రజనీకాంత్ సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. Just IN: #Rajinikanth made a surprise visit today to Bengaluru, Jayanagar Bus🚌🚏 Depot where he started his career as conductor. SELF made superstar for a reason! ||#Jailer | #600CrJailer|| pic.twitter.com/iYNXDWZmDD — Manobala Vijayabalan (@ManobalaV) August 29, 2023 Thalaivar #Rajinikanth @ @BMTC_BENGALURU depot in Jayanagar. pic.twitter.com/i2g756Vynq — ChristinMathewPhilip (@ChristinMP_) August 29, 2023 -
వివాదాస్పదంగా మారిన తెలంగాణ ఆర్టీసీ ఫ్లెక్సీలు
-
పుంజుకున్న ఆర్టీసీ.. లాభాలబాట పట్టించిన శుభ ముహూర్తాలు
శుభ ముహూర్తాలు ఆర్టీసీని లాభాల బాటపట్టించాయి. ఏప్రిల్‌లో రోజువారీ సగటు ఆదాయం రూ.11.50 కోట్లకు పడిపోయి జీతాలిచ్చేందుకు సంస్థ ఇబ్బందిపడ్డ పరిస్థితి మారి.. ప్రస్తుతం రోజువారీ సగటు ఆదాయం రూ.15.50 కోట్లుగా నమోదవుతోంది. దీంతో తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో తొలిసారి 45 డిపోలు లాభాల్లోకి చేరాయి. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 74 శాతంగా నమోదవుతోంది. శుభముహూర్తాలు కొనసాగినన్ని రోజులు పరిస్థితి మెరుగ్గా ఉండనుంది. అలాగే, రానున్న వానాకాలంలోనూ ఓఆర్ పడిపోకుండా చూడాలని ఆర్టీసీ భావిస్తోంది. రికార్డు స్థాయి లాభాలతో.. తెలంగాణ ఆర్టీసీ ఏర్పడిన స్వల్ప కాలానికే ఏకంగా 44 శాతం ఫిట్ మెంట్‌తో వేతన సవరణ జరిగింది. దీంతో ఆర్టీసీపై సాలీనా రూ.850 కోట్ల భారం పడింది. అనంతరం పర్యవేక్షణ లోపించడంతో ఆర్టీసీ పనితీరు దిగజారింది. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన నష్టాల కంటే తెలంగాణ ఆర్టీసీ నష్టాలు పెరిగిపోయాయి. డిపోలన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఇన్నాళ్లకు తొలిసారి 96 డిపోలకు 45 డిపోలు లాభాల్లోకి వచ్చాయి. ఏప్రిల్‌లో శుభకార్యాలు లేకపోవడంతో ఓఆర్ 58 శాతానికి పడిపోయి, రోజు వారీ ఆదాయం సగటున రూ.11.50 కోట్లకు పరిమితమైంది. మేలో ముహూర్తాల కాలం ప్రారంభం కావటంతో ఒకటో తేదీ నుంచి ఆర్టీసీ పుంజుకుంది. ఆదాయం రూ.16 కోట్లను మించి నమోదుకాగా, సగటున వారం రోజులుగా రూ.15.50 కోట్ల మేర వస్తోంది. లాభాల్లో ఉన్న డిపోలు ఇవే.. షాద్‌నగర్, తొర్రూరు, ఆదిలాబాద్, అచ్చంపేట, తాండూరు, జనగామ, వేములవాడ, బీహెచ్ఈఎల్, మహేశ్వరం, మెట్పల్లి, మధిర, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తి, నార్కెట్‌పల్లి, సూర్యాపేట, జహీరాబాద్, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, పరిగి, నారాయణపేట, సిరిసిల్ల, కొత్తగూడెం, జగిత్యాల, మణుగూరు, గద్వాల, కరీంనగర్–1, భద్రాచలం, నల్లగొండ, సత్తుపల్లి, కోదాడ, దేవరకొండ, వరంగల్–1, పికెట్, యాదగిరిగుట్ట, హైదరాబాద్–2, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్, ఖమ్మం, వనపర్తి, హైదరాబాద్–1, మియాపూర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, నారాయణ్‌ఖేడ్. చదవండి: ప్రియాంక ‘యువ సంఘర్షణ సభ’.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు -
అలిపిరి బస్ డిపోకు మొదటి దశలో 50 ఎలక్ట్రిక్ బస్ లు
-
కండక్టర్‌ను వదిలేసి బస్సు రయ్
కర్ణాటక : కండక్టర్‌ను డ్రైవరు మరచిపోయి బస్సుతో బయల్దేరాడు. కొన్ని కిలోమీటర్లు వెళ్లాక సంగతిని తెలుసుకుని బస్సును నిలిపాడు. ఈ సంఘటన కొప్పళ జిల్లా బస్టాండులో చోటుచేసుకుంది. బస్సు కెఎ–37,ఎఫ్–0678, కొప్పళ బస్టాండ్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరింది. దాదాపు 5 కి.మీ ప్రయాణించిన తరువాత ఓజనహళ్లి వద్దకు చేరుకోగా ప్రయాణికులు టికెట్ కోసం కండక్టర్ ఏడీ అని వెతకసాగారు. అప్పుడు బస్సు డ్రైవర్‌కు అర్థమైంది. వెంటనే అక్కడే బస్సును ఆపివేసి కండక్టర్‌కు కాల్ చేశారు. మీ వల్ల ఆలస్యమైందని ప్రయాణికులు డ్రైవర్‌కు చీవాట్లు పెట్టారు. కండక్టర్ బస్సు ఎక్కకపోతే నేనేం చేయాలని డ్రైవర్ వాపోయాడు. కండక్టర్ మరో బస్సులో అక్కడికి చేరుకుని టికెట్లు కొట్టడంతో అంతా సద్దుమణిగింది. -
నార్కట్ పల్లి బస్సు డిపో మూతపడనుందా..?
-
మేడ్చల్ బస్ డిపోలో కండక్టర్ ఆత్మహత్యాయత్నం
మేడ్చల్‌రూరల్: జీతాలు సకాలంలో రావడం లేదని, అధికారుల వేధింపులకు గురి చేస్తున్నారని మనస్థాపం చెందిన మేడ్చల్ ఆర్టీసీ డిపోలో పనిచేసే కండక్టర్ శనివారం ఉదయం మేడ్చల్ బస్ డిపో ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వివరాలివీ... శామీర్‌పేట్ మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన అశోక్ 14 సంవత్సరాలుగా మేడ్చల్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. కొంత కాలంగా జీతాలు సమయానికి రాకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని... ప్రతి నెల 5లోగా జీతాలు ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రి, అధికారులు సకాలంలో ఇవ్వడం లేదంటూ ఈ నెల 16న అశోక్ మేడ్చల్ బస్ డిపోలో వేతనాలు సమయానికి ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కార్మికులంతా ఏకం కావాలని కోరారు. అయితే డిపోలో ధర్నా చేసినందుకు అప్పటి నుంచి డిపో మేనేజర్ మాధవి, డిపో సీఐ స్వాతి, టీఐ–2 నర్సింహ్మలు తనకు డ్యూటీలు సరిగా వేయకుండా వేధింపులకు గురి చేస్తున్నారని మనస్థాపానికి గురైన అశోక్ శనివారం ఉదయం డిపో ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. గమనించిన తోటి కార్మికులు అతడి నుంచి అగ్గిపెట్టె లాక్కుని అడ్డుకున్నారు. అనంతరంæ కార్మికులు అశోక్‌ను సముదాయించి ఇంటికి పంపించారు. జీతాలు సరిగా రావడం లేదని నిరసన వ్యక్తం చేసిన అశోక్‌పై అధికారులు వేధింపులకు పాల్పడటంతోనే ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. -
అవినీతిలో ఆమెకు ఆమే సాటి
సాక్షి, హన్మకొండ : ఆర్టీసీలో అవినీతికి పాల్పడంలో ఆమెదీ అందె వేసిన చేయి. అధికారులను ప్రసన్నం చేసుకోవడంలోనూ దిట్ట! ఇదీ అసిస్టెంట్ మేనేజర్(మెకానిక్) తీరుపై ఆర్టీసీ ఉద్యోగ వర్గాల్లో సాగుతున్న చర్చ. ఆమె ఉద్యోగంలో చేరిన నాటి నుంచి కొద్ది రోజులు మినహా మొత్తం జిల్లా కేంద్రంలోని డిపోలోనే విధులు నిర్వర్తించింది. వరంగల్–2 డిపోలో పనిచేసిన కాలంలో ఓ డ్రైవర్ నడిపినప్పుడు బస్సు కొద్దిగా డ్యామేజీ అయితే రూ.10 వేలు జరిమానా విధించడమే కాకుండా ఆ డబ్బును సొంతానికి వాడుకుంది. దీనిపై అప్పట్లో ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా స్పందించిన అధికారులు నర్సంపేట డిపోకు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఆర్టీసీలో రూపాయి అవినీతకి పాల్పడినట్లు తేలితే కండక్టర్లు, ఇతర చిన్న ఉద్యోగులను వెంటనే సస్పెండ్ లేదా రిమూవల్ చేయడమో ఆనవాయితీ. కానీ ఈ అధికారి రూ.10 వేలు కాజేసిన అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా కేవలం బదిలీతో సరిపెట్టారు. ఫలితంగా ఆమె ఇప్పుడు ఏకంగా రూ.3,03.823కు ఎసరు పెట్టింది. ఇంటికి పనికి వచ్చే విడిభాగాలను డిపో నుంచి తీసుకెళ్లడంతో పాటు సంస్థ ఉద్యోగులను సొంత పనులకు వాడుకున్నారనే విమర్శలు కూడా ఆమెపై ఉన్నాయి. అంతా నేనే చూసుకుంటా... ఆర్టీసీ ఉద్యోగులు గతేడాది దీర్ఘకాలిక సమ్మె చేపట్టగా సదరు ఉద్యోగికి కలిసి వచ్చింది. ఇదే అదునుగా అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం. అక్టోబర్‌లో సమ్మె ప్రారంభం కాగా సెప్టెంబర్‌లో మెకానికల్ విభాగంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఐదుగురిని నియమించారు. అయితే, వీరు ఎప్పుడూ విధులకు హాజరుకానున్న హాజరు నమోదు, వేతనాల బిల్లు సిద్ధం చేయగా, రెండింటికీ పొంతన కుదరకపోవడంతో అధికారులు ఇటీవల కూపీ లాగగా వాస్తవం బయటపడింది. వరంగల్ – 1 డిపో మేనేజర్ అస్వస్థతకు గురై సెలవులో వెళ్లగా జూలై, ఆగస్టులో అసిస్టెంట్ మేనేజర్(మెకానిక్) అయిన మహిళా అధికారికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అప్పటికే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల బిల్లులు సిద్ధమైనా డీఎంకు అనుమానం రావడంతో పక్కన పెట్టారు. ఆ తర్వాత ఆయన సెలవులో వెళ్లడంతో ఇన్చార్జ్గా నియమితులైన మహిళా ధికారి పక్కకు పడేసిన బిల్లులు తీసి వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయానికి పంపారు. అక్కడి అకౌంట్స్ సెక్షన్ వారు ఈఎస్ఐ, పీఎఫ్ లేదని అభ్యంతరం చెబుతూ వెనక్కి పంపించారు. దీంతో సమ్మె కారణంగా ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించలేదని సమాధానం రాసి తిరిగి బిల్లులు ఆర్ఎం కార్యాలయానికి పంపించగా, రూ.3,03,823 ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి మంజూరు చేశారు. కానీ ఉద్యోగుల నియామకం కాగితాలపైనే జరిగినందున ఆ నిధులను తనకు ఇవ్వాలని సూచించడంతో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ బాధ్యులు ఆమె ఖాతాలో రూ.2.50 లక్షలు జమ చేశారు. ఈ వ్యవహారమంతా విజిలెన్స్ విచారణలో బయటపడింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని తనకు మెకానికల్ సెక్షన్లో ఉద్యోగులు కావాలని కోరితే లేరని చెప్పినా వినకుండా ఒప్పందం చేయించినట్లు సమాచారం. ఆ తర్వాత కాగితాలపైనే ఉద్యోగుల నియామకం చేపట్టి వేతనాల బిల్లులు చేయించి డబ్బు స్వాహా చేసినట్లు తేలింది. దీనిపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుండగా, సంబంధిత డిపో మేనేజర్ శాఖాపరమైన విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. ఇక విజిలెన్స్ అధికారులు సైతం వచ్చే మంగళవారం కరీనంగర్‌లో జరిగే విచారణకు హాజరుకావాలని సదరు మహిళా అధి కారితో పాటు సెక్షన్ ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. బాధ్యులపై చర్యలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పేరిట రూ.3లక్షలకు పైగా స్వాహా చేసిన విషయమై ఆర్ఎం అంచూరి శ్రీధర్ స్పందిచారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని తెలిపారు. విచారణ అనంతరం తప్పు చేసిన వారు ఎవరైనా చర్యలు ఉంటాయని వెల్లడించారు. -
రెండో రోజూ అదే సీన్
సాక్షి, హైదరాబాద్: సమ్మె విరమించిన నేపథ్యంలో విధుల్లో చేరేందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు డిపోల వద్దకు చేరుకుంటున్నారు. మంగళవారం ఉదయం తొలి డ్యూటీకి వస్తే అధికారులు నిరాకరించడంతో వెనుదిరిగిన కార్మికులు.. బుధవారం మళ్లీ వచ్చారు. పోలీసులు అడ్డుకున్నా, అరెస్టు చేసినా భయపడకుండా బుధవారం 6 గంటలకే సంబంధిత డిపోల వద్దకు చేరుకోవాలన్న జేఏసీ నేతల పిలుపుతో సూర్యోదయం కంటే ముందే వారు డిపోల వద్దకు చేరుకున్నారు. అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్న నేపథ్యంలో అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చిన పోలీసులు కార్మికులను డిపోలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. సమ్మె విరమించినా తమను ఎందుకు అనుమతించడంలేదని వారితో వాగ్వాదానికి దిగారు. 97 డిపోల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో కార్మికులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోకపోవడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ ఇదే పరిస్థితి పునరావృతమైతే గురువారం కార్మికశాఖ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయనున్నట్లు కార్మికులు తెలిపారు. మరోవైపు విధుల్లో చేరేందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు డిపోల ముందు ఆందోళన చేస్తున్నా అధికారులు మాత్రం తాత్కాలిక సిబ్బందితో యథాప్రకారం బస్సులు నడిపించారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 73శాతం బస్సులు తిప్పినట్లు వారు పేర్కొన్నారు. 1,907 అద్దె బస్సులు సహా మొత్తం 6,564 బస్సులు తిప్పినట్లు తెలిపారు. 4,657 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,564 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరైనట్లు పేర్కొన్నారు. 6,488 బస్సుల్లో టిమ్ యంత్రాలు వాడారని, 68 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేశారని వెల్లడించారు. -
నేడు బస్ భవన్,డిపోల వద్ద 144 సెక్షన్
-
నేడు డిపోల వద్ద 144 సెక్షన్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల జేఏసీ శనివారం తలపెట్టిన బస్‌రోకోకు ఎలాంటి అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నగరంలోని బస్ భవన్‌తో పాటు డిపోల వద్ద 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఇది శనివారం తెల్లవారుజామున 3గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3గంటల వరకు వర్తిస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రూపులుగా ఏర్పడి ఆందోళన చేయొద్దని, బస్సుల రాకపోకలు అడ్డుకుంటే ఉపేక్షించబోమన్నారు. నగరంలో ఇలాంటి చర్యల వల్ల విద్య, వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బందులు కలుగుతాయని, నిబంధనలు పాటించాలని సూచించారు. -
బస్టాండ్ల వద్ద 144 సెక్షన్
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని అన్ని బస్‌డిపోలు, బస్టాండ్ల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయాలని కలెక్టర్ సత్యనారాయణ ఆర్డీవోలను ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. ఆర్టీసీ స మ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లుగా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయించాలన్నారు. ప్రైవేట్ బస్సులు, స్కూల్‌బస్సులు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. బస్సుల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఎస్పీ శ్వేత అధికారులకు సూచించారు. కంట్రోల్ రూంతో అనుసంధానం కలిగి ఉండాలన్నారు. సమ్మె నేపథ్యంలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఆయా నంబర్లకు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. వీసీలో జేసీ యాదిరెడ్డి, ఆర్టీఏ వాణి, డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎంవీఐ శ్రీనివాసరావు, కామారెడ్డి బస్‌డిపో డివిజనల్ మేనేజర్ గణపతిరాజు తదితరులు పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్స్ వివరాలు.. జిల్లా పోలీసు కంట్రోల్‌రూం, ఎస్పీ కార్యాలయం ఫోన్ నంబర్లు : 9490617633, 08468–226633 కామారెడ్డి బస్ డిపో కంట్రోల్ రూం నంబర్ : 08468–220281 బాన్సువాడ బస్‌డిపో కంట్రోల్ రూం నంబర్ : 8985061830 కామారెడ్డి ఆర్డీవో : 9491036892 బాన్సువాడ ఆర్డీవో : 9492022593 కామారెడ్డి డీఎస్పీ : 9440795426 బాన్సువాడ డీఎస్పీ : 9490617639 ఆర్టీఏ నంబర్ : 9618430721 -
నోట్లు మాకు.. చిల్లర మీకు
సాక్షి, ముంబై: ఇక నుంచి బస్ డిపోల్లో నోట్లు అందజేసి చిల్లర పట్టుకెళ్లండని బెస్ట్ సంస్థ కోరుతోంది. చిల్లర కావాలనుకునే వారు అన్ని బెస్ట్ బస్ డిపోలలో ఆదివారం, ఇతర సెలవు రోజులు మినహా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు నోట్లు ఇచ్చి చిల్లర నాణేలు పొందవచ్చని సూచించింది. ముంబై నగరంలోని వివిధ బస్ డిపోలలో నోట్లకు బదులుగా చిల్లర డబ్బులు మార్పిడి చేసుకునే సౌలభ్యం బెస్ట్ సంస్థ కల్పించింది. దీంతో వ్యాపార సంస్థలు చిల్లర కోసం అవస్థలు పడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒకప్పుడు చిల్లర కోసం బస్ కండక్టర్, ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగేది. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. బెస్ట్ సంస్థ బస్ చార్జీలు తగ్గించినప్పటికీ చిల్లర నాణేల బెడద పట్టి పీడించసాగింది. ప్రతీరోజు ముంబైలోని వివిధ బస్ డిపోలలో డ్యూటీ అయిపోగానే ఒక్కో కండక్టరు వేల రూపాయలు విలువచేసే చిల్లర నాణేలు జమ చేస్తున్నాడు. ఇలా నగరంలోని 24 బస్ డిపోలలో నిత్యం రూ.లక్షలు విలువచేసే చిల్లర నాణేలు బెస్ట్ ఖజానాలో పోగవుతున్నాయి. కొద్ది రోజులు ఇలాగే సాగితే వీటిని భద్రపరిచేందుకు కూడా స్థలం కొరత ఏర్పడనుంది. దీంతో వీటిని ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వాటిని లెక్కించి తీసుకునే ఓపిక బ్యాంకు సిబ్బందికి కూడా లేదు. దీంతో అవి డిపోలలోనే మూలుగుతున్నాయి. చివరకు షాపులకు, బిగ్ బజార్, టోల్ ప్లాజా కేంద్రాలకు చిల్లర డబ్బులు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. నోట్లు తీసుకురండి, చిల్లర డబ్బులు పట్టుకెళ్లండని నినదించనుంది. షాపులకు పంపిణీ.. బెస్ట్ సంస్థ రెండు నెలల కిందట బస్ చార్జీలు తగ్గించింది. కనీస చార్జీలు రూ.8 నుంచి రూ.5కు తగ్గించింది. అంతేగాకుండా 8 కిలోమీటర్ల వరకు కనీస చార్జీలే వసూలు చేయడంతో బెస్ట్ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దీని ప్రభావం షేర్ ఆటో, ట్యాక్సీల వ్యాపారంపై తీవ్రంగా చూపింది. చార్జీలు తగ్గించకముందు ప్రతీరోజు సగటున 22–23 లక్షల మంది ప్రయాణించేవారు. చార్జీలు తగ్గించిన తరువాత ఈ సంఖ్య ఏకంగా 32 లక్షలకు పెరిగిపోయింది. భవిష్యత్తులో మరింత పెరగనుంది. దీంతో రూ.1,2,5,10 విలువచేసే నాణేలు కండక్టర్ క్యాష్ బ్యాగ్‌లో నిత్యం వేలల్లో పోగవుతున్నాయి. ప్రతీ కండక్టర్ డ్యూటీ దిగే ముందు డిపోలలో ఉన్న క్యాష్ కౌంటర్వద్ద వేలల్లో చిల్లర నాణేలు జమచేస్తున్నాడు. ఇలా ప్రతీరోజు 24 బస్ డిపోలలో రూ.11–12 లక్షల వరకు చిల్లర డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో వీటిని సామాన్య ప్రజలకు, వ్యాపారులకు, షాపు యజమానులకు, బిగ్ బజార్, టోల్ ప్లాజా కేంద్రాలకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. చిల్లర కావాలనుకునే వారు అన్ని బెస్ట్ బస్ డిపోలలో ఆదివారం, ఇతర సెలవు రోజులు మినహా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు నోట్లు ఇచ్చి చిల్లర నాణేలు పొందవచ్చని సూచించింది. -
డొక్కు బస్సులే దిక్కు !
సాక్షి, హుస్నాబాద్,మెదక్: రవాణా సౌకర్యం మెరుగుపడినా బస్సుల సంఖ్య పెరగడం లేదు. ఎక్స్‌ప్రెస్ బస్సులు అసలు కనిపించడమే కరువయ్యాయి. డిపో ప్రారంభం అయినప్పుడు ఎన్ని బస్సులున్నాయో? నేటికీ అదే సంఖ్యలో బస్సులు ఉండటం గమనార్హం. స్క్రాప్ బస్సుల పేరిట ఇక్కడి నుంచి బస్సులను పక్కనబెడుతున్నా.. వాటి స్థానంలో మళ్లీ పాత బస్సులకే కలరింగ్ చేసి వినియోగిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరిగినా.. బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. పెద్ద బస్సుల స్థానంలో మినీ బస్సులను తెచ్చి డిపోను మరింత నష్టాల్లోకి నెట్టేశారు. హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో మొత్తం 54 బస్సులున్నాయి. ఇందులో ఆర్టీసీకి చెందిన 4 ఎక్స్‌ప్రెస్‌లు, 2 సూపర్ లగ్జరీ, 25 ఆర్డినరీ, 11 మిని పల్లె వెలుగు బస్సులున్నాయి. అలాగే 2 అద్దె బస్సులు(ఎక్స్‌ప్రెస్), 10 హైర్‌విత్ ఆర్డీనరీ బస్సులు నడుస్తున్నాయి. బస్సుల నిర్వాహణకు గాను 89 మంది డ్రైవర్లు, 94 మంది కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. హ్నుస్నాబాద్ డిపో ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. డిపోలోని మొత్తం 54 బస్సుల్లో చాలా వరకు కాలం చెల్లినవే ఉన్నాయి. మినీ బస్సులు తక్కువ దూరంలో ఉన్న గ్రామాల్లో నడిపించి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ సేవలు అందించాల్సింది. అంతే కాకుండా కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఈ బస్సులను నడిపించడంతో కొత్తదనం ఏమీలేదు. లాంగ్రూట్లల్లో ఈ బస్సులు నడిపించే పరిస్ధితి లేదు. మినీ బస్సుల ఉద్దేశం, లిమిటెడ్ స్టేజీలు, దాదాపు 20 కి.మీ దూరంలో ఉన్న గ్రామాలకు మాత్రమే నడపాలి. కరీంనగర్, హుజురాబాద్, సిద్దిపేట, హన్మకొండ రూట్లల్లో ఈ మినీ బస్సులను నడిపిస్తున్నారు. ఈ రూట్లలో గతంలో పెద్ద బస్సులు నడిచేవి. అవి కాలం చెల్లడంతో మినీ బస్సును నడిపిస్తున్నారు. పెద్ద బస్సులు 55 సీట్ల కెపాసిటీ ఉండగా, మినీ బస్సుల్లో కేవలం 35 సీట్ల కెపాసిటీ మాత్రమే. ఈ బస్సులను నడిపించడంతో పరోక్షంగా ఆటోలకు అశ్రయం కల్పించడమే అవుతోంది. అసలే చిన్న బస్సులు ఆపై వన్‌మెన్ సర్వీస్ వెరసి డ్రైవర్లపై అదనపు భారం పడుతోంది. హుస్నాబాద్ నుంచి కరీంనగర్‌కు వెళ్లాలంటే, 9 స్టేజీలతో పాటు, హుస్నాబాద్ పట్టణంలోనే ఆరు స్టేజీలుంటాయి. ఇంచుమించు డ్రెవర్ 15 స్టేజీల్లో బస్సు ఆపుకుంటూ టికెట్లు ఇస్తూ ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయడమంటే ఎంత ఇబ్బందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఆదాయంలో కోత, డ్రైవర్లకు అదనపు పని భారం, కండక్టర్ల కుదింపు, మరో వైపు ప్రయాణికులకు అసౌకర్యం.. ఇన్ని రకాల ఇబ్బందులు డిపోకు శాపంగా మారాయి. కనిపించని ఎక్స్‌ప్రెస్‌లు నాలుగు జిల్లాలకు ప్రధాన డివిజన్ కేంద్రంగా ఉన్న హుస్నాబాద్‌కు నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్టుంటారు. ప్రతి రోజు పట్టణాలు, నగరాలకు ఇక్కడి నుంచి వెళ్తుంటారు. అందుకు తగ్గట్లుగా ఇక్కడి నుంచి ఎక్స్‌ప్రెస్ సర్వీసులు లేవు. లాంగ్ రూట్లకు ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లు లేకపోవడం డిపో నష్టానికి ఇదో కారణమని అభిప్రాయ పడుతున్నారు. ఉన్న ఒక్క ఎక్స్‌ప్రెస్ బస్సులో హైదరాబాద్‌కు వెళ్లాలంటే సీట్లు దొరకని పరిస్ధితి. గతంలో బాసర, గోదావరిఖని, భద్రాచలం, యాదగిరి గుట్ట, మంచిర్యాల వంటి పట్టణాలకు లాంగ్ సర్వీస్‌లు నడిచేవి. ప్రస్తుతం ఈ లాంగ్ సర్వీస్‌లను పూర్తిగా రద్దు చేశారు. హుస్నాబాద్ కేంద్రం నుంచి ఏటూ 40 కి.మీ దూరంలో ఉన్న జిల్లా కేంద్రాలు వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, జనగామకు వెళ్లాలంటే పల్లె వెలుగు బస్సులే దిక్కవుతున్నాయి. డిపోకు ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులు కేటాయించకపోతే డిపొ మూసివేత బాట పడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. డిపో ఇప్పటికే రూ.6 నుంచి 7 కోట్ల వరకు నష్టాల్లో ఉందని తెలుస్తోంది. జిల్లాల పునర్విభజన కాకముందు హుస్నాబాద్ డిపో కరీంనగర్ రీజియన్ పరిధిలో ఉండేది. హుస్నాబాద్‌ను సిద్దిపేట జిల్లాలో కలిపిన తర్వాత అధికారులు, కార్మిక సంఘాల నాయకులు ఏ పనికి వెళ్లాలన్నా సంగారెడ్డికి వెళ్లాల్సిన పరిస్థితి. ఉన్నతాధికారులకు నివేదించాం.. హుస్నాబాద్: పాత బస్సులైనా కండిషన్ ఉన్న బస్సులనే కేటాయిస్తున్నారు. ఈ ప్రాంతం చుట్టూ అన్నీ అర్డినరీ రూట్లు ఉన్నాయి. హుస్నాబాద్ నుంచి గోదావరిఖనికి ఎక్స్‌ప్రెస్ నడిపిస్తున్నా.. అనుకున్న స్థాయిలో కలెక్షన్ రావడం లేదు. వాస్తవానికి ఎక్స్‌ప్రెస్‌లతో ఆదాయం పెరుగుతుంది. హుస్నాబాద్ నుంచి వరంగల్ టు సిద్దిపేటకు ఎక్స్‌ప్రెస్ బస్సులు నడిపిస్తే లాభమే ఉంటుంది. ఈ రూట్లో పర్మిట్ లేదు. ఆర్డినరీ బస్సులను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి లాంగ్ రూట్లకు నడిపిద్దామంటే కార్మికులు ఎక్కువ కిలోమీటర్లని సహకరించడం లేదు. ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికులు, సిబ్బంది, అధికారులు కలిసి పని చేస్తేనే డిపో పురోగతి సాధిస్తుంది. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. –రజనీకృష్ణ, డిపో మేనేజర్, హుస్నాబాద్ దీర్ఘకాలికంగా నష్టపోతారు.. మెయిన్ రోడ్డులో చిన్న బస్సులు నడపడం వల్ల ప్రయాణికులు నష్టపోతారు. అందుకే కండక్టర్లు, డ్రైవర్లు ఉన్న పెద్ద బస్సులనే నడిపించాలి. చిన్న బస్సులను లిమిటెడ్ స్టేజీలు ఉన్న గ్రామాలకు నడిపిస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. లేదంటే డిపోకు నష్టం వస్తుంది. డిపోకు ఎక్స్‌ప్రెస్ బస్సులతోనే ఆదాయం. వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్‌తో పాటుగా లాంగ్ రూట్లల్లో ఎక్కువ మొత్తంలో ఎక్స్‌ప్రెస్ బస్సులు నడిపిస్తే తప్పా డిపోకు మనుగడ ఉండదు. –పందిల్ల శంకర్, స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు, హుస్నాబాద్ -
అమ్మో.. ఎలుగుబంటి..!
సాక్షి, జనగామ: అది జనగామ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయం.. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయం.. కార్యాలయం సమీపంలో ఓ నల్లటి ఆకారం... ఏదో జంతువు మాదిరిగా అటూ ఇటూ తిరుగుతోంది.. అది గమనించిన కొంత మంది యువకులు దగ్గరగా వెళ్లి చూస్తే ఎలుగుబంటి.. వారు భయభయంగానే దానిని తరిమివేసేందుకు ప్రయత్నించారు.. అది నేరుగా ఆర్టీసీ డిపోలో చొరబడి ఓ చెట్టెక్కి కూర్చొంది. విషయం తెలుసుకున్న ఆర్టీసీ, పోలీసు, అటవీశాఖల అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎలుగుబంటి కిందకు దిగే ప్రయత్నం చేయడంతో చెట్టుచుట్టూ ముళ్లకంపను వేశారు. పెద్ద ఎత్తున జనాలు గుమిగూడటంతో అది మరింత పైకి వెళ్లింది. చివరకు నాలుగు మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన అధికారులు ఎలాగోలా భల్లూకాన్ని బంధించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎలా వచ్చింది... చంపక్‌హిల్స్ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటి పసరమడ్ల, శామీర్‌పేట గ్రామాల మీదుగా 2.30 గంటలకు జనగామ పట్టణానికి చేరుకుంది. రోడ్డుపై వస్తున్న ఎలుగుబంటిని చూసిన కొమురవెల్లి స్పెషల్ ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రయాణికులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. డీసీసీ కార్యాలయం సమీపంలోని కుర్మవాడలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఎలుగుబంటిని ఆ సమయంలో అక్కడే ఉన్న పలువురు యువకులు కర్రలతో బెదిరించారు. దీంతో అది పరుగులు పెడుతూ ఆర్టీసీ బస్ డిపోలోకి చొరబడింది. గుడ్డేలుగును చూసి అందులో ఉన్న పలువురు సిబ్బంది లగెత్తారు. డిపోలోని ప్రహరీ పక్కనే వరంగల్ రోడ్డును ఆనుకుని ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కింది. 6 గంటలకు పారెస్ట్ అధికారులకుసమాచారం.. ఉదయం ఆరు గంటల సమయంలో ఫారెస్ట్ అధికారులకు గుడ్డేలుగు వచ్చిన సమాచారాన్ని అధికారులు అందించారు. మత్తుమందు.. డాక్టర్.. రెస్క్యూ టీం.. బోను.. వలలను వెంట బెట్టుకుని తొమ్మిది గంటలకు జనగామకు చేరుకున్నారు. జూసంరక్షణ పశువైద్యాధికారి ప్రవీణ్ కుమార్ గన్ సహాయంతో వరుసగా రెండుసార్లు మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు. పదిహేను నిమిషాల తర్వాత కూడా గుడ్డేలుగు స్పృహలోనే ఉండడంతో.. మరో మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఇరవై నిమిషాలు నిరీక్షించినా.. గుడ్డేలుగు కొంతమేర తప్పటడుగులు వేసినా.. మరుక్షణమే తేరుకుంది. అప్పటికే డిపో లోపలి భాగంతో పాటు వరంగల్ హైవే పై చెట్టుకు రెండు వైపులా వలలు వేసి సిద్ధంగా ఉంచారు. చెట్టు పై నుంచి కిందకు ఎంతకూ రాకపోవడంతో గుడ్డేలుగును కర్రల సహాయంతో కిందకు నెట్టేసే ప్రయత్నం చేయడంతో.. వారిపైకి వచ్చే ప్రయత్నం చేసి.. మళ్లీ పైకి వెళ్లింది. ఇరవై నిమిషాల తర్వాత మెళ్లగా చెట్టు దిగే ప్రయత్నంలో వలలో పడేలా శతవిధాలా ప్రయత్నం చేశారు. చెట్టుపై నుంచి బస్‌డిపో గోడపై ఉన్న ఫెన్సింగ్ తీగలను చొచ్చుకుని..అందులో ప్రవేశించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫారెస్ట్ సిబ్బందితో పాటు ఆర్టీసీ సివిల్ ఇంజినీర్ బాబాపైకి గుడ్డేలుగు పరుగులు పెట్టడంతో వణికిపోయారు. తప్పించుకుందామనుకునే లోపే... గుడ్డేలుగు వారి పైకి వచ్చేసినంత పని చేసింది. ఆ సమయంలోనే అక్కడే న్న రోడ్డు రోలర్‌కు గుడ్డేలుగు బలంగా తాకడంతో... వారు తృటిలో ప్రా ణాపాయం నుంచి తప్పించుకున్నారు. స్వల్ప గా యంతో ఇబ్బందులు పడ్డ గుడ్డేలుగు.. డిపోలోని సిబ్బంది రెస్ట్ తీసుకునే గది వెనకకు వచ్చి చేరింది. వలతో అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు. గంటన్నర పాటు ముప్పు తిప్పలు.. డిపోలో చొరబడ్డ గుడ్డేలుగును పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ముప్పుతిప్పలు పడ్డారు. మూడు మత్తు ఇంజక్షన్లు ఇచ్చినా.. అటు వైపు వెళ్లిన వారిపైకి వచ్చేందుకు ప్రయత్నించిం ది. ప్రహరీ దూకి భవానీనగర్ వైపు వెళ్లేందుకు ఒకటికి రెండు సార్లు ప్రయత్నించి విఫలమైంది. గుడ్డేలుగును పట్టుకునే విజువల్స్‌ను కవరేజ్ చేస్తున్న మీడియాపైకి సైతం రంకెలు వేయడంతో పరుగులు పెట్టారు. రెండుసార్లు వలలో చిక్కినట్టే చిక్కుకుని.. సంకెళ్లను తెంపుకుని బయటకు వచ్చింది. అతికష్టం మీద...11.05 నిమిషాలకు గుడ్డేలుగును పట్టుకుని.. బోనులో బంధించారు. అనంతరం మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన ప్రదేశంలో.. ప్రాథమిక పరీక్షలు చేసి...ఏటూరునాగారం– తాడ్వాయి అటవీ ప్రాంతానికి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ అర్బన్, జనగామ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రామలింగం పర్యవేక్షించగా, ఎఫ్ఆర్ఓలు శ్రీనివాస్‌కుమార్, మంగీలాల్ రేంజ్ ఆఫీసర్ పున్నంచందర్, కంపౌండర్ ఆకేష్, రిస్క్ టీం నాగేశ్వరావు, స్వామి, క్రిష్ణ ఉన్నారు. అడవిలో ఆహారం లేకనే అడవులు అంతరించి పోతుండడంతో మూగ జీవాలు జనావాసాల్లోకి వస్తున్నాయని డీఎఫ్ఓ రామలింగం అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుమారు 12 సంవత్సరాల వయస్సు కలిగి.. 80 కేజీలు ఉంటుందన్నారు. అడవుల్లో తాగునీటి కొరత లేకుండా సాసర్ కుండీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి గాయాలు లేకుండా.. యాక్టివ్‌గా ఉండడంతో.. జనావాసాలు లేని తాడ్వాయి– ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో వదిలి పెడతామన్నారు. చెట్టు పైనుంచి సురక్షితంగా కిందకు దింపేందుకే సమయం ఎక్కువగా తీసుకున్నామన్నారు. -డీఎఫ్ఓ రామలింగం -
కోస్గిలో బస్ డిపో
సాక్షి, ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్న కోస్గి బస్‌డిపో విషయంలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. దాదాపు ఆరేళ్లుగా ఊరిస్తున్న బస్‌డిపో అంశంపై ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. స్వయంగా సీఎం కేసీఆర్ బస్ డిపోకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. మంగళవారం సీఎం కేసీఆర్‌ను కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతోపాటు మాజీ ఎమ్మెల్యే గురున్నాథ్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి తదితరులు కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలు అంశాలను ప్రస్తావించారు. అందులో భాగంగానే సీఎం కోస్గి పోలీస్ సర్కిల్, ఫైర్‌స్టేషన్, దౌల్తాబాద్, బొంరాస్‌పేటలకు జూనియర్ కాలేజీల ఏర్పాటుకు అంగీకారం తెలిపారని తెలిసింది. వాటికి సంబంధించిన ఉత్తర్వులు బుధవారం వెలువడనున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా ఎదురుచూపు కోస్గి బస్‌డిపో కోసం నియోజకవర్గ ప్రజలు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. గత ఆరేళ్లుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక విధంగా ప్రస్తుతం కూడా బస్‌డిపో చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. వాస్తవానికి కొడంగల్ నియోజకవర్గానికి కేంద్ర బిందువైన కోస్గిలో బస్‌డిపో ఏర్పాటు చేయాలనేది ఎంతో కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ప్రజల్లో ఉన్న డిమాండ్ మేరకు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నిధుల నుంచి రూ.కోటి నిధులు కూడా మంజూరు చేయించారు. అలాగే ప్రభుత్వ స్థలం అందుబాటులో లేక 2013లో 5ఎకరాల స్థలాన్ని కొని ప్రభుత్వానికి అందజేశారు. అందుకు అనుగుణంగా అప్పట్లో ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్న ఎం.సత్యనారాయణ శిలాఫలకం కూడా వేశారు. తదనంతర పరిణామాలలో బస్‌డిపో విషయం మరుగున పడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పలుమార్లు అసెంబ్లీతో పాటు పలు బహిరంగ వేధికల మీద ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.. కొడంగల్ నియోజకవర్గంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి వీడి కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు వడివడిగా జరుగుతున్నాయి. అంతేకాదు తరచూ మంత్రులు పర్యటిస్తూ ప్రజల నుంచి వచ్చే డిమాండ్లకు ఎప్పటికప్పుడు పచ్చజెండా ఊపుతున్నారు. కేవలం 3నెలల వ్యవధిలో రూ.కోట్లాది విలువ చేసే అభివృద్ధి పనులను చేపట్టారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచని వాటికి కూడా మోక్షం లభిస్తోంది. దీంతో తాజాగా రెండు వర్గాలు కూడా ఆ క్రెడిట్ తమ వల్లే అంటూ ఒకరికొకరు ఆదిపత్యం ప్రదర్శిస్తున్నారు. -
తమిళనాడులో ఘోర ప్రమాదం
-
తమిళనాడులో ఘోర ప్రమాదం
సాక్షి, చెన్నై : తమిళనాడు నాగపట్నం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొరయార్‌లో టీఎన్ఎస్టీసీ బస్ డిపో గ్యారేజీ పైకప్పు కూలి తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో వారిలో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నాగపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. వీరంతా విధులు ముగించుకుని, విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పురాతనమైన ఈ భవనం పైకప్పు కూలిపోయినట్లు తెలిపారు. మృతుల్లో నలుగురు మెకానిక్‌లు, ముగ్గురు డ్రైవర్స్, ఓ కండక్టర్ ఉన్నారు. మృతులను మునియప్ప, చంద్రశేఖర్, ప్రభాకర్, రామలింగం, మణివన్నన్, ధనపాల్, అన్బరసన్, బాలుగా గుర్తించారు. ఇక తీవ్రంగా గాయపడినవారిలో వెంకటేశన్, సెంథిల్, ప్రేమ్‌కుమార్ ఉన్నారు. కాగా పురాతనమైన భవనం ఏ క్షణంలో అయినా కూలే ప్రమాదం ఉందని తెలిపినా అధికారులు పట్టించుకోలేదని మృతుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం మృతుల ఒక్కో కుటుంబానికి రూ.7.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.1.50 లక్షల పరిహారం చెల్లించనుంది. -
బస్సు డిపోలో షార్ట్‌సర్క్యూట్
- ఉరుములు, మెరుపులతో కాలిపోయిన యూపీఎస్ - పని చేయని కంప్యూటర్లు.. ఎస్ఆర్ షీట్ లేక నిలిచిన బస్సులు హుస్నాబాద్: బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సమస్య నెలకొని యూపీఎస్ కాలిపొయింది. దీంతో బస్సులు డిపోలోనే రెస్ట్ తీసుకుంటున్నాయి. హుస్నాబాద్ బస్సు డిపోలో నాలుగు రోజులుగా షార్ట్‌సర్క్యూట్ సమస్యతో కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఆదివారం డిపో సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెల రేగా యి. దీంతో డిపోలో షార్ట్‌సర్క్యూట్ సమస్య తలెత్తింది. రెండు విద్యుత్ మీటర్లకుగాను ఒకటి కాలిపోయింది. మరో మీటర్‌తో కార్యకలాపాలను కొనసాగిస్తుండగా బుధవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసి, పిడుగు పడింది. మరోసారి డిపోలో షార్ట్‌సర్క్యూట్ సమస్య తలెత్తి యూపీఎస్ కాలిపోయి కంప్యూటర్లు మొరాయించాయి. రెండేళ్లుగా మాన్యువల్ టికెట్ల పంపిణీ ప్రక్రియను నిలిపివేశారు. కంప్యూటర్లలో టికెట్ నంబర్లు, బస్సు నంబరు, డ్రైవర్, కండక్టర్ పేర్లతో కూడిన ఎస్ఆర్ షీట్ విడుదలయ్యాకే.. బస్సులు డిపోనుంచి రోడ్లకు పైకి వస్తాయి. యూపీ ఎస్ కాలిపోవడంతో ఎస్ఆర్ షీట్ జారీకాక బస్సులు నిలిచిపోయాయి. మొత్తం 53 బస్సులకుగాను బుధవారం ఉదయం 12 బస్సులు బయటకు వచ్చాయి. హైదరాబా ద్‌కు బస్సులు నడవకపోవడంతో ప్రయాణి కులు ఇబ్బందులకు గురవుతున్నారు. -
మిర్యాలగూడ డిపో ఎదుట ఉద్రిక్తత
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బస్‌డిపో ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఔట్సోర్సింగ్ కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఆందోళన నిర్వహిస్తున్న స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కార్మికులకు ఏఐటీయూసీ తమ మద్దతు తెలిపింది. సోమవారం ఉదయం నుంచే డిపో ఎదుట పెద్ద ఎత్తున కార్మికులు బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు యత్నించగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
కరీంనగర్లో కొనసాగుతున్న బంద్
కరీంనగర్: నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె కరీంనగర్ జిల్లాలో సంపూర్ణంగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాలయాలు సంపూర్ణంగా బంద్ పాటిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాలో 11 డిపోలలో మొత్తం 980 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామగుండం ప్రాంతంలో సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. రామగుండం ఎన్టీపీసీలో 9 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో విద్యుత్ ఉత్పత్తికి ఎక్కడా అంతరాయ లేకండా పర్మనెంట్ ఉద్యోగులతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు బంద్‌ను పర్యవేక్షిస్తుండగా.. ఉపాధ్యాయులు సమ్మెకు తమ సంఘీభావం తెలిపారు. -
మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం
♦ 280 కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం ♦ ఉత్తమ డ్రైవర్లు, కండక్టర్లకు అవార్డులు ♦ రాష్ట్ర రవాణాశాఖామంత్రి మహేందర్‌రెడ్డి చేవెళ్ల : తెలంగాణ రాష్ట్రంలోని 95 బస్ డిపోలలో వసతులను మెరుగుపరచడానికి, ఆధునికరించడానికి ప్రభుత్వం 32 కోట్ల రూపాయలను మంజూరు చేసిం దని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చెప్పారు. కోటి రూపాయల వ్యయంతో చేవెళ్ల మండల కేంద్రంలోని బస్‌స్టేషన్ విస్తరణ పనులను టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని బస్‌డిపోలు, బస్స్టేషన్లలో ప్రయాణికులకు పూర్తిస్థాయి వసతులు కల్పించడానికి ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలోని పలు బస్‌డిపోలు, బస్స్టేషన్లను ఆధునీకరించడానికి, విస్తరించడానికి 11కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. వీటిలో సీసీరోడ్లు, టాయిలెట్లు, మంచినీరు, తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కొత్తగా 280 బస్సులను కొనుగోలు చేస్తున్నామన్నారు. వీటిలో 80 ఏసీ బస్సులు, 200 బస్సులు ఎక్స్‌ప్రెస్‌లని అన్నారు. తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి కృషిచేస్తున్నామన్నారు. ప్రతి బస్‌డిపోలో ఉత్తమ సేవలను అందించిన కండక్టర్, డ్రైవర్లకు ప్రోత్సాహక బహుమతులు, అవార్డులు అందజేస్తామన్నారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీకి పలు బస్సుల ద్వారా ఏడాదికి సుమారుగా 900 కోట్ల రూపాయలు నష్టం వస్తున్నా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందజేస్తామన్నారు. పల్లెవెలుగు బస్సు ల ద్వారా సంవత్సరానికి రూ. 550కోట్ల నష్టం, సిటీ సర్వీసుల ద్వారా 350 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నదన్నారు. ఈ నష్టంలో జీహెచ్ఎంసీ మాత్రం నెలకు 18 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ ఆర్టీసీకి ఇస్తున్నదని చెప్పారు. కాగా ఎక్స్‌ప్రెస్, నాన్‌స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల ద్వారా మాత్రం కొంత ఆదాయం ఆర్టీసీకి వస్తున్నదన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ నగరానికి అతి చేరువగా ఉన్న చేవెళ్ల కేంద్రానికి సబర్బన్ బస్సులు నడపడానికి మంత్రి, ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలన్నారు. చేవెళ్ల బస్‌స్టేషన్‌ను మోడల్ బస్‌స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. బస్‌డిపోను దామరగిద్ద వద్ద కాకుండా చేవెళ్ల సమీపంలో నిర్మించడానికి అనుమతించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ రమణారావు, ఈడీ నాగరాజు, ఆర్ఎం ఆర్.గంగాధర్, చీఫ్ మెకానికల్ ఇంజినీర్ వెంకన్న, ట్రాఫిక్ మేనేర్ విజయభాను, పలు డిపోల మేనేజర్లు, ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, వైస్‌ఎంపీపీ పోలీస్ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పద్మ, స్వరూప, సర్పంచ్ మధుసూదన్‌గుప్త, టీఆర్ఎస్ నాయకులు మాణిక్‌రెడ్డి, బర్కల రాంరెడ్డి, సత్యనారాయణరెడ్డి, మాసన్నగారి మాణిక్‌రెడ్డి, వసంతం, యాదగిరి, రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
దిల్సుఖ్నగర్: అన్యాయంగా తనను సస్పెండ్ చేశారనే మనస్తాపంతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన దిల్సుఖ్నగర్ బస్ డిపోలో జరిగింది. దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సైదులును ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన సైదులు బుధవారం డిపో ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స కోసం ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై తోటి ఉద్యోగులు డిపో ఎదుట ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
గుండెపోటుతో కుప్పకూలిన కండక్టర్
గూడురు టౌన్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ డిపోలో ఆదివారం ఉదయం ఓ కండక్టర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఎం.హరిబాబు అనే కండక్టర్ ఉదయం డిపోకు వెళ్లి రిజిస్టర్లో సంతకం పెడుతున్న సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. తోటి ఉద్యోగులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. -
బస్సు ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి
అనంతపురం ఆర్టీసీ డిపోలో బస్సు ఢీకొని నాగరాజు(53) అనే ఆర్టీస్ డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నాగరాజును బెంగుళూరు తరలించడానికి ప్రయత్నించగా... మార్గమధ్యంలోనే మరణించాడు. దీంతో ఆదివారం మధ్యాహ్నం నాగరాజు కుటుంబీకులు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆందోళనకు దిగారు. -
పండిట్ నెహ్రూ బస్టాప్‌లో ఉద్రిక్తత
-
కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న కండక్టర్
మెదక్: మెదక్ జిల్లా జహీరాబాద్ డిపో ఎదుట ఆర్టీసీ కండెక్టర్ చంద్రయ్య(42) శుక్రవారం తెల్లవారుజామున ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తోటి ఉద్యోగులు వెంటనే స్పందించి చంద్రయ్యను హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీంతో జహీరాబాద్ డిపో ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన డిపో వద్దకు చేరుకుని పహారా కాస్తున్నారు. -
తెలంగాణకు ‘బస్సు ప్రాజెక్టు’
* జేఎన్ఎన్యూఆర్ఎం కింద రూ.267.86 కోట్లు మంజూరు * 4 నగరాలకు 552 బస్సులు.. హైదరాబాద్‌కు 80 ఏసీబస్సులు * కరీంనగర్ నగరానికి బస్సు డిపో సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది. జవహర్లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) కిం ద కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలోని నాలుగు నగరాలకు 552 కొత్త బస్సులతో పాటు ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టం (ఐటీఎస్)లను మంజూరు చేసింది. వీటికి తోడు కరీంనగర్ జిల్లాకు ఓ బస్సు డిపోను సైతం కేటాయించింది. మంజూరైన బస్సుల్లో 80 అధునాతన ఏసీ బస్సులున్నాయి. రూ.267.86 కోట్ల విలువజేసే ఈ ‘బస్సు ప్రాజెక్టు’ వ్యయంలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.113.02 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.52.44 కోట్లు, టీఎస్ఆర్టీసీ రూ. 102.40 కోట్లను భరించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ ప్రాజెక్టును మంజూరు చేసిన నేపథ్యంలో ఈ మేరకు పరిపాలనాపర అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సైతం తనను కలవడానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి వెంకయ్య నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యాయని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్‌కు 422 బస్సులు రాష్ట్రానికి మంజూరైన 552 బస్సుల్లో 422 బస్సులు హైదరాబాద్‌కు మంజూరయ్యాయి. వీటిలో 80 ఏసీ బస్సులు, 342 నాన్ ఏసీ బస్సులున్నాయి. ఖమ్మంకు 30, మహబూబ్‌నగర్‌కు 30, కరీంనగర్‌కు 70బస్సులు మంజూరయ్యా యి. బస్సులతోపాటే ఐటీఎస్లను కేంద్రం మంజూరు చేసింది. ఐటీఎస్‌లో భాగంగా జీపీఎస్ సహాయంతో బస్సుల ఉనికిని తెలుసుకుని ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శిస్తారు. కరీంనగర్లో రూ.4.95 కోట్లతో బస్సు డిపోను నిర్మించనున్నారు. -
పార్కింగ్ స్థలాలుగా బస్ డిపోలు..!
సాక్షి, ముంబై: నష్టాల్లో కూరుకుపోయిన బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ అదనపు ఆదాయం వేటలో పడింది. అందుకు బస్ డిపోల స్థలాలను వాహనాల పార్కింగ్‌కు ఇవ్వాలని బెస్ట్ పరిపాలన విభాగం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. నగరం, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో మొత్తం 26 బెస్ట్ బస్ డిపోలున్నాయి. ఇందులో పార్కింగ్ చేసే బస్సులన్నీ ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్లపై తిరుగుతుంటాయి. రాత్రి ఆలస్యంగా డిపోలకు చేరుకుంటాయి. దీంతో రోజంతా ఖాళీగా ఉన్న డిపోల్లోని స్థలాలను వాహనాల పార్కింగ్‌కు కేటాయిస్తే అదనపు ఆదాయం వస్తుందని పరిపాలని విభాగం భావించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి మంజూరు కోసం బెస్ట్ సమితికి పంపించింది. ఇక్కడ మంజూరు లభించగానే త్వరలో వాహనాల పార్కింగ్‌కు స్థలం అందుబాటులోకి రానుంది. ఈ స్థలాలను ప్రైవేటు వాహనాల పార్కింగ్ కోసం వాడేందుకు కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించనుంది. ఆ ప్రకారం ప్రతి డిపోలో 20 ద్విచక్ర వాహనాలు, 10 కార్లు, ఐదు భారీ వాహనాలు ఇలా పార్కింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వనుంది. స్థాయీ సమితిలో ఈ ప్రతిపాదనకు మంజూరు లభించగానే పార్కింగ్ చార్జీలను నిర్ణయిస్తామని బెస్ట్ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే ఈ బస్ డిపో స్థలాలను కేవలం ఉదయం నుంచి రాత్రి వరకు 12 గంటలు మాత్రమే వాడుకునేందుకు అనుమతినివ్వనున్నారు. కాంట్రాక్టర్లకు కూడా ఈ షరతులపైనే బాధ్యతలు అప్పగిస్తారు. కాగా భద్రతాపరమైన ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తామే తీసుకుంటామని బెస్ట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. అదేవిధంగా వాహనదారుల నుంచి అడ్డగోలుగా చార్జీలు వసూలు చేయడాన్ని నిరోధించేందుకు బెస్ట్ స్వయంగా పార్కింగ్ చార్జీలను కేటాయించనుందని తెలిపారు. ఇదిలా ఉండగా, వృథాగా ఉన్న కొన్ని బెస్ట్ బస్ స్థలాలను 30 ఏళ్ల వరకు లీజుకు ఇవ్వాలని ఇదివరకే బెస్ట్ సంస్థ నిర్ణయం తీసుకుంది. కాని వ్యతిరేకత రావడంతో ఈ ప్రతిపాదనను విరమించుకుంది.