శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ డిపోలో ఆదివారం ఉదయం ఓ కండక్టర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
గూడురు టౌన్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ డిపోలో ఆదివారం ఉదయం ఓ కండక్టర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఎం.హరిబాబు అనే కండక్టర్ ఉదయం డిపోకు వెళ్లి రిజిస్టర్‌లో సంతకం పెడుతున్న సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. తోటి ఉద్యోగులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.