ఆందోళన చేస్తున్న కండక్టర్ అశోక్ (ఫైల్)
మేడ్చల్‌రూరల్: జీతాలు సకాలంలో రావడం లేదని, అధికారుల వేధింపులకు గురి చేస్తున్నారని మనస్థాపం చెందిన మేడ్చల్ ఆర్టీసీ డిపోలో పనిచేసే కండక్టర్ శనివారం ఉదయం మేడ్చల్ బస్ డిపో ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వివరాలివీ... శామీర్‌పేట్ మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన అశోక్ 14 సంవత్సరాలుగా మేడ్చల్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. కొంత కాలంగా జీతాలు సమయానికి రాకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని... ప్రతి నెల 5లోగా జీతాలు ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రి, అధికారులు సకాలంలో ఇవ్వడం లేదంటూ ఈ నెల 16న అశోక్ మేడ్చల్ బస్ డిపోలో వేతనాలు సమయానికి ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కార్మికులంతా ఏకం కావాలని కోరారు.
అయితే డిపోలో ధర్నా చేసినందుకు అప్పటి నుంచి డిపో మేనేజర్ మాధవి, డిపో సీఐ స్వాతి, టీఐ–2 నర్సింహ్మలు తనకు డ్యూటీలు సరిగా వేయకుండా వేధింపులకు గురి చేస్తున్నారని మనస్థాపానికి గురైన అశోక్ శనివారం ఉదయం డిపో ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. గమనించిన తోటి కార్మికులు అతడి నుంచి అగ్గిపెట్టె లాక్కుని అడ్డుకున్నారు. అనంతరంæ కార్మికులు అశోక్‌ను సముదాయించి ఇంటికి పంపించారు. జీతాలు సరిగా రావడం లేదని నిరసన వ్యక్తం చేసిన అశోక్‌పై అధికారులు వేధింపులకు పాల్పడటంతోనే ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కార్మికులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment