మృతి చెందిన కండెక్టర్ భాస్కరన్
సాక్షి చెన్నై: పదేళ్ల సస్పెన్షన్ ముగిసిన నేపథ్యంలో విధులకు హాజరుకావాలని అధికారుల నుంచి అందిన ఉత్తర్వులతో ఆ కండెక్టర్ సంబరపడిపోయాడు. ఉదయాన్నే డ్యూటీకి బయలుదేరాడు ఈ క్రమంలో గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరుఆయార్‌పాడి గ్రామానికి చెందిన భాస్కరన్(53). తమిళనాడు ట్రాన్స్‌పోర్ట్ కమిషన్ పొన్నేరి డిపోలో కండెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాల క్రితం ఇతను సస్పెండ్ అయ్యాడు.
సస్పెన్షన్ కాలం ముగిసిన నేపథ్యంలో విధులకు హాజరు కావాలని విల్లుపురం ట్రాన్స్‌పోర్ట్ కమిషన్ కార్యాలయం నుంచి శుక్రవారం భాస్కరన్‌కు ఉత్తర్వులు అందాయి. దీంతో శనివారం పొన్నేరి డిపోకు బయలుదేరిన భాస్కరన్ హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది భాస్కరన్‌ను సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి చెన్నై వైద్యశాలకు తరలించగా అక్కడ చిక్సిత పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
చదవండి: SPSR Nellore Double Murder: ఎవరు? ఎందుకు?
Comments
Please login to add a commentAdd a comment