
తమిళనాడు: ప్రియురాలిని బావిలో తోసి ప్రియుడు కడతేర్చాడు. తిరువణ్ణామలై జిల్లా కలసపాక్కంకు చెందిన వేల్‌మురుగన్ కుమార్తె రోషిణి (21). ఈమె తన కళాశాల చదువు పూర్తి చేసి, పోలీసు దళంలో చేరడానికి ఒక ప్రైవేట్ శిక్షణ కేంద్రంలో చదువుతోంది. అలనార్కమంగళం గ్రామానికి చెందిన పరశురామన్ కుమారుడు శక్తివేల్ (29) కూడా అదే శిక్షణ కేంద్రంలో చదువుతున్నాడు. వారిద్దరూ స్నేహితులు.
ఈ క్రమంలో రోషిణి, శక్తివేల్ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శిక్షణ కేంద్రం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారిద్దరు మన్సూరాబాద్ రోడ్డులో నడిచి వెళుతుండగా వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన శక్తివేల్ రోషిణిపై దాడి చేశాడు. ఆమెను సమీపంలోని బావిలో తోసేశాడు. అనంతరం శక్తివేల్ అర్ధరాత్రి పోలూరు పోలీస్‌స్టేష¯Œన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తరువాత, అతను పోలీసులకు, ‘రోషిణి, నేను ప్రేమించుకున్నాం’అని చెప్పాడు. ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయడానికి వరుడి కోసం వెతుకుతున్నారు. మనం వెంటనే పెళ్లి చేసుకుందమని రోషిణికి చెప్పాను. కానీ రోషిణి నిరాకరించింది. దీంతో తమ మధ్య వివాదం చెలరేగింది.
దీనికి కోపంగా, తాను ఆమె చెంప మీద కొట్టాను. ‘ఫలితంగా, రోషిణి సమీపంలోని బావిలోకి దూకింది’ అని అతను చెప్పాడు. ఆ తరువాత, సంఘటన జరిగిన ప్రాంతం మంగళం పోలీస్‌స్టేషన్ పరిధిలోకి రావడంతో పోలీసులు మంగళం పోలీసులకు సమాచారం అందించారు. మంగళం పోలీసులు ఆదివారం ఉదయం సంఘటన స్థలానికి వెళ్లగా, రోషిణి బావిలో చనిపోయి పడి ఉండడాన్ని వారు గుర్తించారు. అగి్నమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి, పోలీసులకు అప్పగించారు. పోలీసులు మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు శక్తివేల్‌ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment