
అన్నానగర్: పెళ్లయిన నెల రోజులకే ఓ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై ఆర్డీఓ విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై అంబత్తూరు సమీపంలోని కొరటూరు ఆగ్రహారం ప్రాంతానికి చెందిన భూపాలన్ (27), భాగ్యలక్ష్మి (24) 10 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
ఈ స్థితిలో నెల కిందట వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో సెలవు దినమైన ఆదివారం భుపాలన్ తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు అదే ప్రాంతంలోని మైదానానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా భాగ్యలక్ష్మి తలుపు తీయలేదు. తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన భూపాలన్ షాక్‌కు గురయ్యాడు.
ఇంటి పడక గదిలో భాగ్యలక్ష్మి ఉరివేసుకుని మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న కొరటూరు పోలీసులు అక్కడికి చేరుకుని భాగ్యలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో భూపాలన్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయం తెలిసి భాగ్యలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానించి, భూపాలన్‌ను అదుపులోకి తీసుకుకి విచారణ జరుపుతున్నారు. ఈ కేసు విచారణను ఆరీ్టఓకు అప్పగిస్తామని పోలీసులు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment