![Section 144 At The Depot In Telangana - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/16/Section.jpg.webp?itok=NFLygV5m)
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల జేఏసీ శనివారం తలపెట్టిన బస్‌రోకోకు ఎలాంటి అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నగరంలోని బస్ భవన్‌తో పాటు డిపోల వద్ద 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఇది శనివారం తెల్లవారుజామున 3గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3గంటల వరకు వర్తిస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రూపులుగా ఏర్పడి ఆందోళన చేయొద్దని, బస్సుల రాకపోకలు అడ్డుకుంటే ఉపేక్షించబోమన్నారు. నగరంలో ఇలాంటి చర్యల వల్ల విద్య, వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బందులు కలుగుతాయని, నిబంధనలు పాటించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment