బస్సు డిపోలో షార్ట్‌సర్క్యూట్
- ఉరుములు, మెరుపులతో కాలిపోయిన యూపీఎస్
- పని చేయని కంప్యూటర్లు.. ఎస్‌ఆర్ షీట్ లేక నిలిచిన బస్సులు
హుస్నాబాద్: బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సమస్య నెలకొని యూపీఎస్ కాలిపొయింది. దీంతో బస్సులు డిపోలోనే రెస్ట్ తీసుకుంటున్నాయి. హుస్నాబాద్ బస్సు డిపోలో నాలుగు రోజులుగా షార్ట్‌సర్క్యూట్ సమస్యతో కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఆదివారం డిపో సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెల రేగా యి. దీంతో డిపోలో షార్ట్‌సర్క్యూట్ సమస్య తలెత్తింది. రెండు విద్యుత్ మీటర్లకుగాను ఒకటి కాలిపోయింది. మరో మీటర్‌తో కార్యకలాపాలను కొనసాగిస్తుండగా బుధవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసి, పిడుగు పడింది.
మరోసారి డిపోలో షార్ట్‌సర్క్యూట్ సమస్య తలెత్తి యూపీఎస్ కాలిపోయి కంప్యూటర్లు మొరాయించాయి. రెండేళ్లుగా మాన్యువల్ టికెట్ల పంపిణీ ప్రక్రియను నిలిపివేశారు. కంప్యూటర్లలో టికెట్ నంబర్లు, బస్సు నంబరు, డ్రైవర్, కండక్టర్ పేర్లతో కూడిన ఎస్‌ఆర్ షీట్ విడుదలయ్యాకే.. బస్సులు డిపోనుంచి రోడ్లకు పైకి వస్తాయి. యూపీ ఎస్ కాలిపోవడంతో ఎస్‌ఆర్ షీట్ జారీకాక బస్సులు నిలిచిపోయాయి. మొత్తం 53 బస్సులకుగాను బుధవారం ఉదయం 12 బస్సులు బయటకు వచ్చాయి. హైదరాబా ద్‌కు బస్సులు నడవకపోవడంతో ప్రయాణి కులు ఇబ్బందులకు గురవుతున్నారు.