కండక్టర్‌ను వదిలేసి బస్సు రయ్‌ | Driver Forgets Conductor At Bus Stand, Later Realizes | Sakshi
Sakshi News home page

కండక్టర్‌ను వదిలేసి బస్సు రయ్‌

Published Wed, Jul 13 2022 11:26 AM | Last Updated on Wed, Jul 13 2022 11:26 AM

Driver Forgets Conductor At Bus Stand, Later Realizes - Sakshi

కర్ణాటక : కండక్టర్‌ను డ్రైవరు మరచిపోయి బస్సుతో బయల్దేరాడు. కొన్ని కిలోమీటర్లు వెళ్లాక సంగతిని తెలుసుకుని బస్సును నిలిపాడు. ఈ సంఘటన కొప్పళ జిల్లా బస్టాండులో చోటుచేసుకుంది. బస్సు కెఎ–37,ఎఫ్‌–0678, కొప్పళ బస్టాండ్‌ నుంచి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరింది. దాదాపు 5 కి.మీ ప్రయాణించిన తరువాత ఓజనహళ్లి వద్దకు చేరుకోగా ప్రయాణికులు టికెట్‌ కోసం కండక్టర్‌ ఏడీ అని వెతకసాగారు. అప్పుడు బస్సు డ్రైవర్‌కు అర్థమైంది. వెంటనే అక్కడే బస్సును ఆపివేసి కండక్టర్‌కు కాల్‌ చేశారు. మీ వల్ల ఆలస్యమైందని ప్రయాణికులు డ్రైవర్‌కు చీవాట్లు పెట్టారు. కండక్టర్‌ బస్సు ఎక్కకపోతే నేనేం చేయాలని డ్రైవర్‌ వాపోయాడు. కండక్టర్‌ మరో బస్సులో అక్కడికి చేరుకుని టికెట్లు కొట్టడంతో అంతా సద్దుమణిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement