బస్‌ డిపోలో రజనీకాంత్‌ సందడి.. ఫోటోలు వైరల్‌ | Rajinikanth Makes A Surprise Visit To BMTC No 4 Bus Depot In Bengaluru, Pics And Video Goes Viral - Sakshi
Sakshi News home page

Rajinikanth Visits Bengaluru BMTC Depot: తాను కండక్టర్‌గా పని చేసిన బస్‌ డిపోలో రజనీ సందడి..ఫోటోలు వైరల్‌

Published Tue, Aug 29 2023 4:23 PM | Last Updated on Tue, Aug 29 2023 6:28 PM

Rajinikanth Visits To BMTC Bus Depot In Bengaluru, Pics Goes Viral - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినీ జీవితం గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి.. తనదైన నటన, స్టైల్‌తో సూపర్‌ స్టార్‌గా ఎదిగాడు. అంతకు ముందు కుటుంబ పోషణ కోసం బస్‌ కండక్టర్‌గా పని చేశాడు. కొన్నాళ్ల తర్వాత ఉద్యోగం వదిలేసి చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు. కెరీర్‌ తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఆ తర్వాత విలన్‌గానూ నటించాడు.

చాలా కాలం తర్వాత హీరోగా అవకాశం రావడం.. బాక్సాఫీస్‌ వద్ద అవి విజయవంతం కావడంతో రజనీకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం తమిళనాడు వరకే పరిమితమైన అభిమాన దళం... ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించింది. డెభై ఏళ్ల వయసులో కూడా  రజనీ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘జైలర్‌’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది. ప్రస్తుతం ఆ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు రజనీకాంత్‌. 

ఎంత ఎదిగినా..ఒదిగే
సాధారణంగా ఏ హీరో అయినా తొలినాళ్లలో చాలా సింపుల్‌గా ఉంటాడు. ఒకటి రెండు హిట్లు పడితే చాలు.. మాట, యూటిట్యూడ్‌.. అన్నీ మారిపోతాయి. ఫ్యాన్స్‌కు దూరంగా ఉంటారు. కానీ రజనీకాంత్‌ అలా కాదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారు. సైడ్‌ క్యారెక్టర్లు చేసే స్థాయి నుంచి సూపర్‌ స్టార్‌ స్థాయికి ఎదిగినా.. ఆయన మాట, ప్రవర్తనలో మార్పు రాలేదు. సూపర్‌స్టార్‌ అనే గర్వం కొంచెం కూడా ఉండదు. చాలా సింపుల్‌గా జీవితాన్ని గడిపేందుకే రజనీ ఇష్టపడతాడు.

బస్ డిపోలో రజనీ సందడి
సినిమాల్లోకి రాకముందు రజనీ బెంగళూరులోని బీఎంటీసీ బస్‌ డిపోలో కండక్టర్‌గా పనిచేశాడు. తాజాగా ఆయన ఆ బస్‌ డిపోకి వెళ్లి సందడి చేశాడు. కొద్ది సేపు బస్‌ స్టేషన్‌ అంతా తిరిగి.. పాత రోజులను గుర్తు చేసుకున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులతో ముచ్చటించారు. ఎలాంటి సమాచారం లేకుండా వచ్చిన సూపర్‌స్టార్‌ రజనీని చూసి అక్కడి సిబ్బంది ఆశ్యర్యపోయింది. అతనితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. రజనీ కూడా చాలా ఓపిగ్గా అందరితో సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. రజనీకాంత్‌ సింప్లిసిటీకి నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement