
కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న కండక్టర్
మెదక్: మెదక్ జిల్లా జహీరాబాద్ డిపో ఎదుట ఆర్టీసీ కండెక్టర్ చంద్రయ్య(42) శుక్రవారం తెల్లవారుజామున ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తోటి ఉద్యోగులు వెంటనే స్పందించి చంద్రయ్యను హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీంతో జహీరాబాద్ డిపో ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన డిపో వద్దకు చేరుకుని పహారా కాస్తున్నారు.