తమిళనాడు నాగపట్నం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొరయార్‌లో టీఎన్‌ఎస్‌టీసీ బస్ డిపో గ్యారేజీ పైకప్పు కూలి ఎనిమిదిమంది దుర్మరణం చెందారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నాగపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. వీరంతా విధులు ముగించుకుని, విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.