సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని అన్ని బస్‌డిపోలు, బస్టాండ్‌ల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయాలని కలెక్టర్ సత్యనారాయణ ఆర్డీవోలను ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. ఆర్టీసీ స మ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లుగా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయించాలన్నారు. ప్రైవేట్ బస్సులు, స్కూల్‌బస్సులు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. బస్సుల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఎస్పీ శ్వేత అధికారులకు సూచించారు. కంట్రోల్ రూంతో అనుసంధానం కలిగి ఉండాలన్నారు. సమ్మె నేపథ్యంలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఆయా నంబర్లకు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. వీసీలో జేసీ యాదిరెడ్డి, ఆర్టీఏ వాణి, డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎంవీఐ శ్రీనివాసరావు, కామారెడ్డి బస్‌డిపో డివిజనల్ మేనేజర్ గణపతిరాజు తదితరులు పాల్గొన్నారు.
కంట్రోల్ రూమ్స్ వివరాలు..
- జిల్లా పోలీసు కంట్రోల్‌రూం, ఎస్పీ కార్యాలయం ఫోన్ నంబర్లు : 9490617633, 08468–226633
- కామారెడ్డి బస్ డిపో కంట్రోల్ రూం నంబర్ : 08468–220281
- బాన్సువాడ బస్‌డిపో కంట్రోల్ రూం నంబర్ : 8985061830
- కామారెడ్డి ఆర్డీవో : 9491036892
- బాన్సువాడ ఆర్డీవో : 9492022593
- కామారెడ్డి డీఎస్పీ : 9440795426
- బాన్సువాడ డీఎస్పీ : 9490617639
- ఆర్టీఏ నంబర్ : 9618430721
Comments
Please login to add a commentAdd a comment