కరీంనగర్: నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె కరీంనగర్ జిల్లాలో సంపూర్ణంగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాలయాలు సంపూర్ణంగా బంద్ పాటిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాలో 11 డిపోలలో మొత్తం 980 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రామగుండం ప్రాంతంలో సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. రామగుండం ఎన్టీపీసీలో 9 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో విద్యుత్ ఉత్పత్తికి ఎక్కడా అంతరాయ లేకండా పర్మనెంట్ ఉద్యోగులతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు బంద్‌ను పర్యవేక్షిస్తుండగా.. ఉపాధ్యాయులు సమ్మెకు తమ సంఘీభావం తెలిపారు.
కరీంనగర్‌లో కొనసాగుతున్న బంద్
Published Fri, Sep 2 2016 9:44 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
Advertisement