గొల్లం భూతం ఉన్నట్టా లేనట్టా?
గొల్లం భూతం ఉన్నట్టా లేనట్టా?
Published Thu, Jun 26 2014 5:25 PM | Last Updated on Thu, Sep 27 2018 3:15 PM
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అడుగు భాగాల, కొండలు, గుట్టల మధ్య, వింత చర్మం రంగుతో, అంతకన్నా వింతైన చెవులతో ఓ వింత జీవి దర్శనమిచ్చింది. దాన్ని చూసిన వారికి పై ప్రాణాలు పైకే పోయాయి. ఎవరో ఒకరు మాత్రం ధైర్యం చేసి తన కెమెరాలో వింత జీవిని బంధించాడు. రాళ్ల మధ్య కూర్చుని ఉన్న ఆ విత జీవిని చైనీయులు గొల్లం అని పేరు పెట్టుకున్నారు. ఇక ఇంటర్నెట్ అంతా గొల్లం సందడే. 32000 మంది గొల్లం బొమ్మను రీపోస్ట్ చేశారు. లక్షలాది మంది కామెంట్ చేశారు. చైనా అంతా గొల్లం కబుర్లే.
చైనా ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి, ఈ వింత జీవి గురించి విచారణ మొదలుపెట్టింది. అప్పుడు ఉన్నట్టుండి ఒకవ్యక్తి ముందుకొచ్చి గొల్లం వింత జంతువు కాదు. అది నేనే. ఆ వేషం వేసింది నేనే. ఓ టీవీ యాడ్ కోసం నేను ఆవేషం వేశాను అని తన చిత్రాలను, తన మేకప్ దృశ్యాలను విలేఖరులకు చూపించాడు. అయినా ప్రజలు నమ్మలేదు. చివరికి ప్రజల ముందే మేకప్ వేసుకున్నాడు. అప్పటికి గానీ ప్రజలు గొల్లం అనే భూతం లేదని ఒప్పుకోలేదు. 'మరి ఆ రాయి దగ్గర ఎందుకు కూర్చున్నావు' అని విలేఖరులు ఆ నటుడిని అడిగారట. 'ఏం చెప్పమంటారండీ... చెప్పుకోలేని దేహబాధలు తీర్చుకుంటున్నాను,' అని జవాబు చెప్పాడట!!
Advertisement