great wall of china
-
షార్ట్‌కట్ అని 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా'నే కూల్చేశారు
బీజింగ్: ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' ఆ దేశానికి ప్రహారి గోడ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వారికి తొట్టతొలి గుర్తింపు సాధించిన చారిత్రాత్మక కట్టడం కూడా. అలాంటిది రాకపోకలకు అడ్డంగా ఉందని ఈ గోడకు ఏర్పడ్డ చిన్న సందుని పెద్దది చేసే ప్రయత్నంలో భారీగా తవ్వేశారు ఇద్దరు ఆగంతకులు. గ్రేట్ వాల్ అయితే ఏంటి? చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లో, యూయు కౌంటీ సమీపంలోని యాంగ్‌క్యాన్హె టౌన్షిప్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ 38 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ ఇక్కడికి సమీపంలో ఒక నిర్మాణ కాంట్రాక్టును తీసుకున్నారు. అయితే వారి రాకపోకలకు అడ్డంకిగా నిలవడంతో పాటు యంత్ర సామాగ్రిని నిర్మాణ స్థలానికి తరలించడానికి గ్రేట్ వాల్ అడ్డుగా ఉంది. దీనివలన వారు పని చేసుకునే చోటికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. దీంతో వారిద్దరు కలిసి యంత్రాల సాయంతో గ్రేట్‌వాల్‌ను కొంతవరకు కూల్చేశారు. షార్ట్‌కట్ అని.. ఆగస్టు 24న స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కూల్చేసిన గోడను చూసి విభ్రాంతికి గురయ్యారు. కేవలం షార్ట్‌కట్‌గా ఉపయోగపడుతుందన్న ఒకేఒక్క కారణంతో నిందితులు చైనా ప్రతిష్టకు ప్రతీకగా నిలిచిన భారీ గోడ సమగ్రతకు సుస్థిరతకు తీవ్రనష్టం కలిగించారన్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. చారిత్రాత్మకం.. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం క్రీస్తుపూర్వం 200లోనే ప్రారంభమైనప్పటికీ ఇప్పుడున్న కట్టడాన్ని నిర్మించింది మాత్రం మింగ్ వంశీయులే. క్రీస్తుశకం 1368-1644 సమయంలో దీని నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక కట్టడమైన ఈ గోడను యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. ఈ చారిత్రక కట్టడాన్ని చూసేందుకు నేటికీ ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులు ఇక్కడికి తరలివస్తుంటారు. 🚜 In the Chinese province of Shanxi, locals destroyed a section of the Great Wall of China with an excavator, — Sohu During interrogation, the man and woman admitted that they worked at a construction site nearby, and thus wanted to shorten the way to work. The ruined section… pic.twitter.com/2enLL69y7H — UNEWS (@UNEWSworld) September 4, 2023 ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుని భార్యకు కరోనా.. బైడెన్ జీ20 పర్యటనపై సందిగ్ధత.. -
చైనా వాల్ యుద్ధం కోసం కాదట..!
జెరూసలేం: ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన చైనా వాల్ గురించి ఇజ్రాయెల్ ఆర్కియాలజిస్ట్‌లు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చైనా వాల్ ఉత్తర భాగాన్ని ఆక్రమణలను నిరోధించడానికి కాదని.. పౌరులను పర్యవేక్షించే నిమిత్తం నిర్మించినట్లు వారు తెలిపారు. పరిశోధకులు మొదటిసారి 740 కిలోమీటర్ల పొడవైన చైనా వాల్ ఉత్తరభాగాన్ని పూర్తిగా మ్యాప్ చేశారు. వారి పరిశోధనలో తెలిసిన అంశాలు మునుపటి పరిశీలనలను సవాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రెండేళ్లుగా ఈ పరిశోధనలకు అధ్యక్షత వహించిన జెరూసలేం హిబ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన గిడియాన్ షెలాచ్ లావి మాట్లాడుతూ.. ‘మా పరిశోధనకు ముందు, చెంఘిజ్ ఖాన్ సైన్యాన్ని ఆపడం కోసమే ఉత్తర భాగంలో గోడ నిర్మాణాన్ని చేపట్టినట్లు చాలా మంది భావించారు. కానీ ఈ భాగం లోతు తక్కువగా ఉన్న మంగోలియాలోని రహదారులకు సమీపంగా ఉంది. మా పరిశోధనలు తేల్చిన అంశం ఏంటంటే.. ఈ ఉత్తర భాగాన్ని సైనికేతర పనుల కోసం అనగా ప్రజలు, పశువుల కదలికలను పర్యవేక్షించడం, నిరోధించడం.. వాటికి పన్ను విధించడం వంటి కార్యక్రమాల కోసం నిర్మించారు’ అని తెలిపారు. షెలాచ్-లావి, అతని ఇజ్రాయెల్, మంగోలియన్, అమెరికన్ పరిశోధకుల బృందం గోడలను మ్యాప్ చేయడానికి డ్రోన్లు, అధిక-రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు, సాంప్రదాయ పురావస్తు సాధనాలను ఉపయోగించింది. వేలాది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం మొదట క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో ప్రారంభమై.. శతాబ్దాలుగా కొనసాగింది. పురాణ మంగోలియన్ విజేతకు చిహ్నంగా ‘చెంఘిజ్ ఖాన్ వాల్’ అని పిలవబడే ఉత్తర భాగం 11, 13 వ శతాబ్దాల మధ్య నిర్మించబడింది. ఇది 72 చిన్న చిన్న నిర్మాణాలతో నిండి ఉంది. -
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎక్కడుంది?
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎక్కడుంది అని మిమ్మల్ని ప్రశ్నిస్తే.. మీరేం సమాధానం ఇస్తారు? ఆ.. అదో ప్రశ్న.. దానికి మళ్లీ సమాధానం.. ప్రశ్నలోనే సమాధానం ఉంది కదా అని వెటకారంగా అంటూనే.. చైనా అని ఎవరైనా చెబుతారు. చిన్న పిల్లలను అడిగినా కూడా దాదాపు సమాధానం ఇచ్చేస్తారు. తెలియకపోయినా కూడా కనీసం ప్రశ్నలో ఉన్న చైనా పేరునైనా అలా గాలి వాటంగా సమాధానం ఇస్తారు. అయితే ఈ ఫొటోలో ఉన్న 26 ఆరేళ్ల యువతికి మాత్రం దానికి సమాధానం చెప్పడానికి రెండు లైఫ్లైన్లు తీసుకుందట! మన దగ్గర మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ఉంది కదా.. అచ్చు అలాంటిదే టర్కీలో కూడా నడుస్తోంది. అందులో పాల్గొనే అభ్యర్థులకు న్యాయనిర్ణేత పలు ప్రశ్నలు అడుగుతారు.. దానికి నిర్ణీత సమయంలో సమాధానం చెబితే డబ్బులిస్తారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న 26 ఏళ్ల సూ ఆయాన్ అనే యువతిని న్యాయనిర్ణేత ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎక్కడుంది?’ అని ప్రశ్న వేశారు. దానికి చైనా, భారత్, దక్షిణ కొరియా, జపాన్ అని నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు. అయితే సమాధానం తెలియక.. ఆమె ఆడియన్స్ పోల్ అనే లైఫ్ లైన్‌కు వెళ్లగా దురదృష్టం కొద్ది అక్కడి ఆడియన్స్‌లో కూడా 51 శాతం మంది మాత్రమే చైనాలో ఉందని చెప్పారట. దీంతో ‘ఫోన్ ఎ ఫ్రెండ్’ అనే లైఫ్ లైన్‌కు వెళ్లిందట. అదృష్టం ఏంటంటే ఆ ఫ్రెండ్‌కు సరైన సమాధానం తెలియడంతో తదుపరి ప్రశ్నకు వెళ్లింది. ఆ స్నేహితుడికి కూడా సమాధానం తెలియకపోతే పరిస్థితేంటో పాపం. అయితే ఆ తదుపరి ప్రశ్నకే తప్పు సమాధానం చెప్పి ఇంటి బాట పట్టింది ఆ యువతి. -
ఎవరెస్ట్‌పై మన లెక్క తప్పు
లండన్: ప్రపంచంలోకెల్లా ఎతై్తనది ఎవరెస్ట్ పర్వతమని, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోందని, చంద్రుడికి ఆవలివైపు చీకటి ఉంటుందని, చంద్రుడి పైనుంచి చైనా వాల్ కనిపిస్తుందని, పొద్దు తిరిగుడు పూవు సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతుందని, ఊసరవెల్లి పరిసరాలకు అనుగుణంగా రంగులు మారుస్తుందని, గబ్బిలాలకు కళ్లుండవని....ఎవరు చెప్పినా నమ్మేస్తాం. కాదంటే కసురుకుంటాం. కానీ ఇవన్నీ మన భ్రమలని, మన ముందువాళ్లు చెబుతూ వచ్చిన మాటలను గుడ్డిగా నమ్మడం వల్ల మనలోనూ ఇలాంటి అభిప్రాయాలు బలంగా నాటుకుపోయాయని ‘బిలీఫ్ ఇట్ ఆర్ నాట్’ కాలం కింద ‘రిప్లీస్ డాట్ కామ్’ వీటన్నింటిని శాస్త్రీయంగా విశ్లేషించింది. ఎవరెస్ట్ పర్వతం: ప్రపంచంలోకెల్లా ఎతై్తన పర్వతం ఎవరెస్ట్ అని అధికారికంగా ప్రపంచమే గుర్తించింది. అయితే సాంకేతికంగా పరిశీలిస్తే దానికన్నా అమెరికా హవాయి దీవిలోని మౌనా కియా పర్వతమే ఎతై్తనదని జియాలజిస్టులే నిరూపించారు. సముద్ర మట్టంతో పోలిస్తే ఎవరెస్ట్ పర్వతం 8,850 మీటర్లు ఉంటుంది. బేస్‌ను ప్రామాణికంగా తీసుకుంటే మౌనా కియా పర్వతం ఎత్తు 13,796 మీటర్లు. దీని బేస్ సముద్ర జలాల్లోకి చొచ్చుకుపోయి ఉంటుంది. ఊసరవెల్లి: ఉష్ణోగ్రత, కమ్యూనికేషన్, వెలుతురు, మూడ్స్ కారణంగానే ఊసరవెల్లి రంగులు మారుస్తుంది. పరిసరాలతో సంబంధం లేదు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా : చంద్రుడి పైనుంచి చైనా గోడ కనిపించదని, భూమే తెల్లటి, నీలి రంగు మార్బుల్స్లా కనిపిస్తుందని అపోలో వ్యోమగాములు ధ్రువీకరించారు. చంద్రుడికి ఆవల చీకటి: చంద్రడుకి ఆవల చీకటి ఉండదు. భూమిలాగే అది తన అక్షంలో తిరుగుతుంది. భూమిలాగానే దానికి అన్ని ప్రాంతాల్లో పగలు, రాత్రిగా వుంటింది. సూర్యుడి చుట్టూ భూమి: సాంకేతికంగా ఆలోచిస్తే సూర్యుడి చుట్టూ భూమి తిరగదు. మొత్తం సౌర కుటుంబమే అంతరిక్ష ద్రవ్యరాశిలో తన అక్షంలో తిరుగుతుంది కనుక మనకు సూర్యుడు చుట్టూ తిరుగుతున్న భ్రమ కలుగుతుంది. బైబిల్లో ఆపిల్: ఈడెన్ గార్డెన్లో నిషేధిత ఫలం ఆపిల్ అని బైబిల్ ఎక్కడా పేర్కొనలేదు. తినకూడదని హెచ్చరించిన ఫలం అని మాత్రమే ఉంటుంది. ఫలం అంటే ఫలం కాదని, మంచి చెడుల విశ్లేషణకు ప్రతీకగా మాత్రమే ఫలం అన్నారనే వాదనలు కూడా ఉన్నాయి. పొద్దు తిరుగుడు పూవు: సూర్య భ్రమణంబట్టి పొద్దు తిరుగుడు పూవు తిరగదు. మొగ్గ దశలో మాత్రమే అది సూర్యుడి వైపు నిలుస్తుంది. పూవు వికసించాక పొద్దుతో సంబంధం లేకుండా ఒకే దిక్కులో ఉంటుంది. గబ్బిలాలకు కళ్లు: గబ్బిలాలకు చిన్ని కళ్లు ఉంటాయి. చీకటిలో అవి ప్రకంపనల ఆధారంగా సంచరిస్తాయి కనుక వాటికి కళ్లు ఉండవని భావిస్తూ వచ్చారు. బుల్‌ఫైట్: ఎర్ర గుడ్డలను చూస్తే దున్నపోతులు రెచ్చిపోతాయన్నది కూడా అబద్ధం. ఎందుకంటే తెలుపు, నీలి రంగులు మినహా మిగతా రంగులను గుర్తించే శక్తి వాటికి లేవు. బుల్ ఫైట్ సందర్భంగా చుట్టూ జనంచేసే కోలాహలం, ఎదురుగా ఓ మనిషి రెచ్చగొడుతుండడం వల్ల అవి చిర్రెత్తుకొచ్చి అలా రెచ్చిపోయి ప్రవర్తిస్తాయట. టమోట: అంటే కూరగాయనుకుంటాం. కానీ ఇది పండు జాతికి చెందింది. మెదడు: మెదడులో మనం కేవలం పది శాతాన్ని మాత్రమే ఉపయోగిస్తాం అని చెబుతారు చాలామంది. ఇది కూడా తప్పే. మెదడులోని అన్ని భాగాలను పనిచేయిస్తాం. అలా జరగకపోతే శరీరంలోని ఏదో భాగం పని చేయకుండా పోతుంది. మెదడును మనం ఎలా ఉపయోగిస్తామన్న అంశాన్నిబట్టి మనిషి తెలివితేటలు ఆధారపడి ఉంటాయి. -
తిరుమల చుట్టూ రక్షణ కవచం
ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి సూచనలు తిరుమల: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక, ధార్మిక క్షేత్రమైన తిరుమలకు చైనా గోడ తరహా రక్షణ కవచం అవసరమని టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాకం విజయసాయిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద, హింసాత్మక చర్యల నేపథ్యంలో తిరుమల ఆలయానికి టీటీడీ పరిధిలోని 10.3 చదరపు మైళ్ల విస్తీర్ణంలో మహాప్రాకారం (రక్షణ గోడ) నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలోని 13 జిల్లాల్లోనూ అధునాతన సాంకేతిక త, విద్యాప్రమాణాలతో టీటీడీ విద్యాలయాలను నెలకొల్పాని కోరారు. తెలంగాణలోనూ వాటిని విస్తరించి ధార్మిక, నైతికతతో కూడిన నాణ్యమెన విద్య అందించే బాధ్యతను టీటీడీ తీసుకోవాలని సూచించారు. -
గొల్లం భూతం ఉన్నట్టా లేనట్టా?
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అడుగు భాగాల, కొండలు, గుట్టల మధ్య, వింత చర్మం రంగుతో, అంతకన్నా వింతైన చెవులతో ఓ వింత జీవి దర్శనమిచ్చింది. దాన్ని చూసిన వారికి పై ప్రాణాలు పైకే పోయాయి. ఎవరో ఒకరు మాత్రం ధైర్యం చేసి తన కెమెరాలో వింత జీవిని బంధించాడు. రాళ్ల మధ్య కూర్చుని ఉన్న ఆ విత జీవిని చైనీయులు గొల్లం అని పేరు పెట్టుకున్నారు. ఇక ఇంటర్నెట్ అంతా గొల్లం సందడే. 32000 మంది గొల్లం బొమ్మను రీపోస్ట్ చేశారు. లక్షలాది మంది కామెంట్ చేశారు. చైనా అంతా గొల్లం కబుర్లే. చైనా ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి, ఈ వింత జీవి గురించి విచారణ మొదలుపెట్టింది. అప్పుడు ఉన్నట్టుండి ఒకవ్యక్తి ముందుకొచ్చి గొల్లం వింత జంతువు కాదు. అది నేనే. ఆ వేషం వేసింది నేనే. ఓ టీవీ యాడ్ కోసం నేను ఆవేషం వేశాను అని తన చిత్రాలను, తన మేకప్ దృశ్యాలను విలేఖరులకు చూపించాడు. అయినా ప్రజలు నమ్మలేదు. చివరికి ప్రజల ముందే మేకప్ వేసుకున్నాడు. అప్పటికి గానీ ప్రజలు గొల్లం అనే భూతం లేదని ఒప్పుకోలేదు. 'మరి ఆ రాయి దగ్గర ఎందుకు కూర్చున్నావు' అని విలేఖరులు ఆ నటుడిని అడిగారట. 'ఏం చెప్పమంటారండీ... చెప్పుకోలేని దేహబాధలు తీర్చుకుంటున్నాను,' అని జవాబు చెప్పాడట!!