
సాక్షి, జైపూర్: ఇండిగో విమానానికి బాంబు బెదింరిపు కాల్ రావడం కలకలం రేపింది. జైపూర్ నుంచి ముంబైకి బయలుదేరిన ఇందిగో విమానంలో బాంబ్ ఉన్నట్టుగా గుర్తు తెలియని వ్యక్తి ద్వారా ఇండిగో కేంద్రానికి సమాచారం అందింది. అయితే భద్రతా అధికారుల పూర్తి తనిఖీ అనంతరం ఇది ఆకతాయి చర్యగా తేలడంతో ఊరట చెందారు.
ఇండిగో ట్రాఫిక్ 6ఇ218 మంగళవారం ఉదయం సుమారు 5.30 నిమిషాల సమయంలో ఈ బెదిరింపు కాల్ వచ్చింది. సరిగ్గా ఆ సమయానికి విమానం మార్గం మధ్యలో ఉండటంతో ఒక్కసారిగా అధికారుల్లో ఆందోళన మొదలైంది. తక్షణమే బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీకి (బీటీసీ) కి నివేదించారు. భద్రతా అధికారులు ధృవీకరణ అంనతరం కార్యకలాపాలు సాధారణంగా తిరిగి కొనసాగిస్తున్నట్టు ఇండిగో ఒక ప్రకటనలో పేర్కొంది.