ఎన్టీటీపీఎస్‌లో బాంబు కలకలం | Ibrahimpatnam NTPC receives hoax bomb call | Sakshi
Sakshi News home page

ఎన్టీటీపీఎస్‌లో బాంబు కలకలం

Published Tue, May 27 2014 10:41 PM | Last Updated on Thu, Sep 27 2018 3:15 PM

Ibrahimpatnam NTPC receives hoax bomb call

ఇబ్రహీంపట్నం: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్‌లో బాంబు ఉన్నట్లు మంగళవారం మధ్యాహ్నం ఓ అపరిచిత వ్యక్తి 100కి ఫోన్ చేయడంతో పోలీసులు తనిఖీలు చేశారు. బాంబు స్వ్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో థర్మల్ కేంద్రంలో అణువణువూ గాలించారు. చివరికి ఏమీలేదని తేలడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

కాగా ఫోన్‌లో తప్పుడు సమాచారం అందించిన వ్యక్తిని రాత్రి స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జి.కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడిగా పోలీసులు గుర్తించారు. కేవలం ఆకతాయితనంగా ఫోన్ చేసినట్లు అతడు పోలీసులకు చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement