భార్యను చంపి.. ప్రియురాలి భర్తను ఇరికించి! | Techie kills wife, makes hoax calls to frame his lover's husband | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 7 2015 3:30 PM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

అతడో సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన భార్యను చంపేశాడు.. ప్రియురాలి భర్తను వేరే కేసులో ఇరికించి తామిద్దరం హాయిగా ఉందామనుకున్నాడు. తీరా చూస్తే.. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. సినిమా ట్విస్టులను తలపించే ఈ ఘటన బెంగళూరులో జరిగింది. ఎంజీ గోకుల్ (33) అనే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు అప్పటికే పెళ్లయింది కూడా. దాంతో ఆమె భర్త అడ్డు తొలగించుకోడానికి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ చేశాడు. అందుకోసం.. చాలా పెద్ద పథకమే వేశాడు.

Advertisement
 
Advertisement