నకిలీ పోలీసులపై కేసు నమోదు
Published Mon, Aug 1 2016 2:07 AM | Last Updated on Thu, Sep 27 2018 3:15 PM
నెల్లూరు(క్రైమ్): పోలీసుల ముసుగులో వే బిల్లులు లేకుండా అక్రమంగా వస్తువులను తరలిస్తున్న వాహనాలపై బాలాజీనగర్ పోలీసులు ఆదివారం రాత్రి దాడులు చేశారు. వివరాలు.. జెండావీధికి చెందిన కరంతుల్లా, వెంకటేశ్వరరావు, కోవూరు వేగూరుకు చెందిన రవి, పెంచలయ్య కొంతకాలంగా చెన్నై నుంచి వే బిల్లులు లేకుండా అక్రమంగా వస్తువులను తరలిస్తున్న వాహనాలకు పోలీస్ నేమ్ బోర్డుతో పైలెట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం రాత్రి వారు చెన్నై నుంచి చేపల ట్రేల లారీకి పైలట్‌గా కావలికి బయల్దేరారు. ఎన్టీఆర్‌నగర్ జాతీయ రహదారిపై బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ రామారావు వాహన తనిఖీలను నిర్వíß స్తుండగా, పోలీస్ బోర్డుతో ఉన్న వాహనం తారసపడింది. తనిఖీచేయగా అందులో ఉన్న వ్యక్తులు నకిలీ పోలీసులని తెలిసింది. వెనుకనే వస్తున్న వాహనాన్ని పరిశీలించగా అందులో పెద్ద ఎత్తున చేపల ట్రేలు వే బిల్లులు లేకుండా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement