కొచ్చి: ఇండిగో విమానయాన సంస్థకు చెందిన కొచ్చి–బెంగళూరు విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు కాల్‌తో అధికారులు హైరానా పడ్డారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టారు. ఎటువంటి బాంబు లేదని తేల్చారు. అనంతరం మధ్యాహ్నం 2.24 గంటలకు బెంగళూరుకు బయలుదేరింది. 6ఈ6482 విమానం మొత్తం 139 మంది ప్రయాణికులతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది.
అంతలోనే, ఆ విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి ఇంటర్నెట్ ద్వారా అధికారులకు ఫోన్ కాల్ చేశాడు. దీంతో, అధికారులు వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రయాణికులందరినీ కిందికి దించివేశారు. వారికి చెందిన లగేజీని కూడా క్షుణ్నంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువేదీ లేదని ధ్రువీకరించుకున్నారు. అనంతరం 2.24 గంటల సమయంలో ఆ విమానం తిరిగి బెంగళూరుకు టేకాఫ్ అయ్యింది. బాంబు బెదిరింపుపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment