సాక్షి, బెంగళూరు: ప్రేమకు నిరాకరించిందని, తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న పగతో ఓ రౌడీషీటర్, ఎయిర్‌హోస్టెస్‌పై దాడి చేసి చెవిని కత్తిరించిన ఘటన ఐటీ సిటీలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై కొడిగెహళ్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా రౌడీషీటర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు జాలహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ అజయ్ అలియాస్ జాకీ. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే ఓ ఎయిర్‌హోస్టెస్ బాధితురాలు. మే 12 తేదీన హెబ్బాల వద్ద క్యాబ్‌లో ఈ దురాగతానికి uమొదటిపేజీ తరువాయి
పాల్పడ్డాడు.
ప్రేమించాలని వేధింపులు
ఎయిర్‌హొస్టెస్‌ను ఫిబ్రవరి నుంచి ప్రేమించాలని రౌడీషీటర్ అజయ్ వెంటబడి వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె ఇంట్లో తెలిపింది. కుటుంబసభ్యులు రౌడీషీటర్ అజయ్‌ను హెచ్చరించడంతో కోపోద్రిక్తుడైన జాకీ ఎయిర్‌హొస్టెస్ ఇంటిముందు వీరంగం సృష్టించాడు. వారి కారు అద్దాలు, బైక్‌ను ధ్వంసం చేశాడు. ఈ ఘటనతో రౌడీషీటర్ అజయ్‌పై జాలహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు జాకీని పిలిచి హెచ్చరించారు. అప్పటి నుంచి ఎయిర్‌హోస్టెస్‌పై మరింత కసి పెంచుకున్నాడు.
కారులో చొరబడి దాడి
ఈ నెల 12 తేదీన ఎయిర్‌హోస్టెస్ కెంపేగౌడ విమానాశ్రయానికి క్యాబ్‌లో వెళుతుండగా, తెలుసుకున్న డీషీటర్ జాకీ హెబ్బాల వద్ద కారును అటకాయించాడు. డ్రైవరును బెదిరించి కారులో ఎక్కి కారును పోనివ్వాలని హెచ్చరించాడు, డ్రైవర్ నిరాకరించడంతో చాకుతో భుజంపై పొడిచాడు. తరువాత తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని ఎయిర్‌హోస్టెస్‌ను జాకీ బెదిరించగా, ఆమె తిరస్కరించింది. కోపోద్రిక్తుడైన దుండగుడు ఆమె చెవిని చాకుతో కత్తిరించి ఉడాయించాడు. దాడిలో గాయపడిన బాధితురాలు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన పై కొడిగేహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న రౌడీషీటర్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment