rowdy sheeters arrest
-
జెడ్పీటీసీ హత్యాయత్నానికి కుట్ర.. గుట్టు రట్టుచేసిన పోలీసులు! ప్లాన్ ఇదీ..
సూర్యాపేట క్రైం : జాజిరెడ్డిగూడెం జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌ను మట్టుబెట్టుందుకు సుపారీ తీసుకున్న ఓ ముఠాను ముందస్తుగా అరెస్టు చేసినట్లు హత్యాయత్నాన్ని భగ్నం చేసినట్లు సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. వ్యక్తిగత కక్షలు, భూ వివాదాలతోనే జెడ్పీటీసీని సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించేందుకు ఇద్దరు సమీప బంధువులతో పాటు మరొకరు కుట్ర చేసినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. సూత్ర, పాత్రధారుల్లో నలుగురిని అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారన్నారు. బుధవారం సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన దావుల వీరప్రసాద్ యాదవ్, ముదిరాజ్ కులానికి చెందిన లింగంపల్లి జగన్నాథం రెండో భార్య కూతురు మనీషాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం జగన్నాథం అనారోగ్యంతో చనిపోగా తలగొరివి పెట్టే విషయంలో గొడవ జరిగింది. జగన్నాథం పెద్ద భార్య కుమార్తె కవితతో తలగొరివి పెట్టించాలని అనుకోగా రెండవ భార్య కుమార్తె శ్వేతతో తలగొరివి పెట్టించారు. అప్పటి నుంచి జగన్నాధం అన్న కొడుకు లింగంపల్లి సుధాకర్, అతడి బంధువులు, వీరప్రసాద్‌కు మనస్పర్థలు వచ్చి గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ విషయాల్లో తలదూరుస్తూ.. దావుల వీరప్రసాద్ తరచూ జగన్నాథం కుటుంబ విషయాల్లో తలదూరుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వీరప్రసాద్ కొద్దిరోజుల క్రితం తోడల్లుడు జిన్నే శ్రీను, అతడి కుమారుడు అశ్విన్‌లపై అర్వపల్లి కి చెందిన మేకల సంతోష్‌పై జరిగిన దాడి విషయంలో తప్పుడు కేసులు పెట్టించాడు. దీంతో వారు జెడ్పీటీసీపై కోపం పెంచుకున్నారు. దీంతో పాటు ఇదే గ్రామానికి చెందిన లింగంపల్లి సంజయ్ 3 గుంటల భూమి పంచాయితీలో దావుల వీరప్రసాద్ తలదూర్చి భూమి రాకుండా అడ్డుపడినట్లు అనుమానం పెంచుకున్నారు. మూసీ మాజీ చైర్మన్ అలువాల వెంకటస్వామి ఇంటిపై కూడా బండి సంజయ్ గ్రామానికి వచ్చిన సమయంలో దావుల వీరప్రసాద్ అనుచరులు గొడవ చేశారని కక్ష పెంచుకున్నారు. అడ్డు తొలగించుకోవాలని.. ప్రతి విషయంలో అడ్డుతగులుతున్న వీరప్రసాద్ మట్టుబెట్టాలని లింగంపల్లి సుధాకర్, జిన్నే శ్రీను, అలువాల వెంకట స్వామి నిర్ణయించుకున్నారు. అందుకు కిరాయి హంతకుడు ప్రస్తుతం పూణేలో ఉంటున్న బంధువు లింగంపల్లి సంజయ్‌ను సంప్రదించారు. అతడి ద్వారా రౌడీ షీటర్ పోతురాజు సైదులుతో ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 22న జనగాం క్రాస్ రోడ్డులోని ఓ బార్లో జిన్నా శ్రీను మినహా మిగిలిన నలుగురు కలిసి హత్యకు ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా పట్టణంలోనే మారణాయుధాలు కొనుగోలు చేశారు. గంజాయి విక్రయిస్తున్నారని.. పట్టణంలోని సీతారాంపురం కాలనీలోని రౌడీ షీటర్ పోతరాజు సైదులు ఇంట్లో గంజాయి కలి గిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారన్న సమాచారంపై బుధవారం సీఐ అర్కపల్లి ఆంజనేయులు సిబ్బందితో కలిసి దాడి చేశారు. అక్కడ లింగంపల్లి సుధాకర్, లింగంపల్లి సంజయ్, పోతరాజు సైదులును అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కేజీల గంజాయి, రెండు వేట కొడవళ్లు, కంకి కొడవలి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అక్కడే ఉండగా అలువాల వెంకట స్వామి మారుతీవ్యాన్‌లో రావడంతో అతడిని కూడా అరెస్ట్ చేశారు. వ్యాన్‌ను సోదా చేయగా కత్తి లభించింది. వ్యాన్‌తో పాటు మారణాయుధాలు, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా హత్యకుట్ర విషయం బయటపడిందని తెలిపారు. కాగా, ఈ కేసులో జిన్నా శ్రీను పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించిన టౌన్ సీఐ అర్వపల్లి ఆంజనేయులు , ఎస్ఐ శ్రీనివాస్, చివ్వెంల ఎస్ఐ విష్ణు, ఐటీ కోర్ ఎస్ఐ శివ కుమార్, క్రైం సిబ్బంది గొర్ల కృష్ణ, గోదేషి కరుణాకర్, సైదులు, శ్రవణ్, మల్లేశ్‌లను ఎస్పీ అభినందించారు. చదవండి: ‘ఇప్పటికే ఇద్దరాడపిల్లల్ని కన్నాను’..! రోజుల పసికందును చంపిన తల్లి.. -
20 ఏళ్లు జైల్లో.. అయినా మళ్లీ
బంజారాహిల్స్( హైదరాబాద్): మర్డర్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించినా ప్రవర్తనలో మార్పు రాలేదు.. పీడీయాక్ట్ నమోదు చేసి రెండేళ్లు జైల్లో ఉంచినా తీరు మార్చుకోలేదు. రౌడీషీట్ ఓపెన్ చేసి కదలికలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా మార్పులేదు.. తరచూ బెదిరింపులకు పాల్పడుతూ, దారికాచి బెదిరిస్తూ.. హెచ్చరికలు జారీ చేస్తూ.. పలువురిని ఇబ్బందులకు గురిచేసే క్రమంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. గత అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా క్షమాభిక్షలో భాగంగా సత్ప్రవర్తన కింద ఏడాది క్రితం విడుదలయ్యాడు. జైలులో ఉన్న స్రత్పవర్తన సమాజంలోకి వచ్చాక మళ్లీ పాత కథనే కొనసాగిస్తున్నాడు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రౌడీషీటర్‌ను బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని లక్ష్మీనరసింహ నగర్లో నివసించే ఓ మహిళ పట్ల అదే ప్రాంతంలో నివసిస్తున్న రౌడీషీటర్ లక్ష్మణ్(46) ఈ నెల 11వ తేదీన ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమె భర్తను కొట్టడమే కాకుండా హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అరుపులు విన్న భార్య అక్కడికి చేరుకొని ఆపేందుకు యత్నించగా లక్ష్మణ్ ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను కిందకు తోసేశాడు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు రౌడిషీటర్ లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
కత్తులతో అమానుషంగా దాడిచేసి.. చెత్తను తినాలంటూ..
ముంబై: ముంబైలో దారుణం చోటుచేసుకుంది. జోగేశ్వరి ప్రాంతంలో ఒక వ్యక్తిపై.. ఇద్దరు రౌడిషీటర్లు దాడిచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన జులై నెలలో జోగేశ్వరి ప్రాంతంలోని రైల్వేస్టేషన్ దగ్గర జరిగిందని తెలిపారు. దీనిలో సదరు వ్యక్తిపై ఇద్దరు రౌడిషీటర్లు ఇనుప రాడ్లు, కత్తులతో దాడిచేసి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. అక్కడే ఉన్న చెత్తను తినే విధంగా అమానుషంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితులిద్దరిలో ఒకరిని మాలిక్ షేక్(47).. మరొకరిని ఫహిద్ అలీ షేక్(20)లుగా గుర్తించారు. ఇప్పటికే వీరిపై.. మేఘ్వాడి పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో, మాలిక్ షేక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరొ నిందితుడు ఫహిద్ అలీ షేక్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా, పాతకక్షల నేపథ్యంలో దాడులు చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. -
ఎయిర్‌హోస్టెస్ చెవి కట్ చేశాడు..
సాక్షి, బెంగళూరు: ప్రేమకు నిరాకరించిందని, తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న పగతో ఓ రౌడీషీటర్, ఎయిర్‌హోస్టెస్‌పై దాడి చేసి చెవిని కత్తిరించిన ఘటన ఐటీ సిటీలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై కొడిగెహళ్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా రౌడీషీటర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు జాలహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ అజయ్ అలియాస్ జాకీ. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే ఓ ఎయిర్‌హోస్టెస్ బాధితురాలు. మే 12 తేదీన హెబ్బాల వద్ద క్యాబ్‌లో ఈ దురాగతానికి uమొదటిపేజీ తరువాయి పాల్పడ్డాడు. ప్రేమించాలని వేధింపులు ఎయిర్హొస్టెస్ను ఫిబ్రవరి నుంచి ప్రేమించాలని రౌడీషీటర్ అజయ్ వెంటబడి వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె ఇంట్లో తెలిపింది. కుటుంబసభ్యులు రౌడీషీటర్ అజయ్‌ను హెచ్చరించడంతో కోపోద్రిక్తుడైన జాకీ ఎయిర్‌హొస్టెస్ ఇంటిముందు వీరంగం సృష్టించాడు. వారి కారు అద్దాలు, బైక్‌ను ధ్వంసం చేశాడు. ఈ ఘటనతో రౌడీషీటర్ అజయ్‌పై జాలహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు జాకీని పిలిచి హెచ్చరించారు. అప్పటి నుంచి ఎయిర్‌హోస్టెస్‌పై మరింత కసి పెంచుకున్నాడు. కారులో చొరబడి దాడి ఈ నెల 12 తేదీన ఎయిర్‌హోస్టెస్ కెంపేగౌడ విమానాశ్రయానికి క్యాబ్‌లో వెళుతుండగా, తెలుసుకున్న డీషీటర్ జాకీ హెబ్బాల వద్ద కారును అటకాయించాడు. డ్రైవరును బెదిరించి కారులో ఎక్కి కారును పోనివ్వాలని హెచ్చరించాడు, డ్రైవర్ నిరాకరించడంతో చాకుతో భుజంపై పొడిచాడు. తరువాత తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని ఎయిర్‌హోస్టెస్‌ను జాకీ బెదిరించగా, ఆమె తిరస్కరించింది. కోపోద్రిక్తుడైన దుండగుడు ఆమె చెవిని చాకుతో కత్తిరించి ఉడాయించాడు. దాడిలో గాయపడిన బాధితురాలు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన పై కొడిగేహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న రౌడీషీటర్ కోసం గాలిస్తున్నారు. -
కూకట్‌పల్లిలో కార్డన్ అండ్ సెర్చ్: రౌడీషీటర్లు అరెస్ట్
హైదరాబాద్ : కూకట్పల్లి పీఎస్ పరిధిలో పోలీసులు ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదుగురు రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే 55 బైక్‌లు, ఏడు ఆటోలు, నాలుగు కార్లతోపాటు అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలెండర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కార్డన్ సెర్చ్‌లో 28 మంది రౌడీ షీటర్ల అరెస్ట్
హైదరాబాద్: ఫలక్ నుమ పీఎస్ పరిధిలోని వట్టేపల్లి బస్తీ, ఫాతిమానగర్లలో పోలీసులు మంగళవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వేకువజాము నుంచే పోలీసులు ఈ ప్రాంతాల్లో చాలా మంది ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. కొందరు అనుమానితులను ప్రశ్నించి అదుపులోనికి తీసుకున్నారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్యర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. 28 మంది రౌడీ షీటర్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా, ఈ కార్డన్ సెర్చ్ ద్వారా 24 మంది బాల కార్మికులకు విముక్తి లభించింది. 350 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.