కార్డన్ సెర్చ్లో 28 మంది రౌడీ షీటర్ల అరెస్ట్ | rowdy sheeters arrested in cordon search in hyderabad | Sakshi
Sakshi News home page

కార్డన్ సెర్చ్లో 28 మంది రౌడీ షీటర్ల అరెస్ట్

Published Tue, Dec 15 2015 8:30 AM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

rowdy sheeters arrested in cordon search in hyderabad

హైదరాబాద్: ఫలక్ నుమ పీఎస్ పరిధిలోని వట్టేపల్లి బస్తీ, ఫాతిమానగర్లలో పోలీసులు మంగళవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వేకువజాము నుంచే పోలీసులు ఈ ప్రాంతాల్లో చాలా మంది ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. కొందరు అనుమానితులను ప్రశ్నించి అదుపులోనికి తీసుకున్నారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్యర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.

28 మంది రౌడీ షీటర్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా, ఈ కార్డన్ సెర్చ్ ద్వారా 24 మంది బాల కార్మికులకు విముక్తి లభించింది. 350 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement