కత్తులతో అమానుషంగా దాడిచేసి.. చెత్తను తినాలంటూ.. | Mumbai Man Assaulted Made To Eat Garbage One Held Another on the Run | Sakshi
Sakshi News home page

కత్తులతో అమానుషంగా దాడిచేసి.. చెత్తను తినాలంటూ..

Published Mon, Aug 2 2021 3:37 PM | Last Updated on Mon, Aug 2 2021 3:37 PM

Mumbai Man Assaulted  Made To Eat Garbage One Held Another on the Run - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై: ముంబైలో దారుణం చోటుచేసుకుంది. జోగేశ్వరి ప్రాంతంలో ఒక వ్యక్తిపై.. ఇద్దరు రౌడిషీటర్‌లు దాడిచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన జులై నెలలో జోగేశ్వరి ప్రాంతంలోని రైల్వేస్టేషన్‌ దగ్గర జరిగిందని తెలిపారు. దీనిలో సదరు వ్యక్తిపై ఇద్దరు రౌడిషీటర్లు ఇనుప రాడ్లు, కత్తులతో దాడిచేసి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. అక్కడే ఉన్న చెత్తను తినే విధంగా అమానుషంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నిందితులిద్దరిలో ఒకరిని మాలిక్‌ షేక్‌(47).. మరొకరిని ఫహిద్‌ అలీ షేక్‌(20)లుగా గుర్తించారు. ఇప్పటికే వీరిపై.. మేఘ్‌వాడి పోలీస్‌ స్టేషన్‌లో పలు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో, మాలిక్‌ షేక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరొ నిందితుడు ఫహిద్‌ అలీ షేక్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా, పాతకక్షల నేపథ్యంలో దాడులు చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement