శంషాబాద్ ఎయిర్పోర్టులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండిగో విమానంలో బుధవారం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో బాధితురాలు ఎయిర్పోర్టు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు... సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు.