![IndiGo Passenger Caught Smoking In Flight Toilet - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/27/indigo.jpg.webp?itok=jPsnXf6-)
ముంబై : విమాన టాయ్‌లెట్‌లో పొగతాగిన ప్రయాణికుడిని అధికారులు పోలీసులకు అప్పగించారు. ఈనెల 25న అహ్మదాబాద్ నుంచి గోవాకు ఇండిగో విమానంలో వెళుతున్న ప్రయాణికుడు విమానంలోని టాయ్‌లెట్‌లో సిగరెట్ తాగుతూ సిబ్బందికి పట్టుబట్టారు. నిబంధనలను ఉల్లంఘించి విమానంలో పొగతాగుతున్న ప్రయాణికుడిపై కెప్టెన్‌కు సిబ్బంది ఫిర్యాదు చేశారు.
చట్టప్రకారం విమానంలో సిగరెట్ తాగడం నేరం కావడంతో విమానం గోవాలో ల్యాండవగానే స్ధానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రయాణికుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గత వారం విమానంలో సిగరెట్ తాగేందుకు అనుమతించాలని కోరుతూ ఓ ప్రయాణికుడి వాగ్వాదానికి దిగడంతో విస్తారా ఎయిర్‌లైన్స్ విమానం గమ్యస్ధానం చేరేందుకు మూడు గంటలు జాప్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment