న్యూఢిల్లీ: ఇండిగో విమానయాన సంస్థ దేశీయ నెట్‌వర్క్‌లో 10 కొత్త డైలీ నాన్-స్టాప్ విమాన సర్వీసులను నేటి నుంచి అందించనున్నది. హైదరాబాద్, వైజాగ్, గోవా, ఢిల్లీ, బెంగళూరులకు నాన్‌స్టాప్ సర్వీసులు ఉంటాయని ఇండిగో తెలిపింది. నేటి(శుక్రవారం) నుంచి ఢిల్లీ-వైజాగ్ నాన్‌స్టాప్ విమాన సర్వీస్‌ను తొలిసారిగా ప్రవేశపెడుతున్నామని పేర్కొంది. అలాగే హైదరాబాద్-వైజాగ్‌ల మధ్య మూడవ డైలీ నాన్‌స్టాప్ విమాన సర్వీసును, ముంబై-హైదరాబాద్‌ల మధ్య 6వ నాన్‌స్టాప్ విమాన సర్వీసులను అందిస్తున్నామని తెలిపింది.
అలాగే ఈనెల 26 నుంచి ఢిల్లీ-గోవా నాలుగవ డైలీ నాన్‌స్టాప్ విమాన సర్వీస్‌ను, ఢిల్లీ-బెంగళూరు 9వ డైలీ నాన్‌స్టాప్ విమాన సర్వీస్‌ను ప్రారంభిస్తామని పేర్కొంది. ఢిల్లీ-విశాఖ డైలీ నాన్-స్టాప్ సర్వీస్‌ను తొలిసారిగా ప్రారంభిస్తున్నామని, ప్రయాణికులు అదే రోజు ఆంధ్రప్రదేశ్‌కు రిటర్న్ జర్నీ చేయవచ్చని తెలిపింది. ఏపీ ప్రభుత్వం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై పన్నులు తగ్గించిందని, ఫలితంగా తక్కువ చార్జీలు ఆఫర్ చేసే అవకాశాలున్నాయని, కనెక్టివిటీ మెరుగుపడుతుందని ఇండిగో పేర్కొంది.
ఢిల్లీ-వైజాగ్ మధ్య ఇండిగో నాన్‌స్టాప్ సర్వీస్
Published Fri, Oct 10 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM
Advertisement