న్యూఢిల్లీ: ఢిల్లీ-విశాఖపట్నం ఎయిర్‌ఇండియా విమానానికి మంగళవారం(సెప్టెంబర్3) అర్ధరాత్రి బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. అయితే ఈ బెదిరింపు ఆకతాయిలు చేసిన పనిగా అధికారులు తేల్చారు.
విమానంలో బాంబు ఉందని తొలుత ఢిల్లీ పోలీసులకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో వారు తమను అప్రమత్తం చేసినట్లు వైజాగ్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. 107 మందితో ప్రయాణించిన విమానం విశాఖపట్నంలో షెడ్యూల్ ప్రకారం ల్యాండ్ అయింది.
విమానం ల్యాండ్ అయి ప్రయాణికులందరు దిగిన తర్వాత తనిఖీలు నిర్వహించామని, అందులో పేలుడు పదార్ధాలేవీ లేవన్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment