జేసీ ప్రవర్తనపై స్పందించిన అశోక్ గజపతిరాజు
న్యూఢిల్లీ : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విశాఖ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. తాను గంట ముందే వచ్చినా....ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని జేసీ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. అలాంటిది ఏం జరిగినా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయివుంటుందని అది పరిశీలించిన తర్వాతే ఎవరిది తప్పో తేలిపోతుందన్నారు. తప్పు ఎవరు చేసిన శిక్ష తప్పదని అశోక్ గజపతి రాజు అన్నారు.
కాగా ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో గురువారం దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై విమానయాన సంస్థలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వీఐపీ లాంజ్‌లో ఉన్న అశోక్ గజపతిరాజు వద్దకు వెళ్లి విమాన సిబ్బంది తనన అవమానించారని జేసీ చెప్పగా, ఆయన విమాన సంస్థ అధికారులను ఒప్పించి బోర్డింగ్‌పాస్ ఇప్పించారు. అయితే ఆలస్యంగా వచ్చిన ఇతర ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లు ఇవ్వవపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.