అన్నిటికీ ‘అశోక్‌’ సాక్షి | JC Diwakar Reddy comments on Ashok Gajapathi Raju | Sakshi
Sakshi News home page

అన్నిటికీ ‘అశోక్‌’ సాక్షి

Published Sat, Jul 1 2017 1:23 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

అన్నిటికీ ‘అశోక్‌’ సాక్షి

అన్నిటికీ ‘అశోక్‌’ సాక్షి

- ఆయనే దగ్గరుండి ఫ్లైట్‌ ఎక్కించారు
విశాఖ ఎయిర్‌పోర్ట్‌ వివాదంపై జేసీ
ఓ టీవీ స్టింగ్‌ ఆపరేషన్‌లో తాజాగా వెల్లడి
జేసీ వ్యాఖ్యలతో ఇరుకునపడ్డ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు
 
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నం విమానాశ్రయంలో వీరంగం వేసి ఉద్యోగులపై దాడికి పాల్పడ్డ అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తాజాగా ఆ వివాదంలోకి కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్‌ గజపతిరాజునూ లాగారు. జూన్‌ 15న ఆలస్యంగా వచ్చి బోర్డింగ్‌ పాస్‌ కోసం ఎయిర్‌పోర్టులో ఇండిగో సంస్థ ఉద్యోగులపై జేసీ దౌర్జన్యానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఆ సమయంలో మంత్రి ఎయిర్‌పోర్ట్‌ వీఐపీ లాంజ్‌లోనే ఉన్నారని, ఆయన జోక్యంతోనే బోర్డింగ్‌ పాస్‌ తీసుకుని జేసీ హైదరాబాద్‌కు వెళ్లారని ‘సాక్షి’ స్పష్టంగా చెప్పింది. కానీ అశోక్‌ గజపతిరాజు మాత్రం ఆ తర్వాత రోజు ట్విట్టర్‌లో ఆ ఘటనతో తనకేమీ సంబంధం లేదన్నారు.

తన జోక్యంతోనే జేసీకి బోర్డింగ్‌ పాస్‌ ఇచ్చారన్న వాదనలను ఖండిం చారు. ఆ తర్వాత జేసీ విదేశాలకు వెళ్లడం.. ఘటన జరిగిన రోజు సీఎం చంద్రబాబు  ఏం జరిగిందో తెలుసుకుంటానని ప్రకటించి ఊరుకోవడంతో విషయం మరు గునపడింది. కానీ శుక్రవారం ఢిల్లీకి చెందిన ఓ టీవీ ఛానెల్‌ చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌లో జేసీ విశాఖలో ఆ రోజు ఏం జరిగిందో వెల్లడించిన విషయాలు ఇప్పుడు చర్చనీయాం శమయ్యాయి. ఇండిగో సిబ్బందిపై దురుసుగానే ప్రవర్తించానని అంగీకరించారు. దీంతో ఇప్పుడు ఆ వివాదం అశోక్‌ మెడకు చుట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement