
గురుగ్రామ్: ఇండిగో ఎయిర్‌లైన్స్.. మూడురోజుల వింటర్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రయాణికులకు అందించబోతోంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకు టికెట్లు అందించనున్నట్లు ప్రకటించింది.
దేశీయ ప్రయాణానికి రూ.2,023, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.4,999 నుంచి ప్రారంభ టికెట్ల ధరగా నిర్ణయించింది. 2023 జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్య ప్రయాణానికి సంబంధించిన టికెట్లకు, అదీ టికెట్లు అందుబాటులో ఉన్నంతవరకు మాత్రమే ఈ వింటర్ సేల్ ఆఫర్ వర్తిస్తుందని ఇండిగో స్పష్టం చేసింది. టికెట్లు నాన్ స్టాప్ విమానాల మీదే మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది.
ఏ ఆఫర్‌లు, ప్రమోషన్స్, స్కీమ్స్.. వీటికి వర్తించవు. భారతీయులు హెచ్‌ఎస్‌బీసీ కస్టమర్లైతే.. అదనంగా క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇండిగోకు మొత్తం 290 విమానాలు ఉండగా.. రోజుకు 1600 విమాన సర్వీసులను నడుపుతుండగా.. ఇందులో 76 దేశీయ, 26 అంతర్జాతీయ గమ్యస్థానాలు ఉన్నాయి. విమానయాన రంగం మునుపటి కంటే పుంజుకుందని, దీన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment