రూ. 2,999తో విదేశీ ప్రయాణం! | air asia offers rs 999 domestic and rs 2999 international tickets | Sakshi
Sakshi News home page

రూ. 2,999తో విదేశీ ప్రయాణం!

Published Mon, Apr 18 2016 1:54 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM

రూ. 2,999తో విదేశీ ప్రయాణం!

రూ. 2,999తో విదేశీ ప్రయాణం!

రూ. 999కే స్వదేశీ విమాన టికెట్
ఎయిర్ ఏషియా ప్రత్యేక ఆఫర్
ఇప్పటికే ప్రారంభమైన బుకింగ్


బెంగళూరు
చౌక ధరలకే విమాన టికెట్లను అందించే ఎయిర్ ఏషియా సంస్థ మరోసారి అత్యంత చవకైన ఆఫర్ ప్రకటించింది. భారతదేశంలో ఉన్న నగరాలకైతే పన్నులన్నింటితో కలుపుకొని రూ. 999కి, విదేశాలకు అయితే రూ. 2,999కే టికెట్లు ఇస్తామని తెలిపింది. తాము 22 దేశాల్లోని 100 నగరాలకు విమానాలు నడిపిస్తున్నామని, తాము ఇప్పుడు అందిస్తున్న ఈ ప్రమోషనల్ ఆఫర్‌తో దేశ విదేశాలు చుట్టి రావాలనుకునేవారికి మంచి అవకాశం వచ్చినట్లు అవుతుందని ఎయిర్ ఏషియా కమర్షియల్ విభాగం అధిపతి స్పెన్సర్ లీ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ ఆఫర్ కింద బుకింగ్స్ సోమవారమే ప్రారంభమయ్యాయి. ఈనెల 24 వరకు టికెట్లు బుక్ చేసుకోవ్చు. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం మే 22లోగా ప్రయాణాలు చేయడానికి మాత్రమే ఇప్పుడు టికెట్లు ఇస్తారు. మన దేశంలో విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, కొచ్చిన్, చండీగఢ్, గోవా, గువాహటి, ఇంఫాల్, పుణె, జైపూర్ నగరాలకు రూ. 999 టికెట్‌తో వెళ్లొచ్చు. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్, బాలి, మెల్‌బోర్న్, పెర్త్, మనిలా లాంటి 100 నగరాలకు రూ. 2,999 టికెట్‌తో వెళ్లొచ్చని ఎయిర్ ఏషియా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement