టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా(ఏఐ), ఎయిర్ ఏసియా ఇండియా(ఏఏఐపీఎల్)లు తమ ప్రయాణికులకు శుభవార్త అందించాయి. ఈ రెండు సంస్థలు ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ రెండు విమానయాన సంస్థలకు చెందిన ఏ విమానం రద్దయినా కూడా ప్రయాణికులు ఎలాంటి టెన్షన్ లేకుండా మరొక సంస్థ విమానంలో ప్రయాణం చేయొచ్చని తెలిపాయి. ఈ రెండు విమానయాన సంస్థలలో ఏదైనా ఒక విమానం రద్దయితే.. ప్రయాణికులకు మరో విమానంలో చోటు కల్పిస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది.
ఉదాహరణకు అనివార్య కారణాల వలన ఎయిరిండియా విమానం రద్దు అయితే అందులోని ప్రయాణికులను ఎయిర్ ఏసియా ఇండియా విమానంలో తీసుకొని వెళ్లే అవకాశం ఉంటుంది. ఎయిరిండియా, ఎయిర్ ఏసియా ఇండియా మధ్య సహకార ఒప్పందంలో భాగంగా తాము ఈ తొలి అడుగు వేసినట్టు తెలిపింది. ఈ ఒప్పందం రెండేళ్ల పాటు అంటే ఫిబ్రవరి 9, 2024 వరకు వర్తిస్తుందని టాటా గ్రూప్ తెలిపింది. విమానాలు రద్దు అయినప్పుడు ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి ఈ రెండింటిలో ఏదైనా విమానంలో తీసుకొని వెళ్లనున్నారు. ఇందు కోసం ఇంటర్‌లైన్ కన్సిడరేషన్స్ ఆన్ ఇర్రెగ్యులర్ ఆపరేషన్స్(ఐఆర్ఓపీ) ఒప్పందంపై సంతకాలు చేసినట్లు పేర్కొన్నాయి.
(చదవండి: ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తున్న ప్రముఖ కంపెనీ..!)
Comments
Please login to add a commentAdd a comment