Air Asia India
-
బంఫర్ ఆఫర్: రూ.1497కే ఎంచక్కా గాల్లో ఎగిరిపోండి.. త్వరపడాలి!
దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా(AirAsia) న్యూ ఇయర్ సందర్భంగా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రాబోతున్న కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని 'న్యూ ఇయర్, న్యూ డీల్స్' పేరిట తమ ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను కేవలం రూ.1,497గా నిర్ణయించింది. ఈ ఆఫర్ డిసెంబర్ 25 వరకు అమలులో ఉంటుందని, దీని కింద బుకింగ్ చేసుకున్న ప్యాసింజర్లు వచ్చే ఏడాది(2023) జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 లోపు ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్ ధర బెంగళూరు-కొచ్చి వంటి రూట్లతో పాటు, దాని నెట్వర్క్ అంతటా ఇదే విధమైన తగ్గింపు విక్రయ ఛార్జీలు ఉన్నట్లు తెలిపింది. కంపెనీ వెబ్సైట్, కంపెనీ మొబైల్ యాప్, ఇతర ప్రధాన బుకింగ్ ఛానెల్‌ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. కొనసాగుతున్న లాయల్టీ ప్రయోజనాలలో భాగంగా, వెబ్సైట్, యాప్‌లో బుకింగ్ చేసే (నియో పాస్) NeuPass సభ్యులు కాంప్లిమెంటరీ ఫ్రూట్ ప్లాటర్, ప్రాధాన్యత చెక్-ఇన్, బ్యాగేజీ, బోర్డింగ్‌తో పాటు 8 శాతం నియో కాయిన్స్ (NeuCoins) వరకు కూడా పొందుతారు. మరోవైపు, ప్రముఖ సంస్థ ఇండిగో కూడా రూ.2,023కే విమాన టిక్కెట్‌ను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. Bank your new year resolutions now! Ring in 2023 with our #NewYearNewDeals sale, with fares starting ₹1,497! Book till 25 Dec for travel till 15 Apr 2023 on https://t.co/QiptjwMRjT or the AirAsia India mobile app. pic.twitter.com/bEwWXFlcLY — AirAsia India (@AirAsiaIndia) December 23, 2022 -
ఎయిరిండియాకు ‘ప్రాధాన్యత’ ఉపసంహరణ!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి ఎయిరిండియాకు ఇస్తున్న ప్రాధాన్యతను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఉపసంహరించింది. ఎయిరిండియాకు ఇచ్చిన ట్రాఫిక్ హక్కులను ఇతర సంస్థలకు కేటాయించే ముందు.. కంపెనీ సమర్పించే ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తామంటూ గత సర్క్యులర్‌లో పొందుపర్చిన నిబంధనను తాజాగా ఏప్రిల్ 19న జారీ చేసిన సర్క్యులర్‌లో తొలగించింది. పౌర విమాయాన రంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న ఏ ఎయిర్‌లైన్స్‌కైనా సదరు హక్కులను కేటాయిస్తామని పేర్కొంది. సాధారణంగా ఒక దేశ విమానయాన సంస్థలు మరో దేశానికి సర్వీసులు నడపాలంటే ఇరు దేశాలు చర్చించుకుని, ద్వైపాక్షిక విమాన సేవల ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయి. దానికి అనుగుణంగా ఆయా దేశాలు తమ ఎయిర్‌లైన్స్‌కి సర్వీసులు హక్కులను కేటాయిస్తాయి. ఎయిరిండియా ఇప్పటివరకూ ప్రభుత్వ రంగంలో ఉండటంతో ఈ హక్కుల విషయంలో దానికి ప్రాధాన్యత లభించేది. కానీ ప్రస్తుతం టాటా గ్రూప్ చేతికి వెళ్లి ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌గా మారడం వల్ల ప్రత్యేక హోదా కోల్పోయింది. -
విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏసియా శుభవార్త..!
టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా(ఏఐ), ఎయిర్ ఏసియా ఇండియా(ఏఏఐపీఎల్)లు తమ ప్రయాణికులకు శుభవార్త అందించాయి. ఈ రెండు సంస్థలు ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ రెండు విమానయాన సంస్థలకు చెందిన ఏ విమానం రద్దయినా కూడా ప్రయాణికులు ఎలాంటి టెన్షన్ లేకుండా మరొక సంస్థ విమానంలో ప్రయాణం చేయొచ్చని తెలిపాయి. ఈ రెండు విమానయాన సంస్థలలో ఏదైనా ఒక విమానం రద్దయితే.. ప్రయాణికులకు మరో విమానంలో చోటు కల్పిస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. ఉదాహరణకు అనివార్య కారణాల వలన ఎయిరిండియా విమానం రద్దు అయితే అందులోని ప్రయాణికులను ఎయిర్ ఏసియా ఇండియా విమానంలో తీసుకొని వెళ్లే అవకాశం ఉంటుంది. ఎయిరిండియా, ఎయిర్ ఏసియా ఇండియా మధ్య సహకార ఒప్పందంలో భాగంగా తాము ఈ తొలి అడుగు వేసినట్టు తెలిపింది. ఈ ఒప్పందం రెండేళ్ల పాటు అంటే ఫిబ్రవరి 9, 2024 వరకు వర్తిస్తుందని టాటా గ్రూప్ తెలిపింది. విమానాలు రద్దు అయినప్పుడు ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి ఈ రెండింటిలో ఏదైనా విమానంలో తీసుకొని వెళ్లనున్నారు. ఇందు కోసం ఇంటర్లైన్ కన్సిడరేషన్స్ ఆన్ ఇర్రెగ్యులర్ ఆపరేషన్స్(ఐఆర్ఓపీ) ఒప్పందంపై సంతకాలు చేసినట్లు పేర్కొన్నాయి. (చదవండి: ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తున్న ప్రముఖ కంపెనీ..!) -
ఎయిర్ ఏసియా ఇండియా సీఓఓగా ఇండిగో మాజీ
సాక్షి, ముంబై : ఎయిర్ ఏసియా ఇండియా కీలక ఎగ్జిక్యూటివ్ నియామకాన్ని చేపట్టింది. ఇండిగో మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ కుమార్‌ను తన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా నియమించింది. డిసెంబర్ 3 నుంచి సంజయ్ కుమార్ బాధ్యతలను స్వీకరించనున్నారని ఎయిర్ ఏసియా ఒక ప్రకటనలో తెలిపింది. తమ టీంలో సంజయ్‌కుమార్ చేరడం చాలా సంతోషంగా ఉందంటూ ఎయిర్ ఏసియా ఇండియా ఛైర్మన్ రామదొరై ఆయనకు స్వాగతం పలికారు. సంస్థ వృద్ధి పుంజుకుంటున్న, అంతర్జాతీయ కార్యకలాపాలకు విస్తరించాలన్న ఉద్దేశ్యంలో సమయంలో ఆయన తమతో జత కలిసారని తన ప్రకటనలో పేర్కొన్నారు. టాటా సన్స్ లిమిటెడ్ (49 శాతం), ఎయిర్ ఏసియా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ (49 శాతం), ఎయిర్ ఏసియా డైరెక్టర్ ఆర్ వెంకట్రామన్కు 1.5శాతం, రామదొరైకి 0.5శాతం వాటాతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడిన విమానయాన సంస్థ ఎయిర్ ఏసియా ఇండియా. సెప్టెంబర్ నాటికి దేశీయంగా 4.4 శాతం మార్కెట్ వాటా ఉన్న ఎయిర్ ఏసియా ఆర్థిక అక్రమ ఆరోపణలు, చట్టవిరుద్ధ లాబీయింగ్ ఆరోపణలపై సీబీఐ కేసులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అంతర్జాతీయ విమానయాన సేవలకు సంబంధించిన లైసెన్సులు పొందేందుకు అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. కాగా ఇండిగోలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన సంజయ్ కుమార్‌కు వైమానిక పరిశ్రమలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. -
సూ..పర్ సేల్ : రూ.500కే టికెట్
సాక్షి, న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు శుభవార్త. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా సరికొత్త ఆఫర్ అందుబాటులో తీసుకొచ్చింది. దేశీయ మార్గంలో రూ.500 లకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఇవాల్టి(సోమవారం) నుంచి ఈ ఆకర్షణీయమైన ఆఫర్‌ను అమలు చేయనున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దేశీయంగా 21మార్గాల్లో ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోది. రూ.500, వెయ్యి, పదిహేనువందల రూపాయల మధ్య ఈ వన్ వే టికెట్లను డిస్కౌంట్ రేట్లలో అందిస్తోంది. ఈ సూపర్ సేల్ ద్వారా టికెట్లనుబుక్ చేసుకునే చివరి తేదీ సెప్టెంబర్ 23. ఇలాబుక్ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబర్ 17 - మార్చి, 31, 2019 వరకు ప్రయాణం చేసే అవకాశం ఉందని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఎయిర్ ఏషియా. కాం, ఎయిర్ఏషియా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఈ సూపర్ సేల్ ఆఫర్లో విమాన టికెట్లను బుక్ చేసుకునే అవకాశం. కాగా హైదరాబాద్, విశాఖపట్నంతోపాటు అమృత్సర్, బాగ్డోగ్ర, బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, ఇంఫాల్, ఇండోర్, జైపూర్, కోల్‌కతా, కొచ్చి, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పనాజీ, పూణే, రాంచీ , శ్రీనగర్, సూరత్ నగరాలల సర్వీసులను అందిస్తోంది ఎయిర్ ఏషియా. -
ఎయిర్ ఏసియా డైరెక్టర్‌కు సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఎయిర్ ఏసియా ఇండియా డైరెక్టర్ ఆర్ వెంకటరామనన్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. జూలై 3వ తేదీన విచారణకు హాజరు కావాలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌లైన్స్ చెందిన ఫైనాన్షియల్ ఆఫీసర్ దీపక్ మహేంద్రను ఇటీవల ప్రశ్నించిన సీబీఐ ఇపుడు వెంకటరామన్‌ను ప్రశ్నించనుంది. మరోవైపు వాణిజ్యపరిశ్రమల శాఖనుంచి ఎఫ్‌డీఐ పెట్టుబడుల ఆమోదానికి సంబంధించిన పత్రాలను తాజాగా ఈడీ సేకరించింది. అంతర్జాతీయ విమానయానానికి కావాలసిన పర్మిట్లను తెచ్చుకొనేందుకు ఎయిర్ ఆసియా భారీ కుంభకోణానికి పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) నిబంధనలను కూడా ఉల్లంఘించారంటూ ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసింది. 5/20 నిబంధన అంటే అంతర్జాతీయ సర్వీసులు నిర్వహించేందుకు లైసెన్స్ పొందాలంటే 20 విమానాలు, 5 ఏళ్ళ అనుభవం ఉండాలి. ఇవి లేకుండా విదేశీ లైసెన్స్ పొందారనేది సీబీఐ ఆరోపణ. ఈ కేసులో ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ గ్రూప్ ఎయిర్ ఏషియా, మలేషియా గ్రూప్ సీఈఓ, ట్రావెల్ ఫుడ్ ఓనర్ సునీల్ కపూర్, డైరెక్టర్ ఆర్ వెంకట్రామన్, ఏవియేషన్ కన్సల్టెంట్ దీపక్ తల్వార్, సింగపూర్‌కు చెందిన ఎస్ఎన్ఆర్ ట్రేడింగ్ రాజేంద్ర దూబేతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులను ఎఫ్ఐఆర్లో సీబీఐ చేర్చిన సంగతి తెలిసిందే. -
ఎయిర్ ఏసియా బిగ్ సేల్: రూ.999కే సింగపూర్
సాక్షి, ముంబై: బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏసియా ఇండియా విమాన టికెట్లపై మరోసారి డిస్కౌంట్ ధరలను ప్రారంభించింది. అదీ అంతర్జాతీయ మార్గంలో ‘బిగ్సేల్’ పేరుతో తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. అదీ అంతర్జాతీయంగా 999 రూపాయలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. మే21- 27తేదీల మధ్య ఈ ఆఫర్లో టికెట్ల బుకింగ్ సౌకర్యం లభ్యం. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా నవంబర్ 1, 2018నుంచి ఆగస్టు13, 2019 వరకు ప్రయాణించే అవకాశం. అంతర్జాతీయంగా కౌలాలంపూర్, బ్యాంకాక్, క్రబీ, సిడ్నీ, ఆక్లాండ్, మెల్బోర్న్, సింగపూర్, బాలి లాంటి అన్ని ప్రాంతాల నుంచి రూ. 999 (వన్ వే) ప్రారంభ ధరకే టికెట్లను అందిస్తోంది. బెంగళూరు, కొచ్చి, గోవా, జైపూర్, చండీగఢ్, పుణె, న్యూఢిల్లీ, గువహతి, ఇంఫాల్, విశాఖపట్నం, హైదరాబాద్, శ్రీనగర్, బాగ్డోగ్ర, రాంచి, కోలకతా, నాగ్‌పూర్ ఇండోర్, చెన్నై, సూరత్ , భువనేశ్వర్ నుంచి ఈ విదేశీ టికెట్లను ఎంపిక చేసుకోవచ్చు. ఎయిర్ ఏసియా ప్రకటించిన ఈ కొత్త ప్రమోషనల్ ఆఫర్ కింద ఎయిర్ ఆసియా, ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ విమానాల్లో డిస్కౌంట్ టిక్కెట్లు అందిస్తోంది. ఈ రాయితీ ధరల టిక్కెట్లు www.airasia.com, మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ బుకింగ్స్‌కు మాత్రమే లభిస్తాయి. ఎయిర్ ఏసియా గ్రూప్ నెట్‌వర్క్‌లోని ఎయిర్ ఏసియా ఇండియా, ఎయిర్ ఏసియా బెర్హాడ్, థాయ్ ఎయిర్ ఏసియా తదితర ఆపరేటింగ్ సర్వీసుల ద్వారా ఈ ఆఫర్ లభ్యమవుతుంది. ఎయిర్ ఏసియా వెబ్సైట్ లో పొందుపర్చిన సమాచారం ప్రకారం గోవా నుండి కౌలాలంపూర్ టికెట్ 1999నుంచి ప్రారంభం. కోచి నుండి కౌలాలంపూర్‌కు 3,399 రూపాయలు, విశాఖపట్నం-కౌలాలంపూర్ , గోవా-కౌలాలంపూర్ రూ.5514 , హైదరాబాద్- కౌలాలంపూర్ 4,999 రూపాయలు, జైపూర్-కౌలాలంపూర్ 3,590 రూపాయలు న్యూఢిల్లీ నుంచి కౌలాలంపూర్ రూ.4,290 ప్రారంభ ధరలుగా ఉన్నాయి. భారతదేశం నుండి కౌలాలంపూర్ ద్వారా పయనించే విమానాల్లో కూడా తక్కువ ధరలను ప్రకటించింది. భువనేశ్వర్-కౌలాలంపూర్-జకార్తా రూ .2,255, భువనేశ్వర్-కౌలాలంపూర్-యోగ్యకార్తా రూ.3,341, కొచ్చి-కౌలాలంపూర్-బ్రూనే 4,649 రూపాయలు, కోలకతా-బ్యాంకాక్ - డాన్ మెయంగ్-ఫుకెట్ రూ .5405, హైదరాబాద్-కౌలాలంపూర్-పెనాంగ్ 6,613 రూపాయలు, జైపూర్-కౌలాలంపూర్ -క్రిబి 5,701 రూపాయలు ప్రారంభ ధరలుగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఎయిర్ ఏసియా అధికారిక వెబ్సైట్లో లభ్యం. -
కబాలి విమాన ప్రయాణికులకు నిరాశ
కబాలి ఫీవర్‌ను సొమ్ము చేసుకోడానికి కార్పొరేట్ కంపెనీలు చాలా ప్రయత్నాలే చేశాయి. ఎయిర్ ఏషియా అయితే తమ విమానం ఒకదాన్ని మొత్తం కబాలి పోస్టర్‌తో నింపేసింది. రజనీ స్టైల్లో స్పెషల్ ‘కబాలి’ లుక్ తో ముస్తాబైన ఈ విమానం బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా, పుణె, చండీగఢ్, జైపూర్, గువాహటి, ఇంఫాల్, వైజాగ్, కొచ్చి మీదుగా ప్రయాణించనుందని ప్రకటించారు. అందులో టికెట్లు బుక్ చేసుకున్న వారికి రకరకాల సదుపాయాలతో పాటు చెన్నైలో కబాలి సినిమాను చూపిస్తామని చెప్పారు. అయితే.. మొదటి రోజే ఆ విమానంలో వెళ్లి సినిమా చూడాలనుకున్న అభిమానులకు కొంత నిరాశ తప్పలేదు. ఎయిర్ ఏషియా కంపెనీ సినిమా చూపించే ప్రదేశంతో పాటు సమయాన్ని కూడా రీషెడ్యూల్ చేసింది. అయితే ప్రయాణికులు మాత్రం ఎక్కడో వేరేచోట కాకుండా చెన్నైలోనే అభిమానుల మధ్య కూర్చుని థియేటర్లో సినిమా చూడాలని పట్టుబట్టారు. కానీ.. ప్రస్తుతానికి అది సాధ్యం కాదని, సినిమా ప్రదర్శన ప్రాంతం, సమయం మారిన విషయాన్ని ప్రయాణికులకు తెలియజేయడంలో తాము చిన్న పొరపాటు చేశామని కంపెనీ అంగీకరించింది. దానికి గాను అభిమానులకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపింది. -
'ఆ ఫ్లైట్ డిజైనింగ్‌కు నెల రోజులు పట్టింది'
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా కబాలి. ఈ సినిమాకు అఫీషియల్ ఎయిర్‌లైన్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న ఎయిర్ ఏసియా ఇండియా, వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఏసియాలోనే తొలిసారిగా ఓ పాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను సినిమా పోస్టర్లతో డిజైన్ చేయించింది. ఈ శుక్రవారం నుంచి ఈ కబాలి ఫ్లైట్ గగనవీధుల్లో షికారు ప్రారంభిస్తున్న సందర్భంగా.. ఎయిర్ ఏసియా ప్రతినిధి, ఫ్లైట్ డిజైనింగ్ వెనుక కష్టాలను వివరించాడు. ఫ్లైట్‌పై కబాలి పోస్టర్‌ను ఏర్పాటుచేయడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టినట్టు వెల్లడించారు. శుక్రవారం నుంచి ఈ ఫ్లైట్ బెంగళూరు, న్యూ డిల్లీ, గోవా, పుణె, జైపూర్, వైజాగ్ లాంటి పలు నగరాలకు సేవలందించనుంది. అంతేకాదు కబాలి సినిమా రిలీజ్ తరువాత కూడా ఈ స్పెషల్ ఫ్లైట్ ఇలాగే కొనసాగుతుందని ప్రకటించారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి సినిమాలో రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటించింది. మలేషియాలో ఆశ్రయం పొందుతున్న శరణార్థుల కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ కాంత్ వయసు మళ్లిన డాన్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న కబాలి సినిమాను ఈ నెల రెండో వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
రూ. 2,999తో విదేశీ ప్రయాణం!
► రూ. 999కే స్వదేశీ విమాన టికెట్ ► ఎయిర్ ఏషియా ప్రత్యేక ఆఫర్ ► ఇప్పటికే ప్రారంభమైన బుకింగ్ బెంగళూరు చౌక ధరలకే విమాన టికెట్లను అందించే ఎయిర్ ఏషియా సంస్థ మరోసారి అత్యంత చవకైన ఆఫర్ ప్రకటించింది. భారతదేశంలో ఉన్న నగరాలకైతే పన్నులన్నింటితో కలుపుకొని రూ. 999కి, విదేశాలకు అయితే రూ. 2,999కే టికెట్లు ఇస్తామని తెలిపింది. తాము 22 దేశాల్లోని 100 నగరాలకు విమానాలు నడిపిస్తున్నామని, తాము ఇప్పుడు అందిస్తున్న ఈ ప్రమోషనల్ ఆఫర్‌తో దేశ విదేశాలు చుట్టి రావాలనుకునేవారికి మంచి అవకాశం వచ్చినట్లు అవుతుందని ఎయిర్ ఏషియా కమర్షియల్ విభాగం అధిపతి స్పెన్సర్ లీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్ కింద బుకింగ్స్ సోమవారమే ప్రారంభమయ్యాయి. ఈనెల 24 వరకు టికెట్లు బుక్ చేసుకోవ్చు. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం మే 22లోగా ప్రయాణాలు చేయడానికి మాత్రమే ఇప్పుడు టికెట్లు ఇస్తారు. మన దేశంలో విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, కొచ్చిన్, చండీగఢ్, గోవా, గువాహటి, ఇంఫాల్, పుణె, జైపూర్ నగరాలకు రూ. 999 టికెట్‌తో వెళ్లొచ్చు. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్, బాలి, మెల్బోర్న్, పెర్త్, మనిలా లాంటి 100 నగరాలకు రూ. 2,999 టికెట్‌తో వెళ్లొచ్చని ఎయిర్ ఏషియా ప్రకటించింది. -
ఎయిర్ ఏషియా డిస్కౌంట్ ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా.. క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రయాణికుల కోసం ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్ ఏషియా సంస్థ ఒకవైపునకు గానూ గోవా, కొచ్చి, గువాహతి, ఇంపాల్ వంటి ప్రాంతాలకు రూ. 1,269 నుంచి టికెట్లు ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కౌలాలంపూర్-బ్యాంకాక్‌కు రూ. 2,999 నుంచి టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. ఇప్పటి నుంచి జనవరి 3 వరకు బుకింగ్ చేసుకున్న వారు జనవరి 10 నుంచి జూన్ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది. -
రూ. 3 వేలతో మలేషియా ప్రయాణం!
చవక ధరలకే విమానయానాన్ని అందిస్తున్న ఎయిర్ ఏషియా తన బిగ్‌సేల్‌లో మరో కొత్త స్కీము ప్రకటించింది. రూ. 3వేలకే విదేశీ ప్రయాణాన్ని అదికూడా పన్నులన్నీ కలుపుకొని అందిస్తామని చెప్పింది. ఈనెల 28వ తేదీలోగా టికెట్లు బుక్ చేసుకోవాలి. ఫిబ్రవరి 15 నుంచి ఆగస్టు 31లోగా చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్లో 30 లక్షల టికెట్లను అమ్మకానికి ఉంచారు. కొచ్చి నుంచి కౌలాలంపూర్‌కు రూ. 2,999కే టికెట్ ఇస్తున్నారు. అలాగే కొచ్చి నుంచి హాంకాంగ్, పెనాంగ్, సింగపూర్ ప్రాంతాలకు రూ. 4,019కే టికెట్ ఉంది. కొచ్చి నుంచి మెల్బోర్న్, పెర్త్, సిడ్నీ లాంటి ఆస్ట్రేలియా నగరాలకు మాత్రం టికెట్ ధరను రూ. 5,739గా నిర్ణయించారు. వివిధ భారతీయ నగరాల నుంచి అంతర్జాతీయ నగరాలకు కూడా ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తోంది. -
బెంగళూరు - విశాఖ విమాన టికెట్ రూ. 999!
చవక ధరలకే విమానయానాన్ని అందించే ఎయిర్ ఏషియా ఇండియా మరో సంచలన ఆఫర్‌తో ముందుకొచ్చింది. బెంగళూరు- విశాఖపట్నం మధ్య ప్రయాణాన్ని కేవలం 999 రూపాయలకే అందిస్తోంది. ఇంకా మాట్లాడితే.. బెంగళూరు - కొచ్చి మధ్య ప్రయాణాన్ని అన్ని పన్నులతో కలుపుకొని కేవలం 799 రూపాయలకే ఇచ్చేస్తోంది. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే. ఈనెల 28వ తేదీలోగా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంది. 2016 ఫిబ్రవరి 15 నుంచి 2016 ఆగస్టు 31వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. బెంగళూరు-పుణె, బెంగళూరు-గోవా, బెంగళూరు-విశాఖ ఈ మూడు మార్గాల్లోనూ టికెట్ ధరను 999 రూపాయాలుగానే ఎయిర్ ఏషియా ఇండియా నిర్ణయించింది. ఇక ఇదే ఆఫర్లో బెంగళూరు-జైపూర్ మార్గంలో రూ. 1599కి, బెంగళూరు-చండీగఢ్ మార్గంలోరూ. 1799, బెంగళూరు-న్యూఢిల్లీ మార్గంలో రూ. 1999కి టికెట్లు ఇస్తోంది. ఇటీవలి కాలంలో చాలా వరకు విమానయాన సంస్థలు ఇలాంటి చౌక ఆఫర్లను ప్రవేశపెట్టాయి. స్వదేశీ ప్రయాణాల విభాగంలో ఇటీవల ఎయిర్ ఇండియా రూ. 1777కే టికెట్ ఇస్తామంటూ ఓ ప్రకటనతో ముందుకొచ్చింది. జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, గో ఎయిర్, ఇండిగో లాంటి సంస్థలు కూడా ఆఫర్లను ప్రకటించాయి. -
విమానం టిక్కెట్టు.. కిలోమీటరుకు రూపాయే!
క్యాబ్‌లో వెళ్లాలన్నా అత్యంత చవగ్గా అంటే కిలోమీటరుకు రూ. 7 నుంచి రూ. 15 వరకు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. విమానం టికెట్లను మాత్రం కిలోమీటరుకు రూపాయికే ఇస్తామని చవక విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా ప్రకటించింది. కొన్ని మార్గాలను కొత్తగా ప్రవేశపెట్టిన ఎయిర్ ఏషియా.. అక్కడే ఈ ఆఫర్ ఉంటుందని చెబుతోంది. గువాహటి నుంచి ఇంఫాల్‌కు ఈ సంస్థ కొత్త విమానాలు ఎగురుతాయి. ఈనెల 7వ తేదీలోగా టికెట్లు బుక్ చేసుకోవాలి. ఈ కొత్త మార్గంలో అన్ని పన్నులూ కలుపుకొని రూ. 900కే టికెట్లు ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్లో జూన్ 25 నుంచి మే 31లోగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. గత నెలలో బెంగళూరు - విశాఖ మార్గంలో ఓ విమానాన్ని ప్రవేశపెట్టారు. ఢిల్లీ నుంచి కూడా కొత్తగా విమానాలను నడుపుతున్న ఎయిర్ ఏషియా.. అక్కడే కిలోమీటరుకు రూపాయి ఆఫర్ పెట్టింది. బెంగళూరు- విశాఖ మార్గానికీ ఈ ఆఫర్ ఉంది. న్యూఢిల్లీ-గువాహటి మార్గంలో పన్నులన్నీ కలిపి రూ. 1500, న్యూఢిల్లీ- గోవా, న్యూఢిల్లీ - బెంగళూరు మార్గాల్లో పన్నులతో కలిపి రూ. 1700 టికెట్లు పెట్టారు. -
విమాన చార్జీ.. కిలోమీటరుకు రూపాయే!!
అత్యంత చవక విమానయానానికి శ్రీకారం చుట్టిన ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ ఇప్పుడు సరికొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. ఆటోల కంటే కారు చవగ్గా.. కిలోమీటరుకు కేవలం ఒక్క రూపాయి చార్జీతోనే విమానం ఎక్కొచ్చని చెబుతోంది. తమ నెట్‌వర్క్‌లోకి ఢిల్లీని కూడా కొత్తగా చేర్చిన ఎయిర్ ఏషియా.. ఇందుకోసమే ప్రత్యేకంగా పరిమిత కాలానికి ఈ ఆఫర్ పెట్టింది. ప్రస్తుతం ఢిల్లీకి బెంగళూరు, గువాహటి, గోవాలతో కనెక్టివిటీ వచ్చింది. మే 21 నుంచి ఈ మార్గాల్లో విమానాలు తిరుగుతాయి. ఢిల్లీ-గువాహటి మధ్య అన్ని పన్నులూ కలుపుకొని రూ. 1500, ఢిల్లీ-గోవా, ఢిల్లీ-బెంగళూరు మార్గాలకు రూ. 1700గా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక కిలోమీటరుకు ఒక్క రూపాయి చార్జీ ఆఫర్‌తో టికెట్లను ఈనెల 26 వరకు బుక్ చేసుకోవచ్చు. మే 21 నుంచి మే 31వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. -
రూ. 1390కే ఎయిర్ ఏషియా విమాన టికెట్
సంక్రాంతికి ఊరెళ్దామనుకుంటున్నారా? బస్సు చార్జీలు మండిపోతున్నాయి కదూ.. అయితే ఇంకెందుకు ఆలస్యం.. ఎంచక్కా విమానం టికెట్ బుక్ చేసేసుకోండి. ఎందుకంటే, ఇప్పుడు విమానాల టికెట్లు కూడా దాదాపుగా బస్ టికెట్ల రేట్లకు వచ్చేస్తున్నాయి. అవును ఇది అతిశయోక్తి కాదు. ఏసీ బస్సు చార్జీ పెట్టుకుంటే విమానం టికెట్లు వచ్చేస్తున్నాయి. బడ్జెట్ విమానయానం అందించే సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా మరోసారి తన ఆఫర్లను ప్రకటించింది. అన్ని పన్నులూ కలుపుకొని రూ. 1390కే అందిస్తోంది. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లేందుకు ఈ ఆఫర్ ఉంది. ఇతర రూట్లలో మాత్రం ధరలు కొంత వేరేగా ఉన్నాయి. జనవరి 4వ తేదీ వరకు ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. జనవరి 5వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. వాడియా గ్రూపునకు చెందిన గో ఎయిర్ సంస్థ రూ. 1469కే టికెట్లు ఇస్తుండటంతో దానికి పోటీగా ఎయిర్ ఏషియా ఇండియా ఈ ఆఫర్ ప్రకటించింది. గో ఎయిర్ సంస్థ జనవరి 1 నుంచి మార్చి 31 వరకు చేసే ప్రయాణాలకు ఆఫర్ ప్రకటించింది. అయితే, టికెట్లను మాత్రం డిసెంబర్ 25 వరకే బుక్ చేసుకోవచ్చు. -
ఎయిర్ ఏషియా డిస్కౌంట్ ఆఫర్లు...
న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా బిగ్సేల్ ఆఫర్లో భాగంగా సంస్థ అనుబంధ సంస్థలు, ఎయిర్ఏషియా బెర్హాద్, థాయ్ ఎయిర్ఏషియా, ఎయిర్ఏషియా ఇండియాలు డిస్కౌంట్లను ప్రకటించాయి. ఎయిర్ఏషియా బెర్హాద్ నిర్వహించే హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ సర్వీసుకు రూ.2,599కే విమాన టికెట్లను పొందవచ్చని ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓ మిట్టు చాండిల్య చెప్పారు. అలాగే చెన్నై, కోచి, కోల్‌కత, బెంగళూరు, తిరుచిరాపల్లి, తదితర నగరాల నుంచి కౌలాలంపూర్ సర్వీసులకు కూడా ఇదే ధరకు విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నామ న్నారు. బుకింగ్స్ ఆదివారం రాత్రి నుంచే ప్రారంభమయ్యాయయని, ఈ నెల 16 వరకూ తమ వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. -
మరో ఆఫర్.. 908కే విమాన టికెట్!
దేశంలో విమానయాన సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ వెల్లువెత్తిస్తున్నాయి. ఎయిర్ ఏషియా ఇండియా 690 రూపాయలకు విమానయానం అంటూ ఈ యుద్ధాన్ని ప్రారంభించింది. దాన్నుంచి దాదాపు ప్రతి విమానయాన సంస్థ ఇలాంటి ఆఫర్లతోనే ముందుకొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా జెట్ ఎయిర్వేస్ సంస్థ మరో ఆఫర్ ప్రకటించింది. దేశంలోని పలు మార్గాల్లో ఎకానమీ క్లాస్ టికెట్లను మొత్తం అన్ని పన్నులు కలుపుకొని 908 రూపాయలకే అందిస్తోంది. అక్టోబర్ 5వ తేదీ వరకు ఈ ఆఫర్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. జనవరి 15 తర్వాత చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్లో భాగంగా కొచ్చి-బెంగళూరు మార్గంలో టికెట్ 908 రూపాయలు, బెంగళూరు-కొచ్చి అయితే రూ. 1162 అవుతుంది. బెంగళూరు-చెన్నై టికెట్ రూ. 1162 కాగా, చెన్నై-బెంగళూరు రూ. 1017. గోవా-బెంగళూరు టికెట్ రూ. 916 అయితే బెంగళూరు-గోవా మాత్రం రూ. 1162 ఉంది. బెంగళూరు నుంచి చండీగఢ్, జైపూర్‌లకు మాత్రం రూ. 2390గా టికెట్ ధర నిర్ణయించారు. ప్రధానంగా ఎయిర్ ఏషియా ఇండియా విమానాల ఆఫర్లున్న మార్గాల్లో మాత్రమే జెట్ ఎయిర్వేస్ కూడా తన ఆఫర్లను ప్రకటించడం గమనార్హం. ఎయిర్ ఏషియా ఆఫర్లు కూడా అక్టోబర్ 5 వరకు ఉంటాయి. ఇందులో బుక్ చేసుకున్నవారు జనవరి 15 నుంచి జూన్ 30 వరకు ప్రయాణాలు చేయొచ్చు. -
2599కే విదేశీ విమానయానం!!
ఇన్నాళ్లూ విమానయాన సంస్థలు రకరకాల ఆఫర్లతో ప్రయాణికులను హోరెత్తించాయి. అయితే అవన్నీ కూడా కేవలం మన దేశంలో ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లడానికే. తొలిసారిగా విదేశీ యానానికి కూడా ఆఫర్లు ప్రవేశపెట్టి అత్యంత చవకగా విదేశీ యానాన్ని అందిస్తోంది ఎయిర్ ఏషియా ఇండియా. 'ఫెస్టివ్ హాలిడే సేల్' పేరిట కేవలం 2599 రూపాయల నుంచే విదేశీ యానానికి విమాన టికెట్లు అందించడం మొదలుపెట్టింది. ఈ డిస్కౌంట్ టికెట్ల అమ్మకాలు ఈనెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కొనసాగుతాయి. సెప్టెంబర్ రెండో తేదీ నుంచి జనవరి 31 తేదీల మధ్య విదేశీ ప్రయాణాలు ఈ టికెట్లతో చేయొచ్చు. ధరలు ఇలా... కొచ్చిన్ నుంచి కౌలాలంపూర్ వెళ్లడానికి పన్నులన్నింటితో కలిపి కేవలం 2599 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అదే చెన్నై నుంచి కౌలాలంపూర్ వెళ్లాలంటే 5699 చెల్లించాలి. బెంగళూరు నుంచి వెళ్లాలంటే మాత్రం గరిష్ఠంగా 6699 ధర పెట్టారు. కోల్‌కతా నుంచి కౌలాలంపూర్ వెళ్లడానికి 6299గా టికెట్ ధర నిర్ణయించారు. మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా బెర్హాద్, టాటా గ్రూప్, ఢిల్లీకి చెందిన పెట్టుబడి సంస్థ టెలెస్ట్రా ట్రేడ్‌ప్లేస్ సంస్థలు మూడు కలిసి ఎయిర్ ఏషియా ఇండియాను ప్రారంభించాయి. జూన్ 12వ తేదీన ఈ సంస్థకు చెందిన తొలి విమానం బెంగళూరు నుంచి గోవాకు వెళ్లింది. అప్పటినుంచి వివిధ సీజన్లలో చకవ విమానయాన టికెట్లు అందిస్తోంది. -
499కే విమాన టికెట్.. షరతులు వర్తిస్తాయి!
విమాన ప్రయాణికుల మీద విమానయాన సంస్థలు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. చవక విమానయానాన్ని అందించే స్పైస్ జెట్ సంస్థ వచ్చే ఏడాది ప్రయాణాలకు సంబంధించిన టికెట్లను 499 రూపాయలకే అందిస్తామంటూ ముందుకొచ్చింది. సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే సంవత్సరం జనవరి 16 నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు (రెండు రోజులూ కలిపి) చేసే ప్రయాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. అయితే.. ఈ ధరలలో ఇంధన సర్‌ఛార్జి కలిసి ఉన్నా, ఇతర పన్నులు, ఫీజులను మాత్రం ఆ రోజుకు ఎంత ఉంటే అంత చొప్పున ప్రయాణికులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. కేవలం భారతదేశంలో చేసే ప్రయాణాలకు మాత్రమే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి. ఈ ఆఫర్ కింద బుక్ చేసుకునే టికెట్లను రద్దు చేసుకోడానికి మాత్రం వీల్లేదు. ఒకవేళ రద్దు చేసినా ఆ సొమ్ము తిరిగి ఇవ్వరు, అలాగే ప్రయాణ తేదీ కూడా మార్చరు. మరోవైపు బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా కూడా మరో ఆఫర్ ప్రకటించింది. అన్ని పన్నులు కలిపి వివిధ మార్గాల్లో ప్రయాణాలకు రూ. 1290కే టికెట్ అందిస్తోంది. ఈ టికెట్లను సెప్టెంబర్ ఏడో తేదీ వరకు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 11వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. -
రూ. 1887కే ఇండిగో విమాన టికెట్లు!!
వరుసపెట్టి విమానయాన సంస్థలన్నీ చవక ధరలకే ప్రయాణాలను అందించడం మొదలుపెట్టాయి. ఇప్పుడీ రేసులోకి ఇండిగో కూడా వచ్చేసింది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంత తక్కువ ధరకు.. అంటే, రూ. 1887కే అన్ని పన్నులతో కలుపుకొని టికెట్లు అందిస్తామని ప్రకటించింది. దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా సెప్టెంబర్ 25 నుంచి జనవరి 15వ తేదీ వరకు వెళ్లడానికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది. టికెట్ల బుకింగ్ గురువారం మొదలైంది. ఇలా వరుసపెట్టి ఒకరి తర్వాత ఒకరు ప్రకటించడంతో ఇండిగో ప్రత్యర్థి స్సైస్ జెట్ తన ఆఫర్‌ను గురువారం వరకు పొడిగించింది. ఈ ఆఫర్ కింద, దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా సెప్టెంబర్ 25 నుంచి జనవరి 15వ తేదీ వరకు వెళ్లడానికి టికెట్ రూ. 1888 మాత్రమేనని స్పైస్ జెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. (మళ్లీ 600కే విమాన టికెట్లు) ఇక ఎయిర్ ఏషియా ఇండియా అయితే 600 నుంచి 1900 వరకు మూడు రకాలుగా ధరలను నిర్ణయించింది. ప్రయాణ కాలాన్ని కూడా ప్రత్యర్థి సంస్థల్లా మూడు నాలుగు నెలలు కాకుండా ఏకంగా ఏడాదికి పైగా ఉంచింది. వీటన్నింటితో పాటు ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా కూడా చవక ధరలకు దిగింది. ఏకంగా వంద రూపాయలకే పరిమిత కాలానికి టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రకటనతో ఆ సైట్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. (రూ. 100కే ఎయిర్ ఇండియా విమానయానం) -
మళ్లీ 600కే విమాన టికెట్లు!
హైదరాబాద్ నగరం లాంటి చోట్ల 600 రూపాయలు పెడితే ఎయిర్ పోర్టుకు వెళ్లడానికి క్యాబ్ ఛార్జీలు మాత్రమే వస్తాయి. కానీ, అదే 600 రూపాయలు పెడితే చాలు.. ఏకంగా విమానమే ఎక్కేయొచ్చు. ఆపైన ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు! అవును, చవక ధరలకే విమాన యానాన్ని అందించే ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ మరోసారి ప్రమోషనల్ ఆఫర్లు ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరం అక్టోబర్ 26 నుంచి వచ్చే సంవత్సరం అక్టోబర్ 24వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు సంబంధించి, ఆగస్టు 31వ తేదీలోగా ఈ టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ టికెట్లు 600 రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ ఆఫర్ కింద బెంగళూరు నుంచి చెన్నై గానీ, కొచ్చి గానీ వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా కూడా 600 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇది మొత్తం పన్నులతో కలిపిన మొత్తం. ఇక బెంగళూరు నుంచి గోవా, లేదా అటునుంచి ఇటు వెళ్లాలంటే టికెట్ ధర 900 మాత్రమే. ఇక బెంగళూరు- చండీగఢ్, జైపూర్ మార్గాల్లో అయితే టికెట్లు రూ. 1900 చొప్పున ఉన్నాయి. మరోవైపు స్పైస్‌జెట్ కూడా చౌక టికెట్లను ప్రవేశపెట్టింది. అయితే దాని టికెట్ ధర రూ. 1888 అని పేర్కొన్నారు. దానికి ఆగస్టు 27వ తేదీలోగా బుక్ చేసుకోవాలి. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. -
మళ్లీ చవక ధరలకు విమానయానం
చవక ధరలకే విమానయానం ఇస్తామంటూ కొత్తగా సేవలు ప్రారంభించిన ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ మరోసారి ప్రమోషనల్ ఆఫర్లను ప్రకటించింది. గతంలో 339 రూపాయలకే బెంగళూరు - చెన్నై నగరాల మధ్య విమాన యానాన్ని అందించిన ఈ సంస్థ ఇప్పుడు బెంగళూరు-కొచ్చి, బెంగళూరు-చెన్నై నగరాల మధ్య రూ. 1490 చొప్పున, బెంగళూరు-గోవా మధ్య రూ. 1690 చొప్పున ఛార్జీలు నిర్ణయించింది. ఈ టికెట్లను ఈనెల 29వ తేదీలోపు బుక్ చేసుకోవాలి. అంటే, బుకింగ్‌కు వారం రోజుల సమయం ఇచ్చారు. జూలై 1 నుంచి అక్టోబర్ 25వ తేదీ మధ్య ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. బెంగళూరు-కొచ్చి, బెంగళూరు-గోవా మార్గాల్లో బుక్ చేసుకునే టికెట్ల మీద ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 25 వరకు ప్రయాణాలు చేయొచ్చు. -
రేపట్నుంచే ఎయిర్ ఏషియా విమానాలు
చవక ధరలకే విమానయానాన్ని అందించే ఉద్దేశంతో భారతదేశంలో అడుగుపెట్టిన ఎయిర్ ఏషియా ఇండియా విమానాలు గురువారం నుంచి గగన వీధుల్లో ఎగరబోతున్నాయి. బెంగళూరు నుంచి గోవాలోని పనజికి మొదటి విమానం బయల్దేరుతుంది. మే 7వ తేదీన డీజీసీఏ అనుమతి రావడంతో.. దాదాపు నెల రోజుల తర్వాత ఈ సంస్థ విమానాలు వినువీధిలోకి ప్రవేశిస్తున్నాయి. తమ మొదటి ఎయిర్‌బస్ ఎ-320 విమానంలో మొత్తం 180 సీట్లు బుకింగ్ ప్రారంభించిన పది నిమిషాల్లోనే అమ్ముడుపోయాయని ఎయిరేషియా అధికార ప్రతినిధి తెలిపారు. బెంగళూరు -గోవా మార్గంలో ప్రారంభ ఆఫర్‌గా మొత్తం ఛార్జీని 990 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే చెన్నై-బెంగళూరు, బెంగళూరు-చెన్నై మార్గాల్లో అయితే మరింత తక్కువగా ఛార్జీలున్నాయి. మిగిలిన రోజుల్లో ఈ ఆఫర్ లేనప్పుడు కూడా తమ ఛార్జీలు మార్కెట్ రేటుతో పోలిస్తే 35 శాతం తక్కువగానే ఉంటాయని ఎయిరేషియా ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిట్టు శాండిల్య తెలిపారు. -
339 రూపాయలకే విమాన టికెట్!!
చెన్నై నుంచి బెంగళూరు వెళ్లాలంటే ఎంత ఖర్చువుతుంది? రైల్లో వెళ్తే స్లీపర్ క్లాస్ అయితే 230 రూపాయల నుంచి ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే 1360 రూపాయల వరకు అవుతుంది. ప్రయాణ సమయం కూడా సూపర్ ఫాస్ట్ రైలు అయితే.. అది కూడా రైలు ఆలస్యం కాకపోతే కనీసం ఆరు గంటలు పడుతుంది. అదే మీరు విమానం ఎక్కితే జస్ట్ 339 రూపాయలు చెల్లిస్తే చాలు.. ప్రశాంతంగా కూర్చుని హాయిగా అరగంటలోనో గంటలోనో వెళ్లిపోవచ్చు. ఏంటి, దీనిక అదనంగా పన్నులు ఉంటాయిలే అనుకుంటున్నారా? ఒక్క పైసా కూడా మీరు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. 339 రూపాయలిచ్చి చెన్నై నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్లిపోవచ్చు. అదే బెంగళూరు నుంచి చెన్నైకి మాత్రం టికెట్ ధర 490 రూపాయలు. తక్కువ ఖరీదుతో విమానయానాన్ని అందించాలని తలపెట్టిన ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ ఈ సరికొత్త ఆఫర్‌తో తన సేవలు ప్రారంభించింది. ఒక్కో రూటుకు ఒక్కో ధరను ఈ సంస్థ నిర్ణయించింది. బెంగళూరు నుంచి గోవా వెళ్లాలంటే పన్నులతో కలిపి 990 రూపాయలు చెల్లించాలి. శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి టికెట్ బుకింగ్ మొదలైపోయింది. ఇప్పటికే చాలావరకు టికెట్లు అయిపోయాయి కూడా. కొన్ని తేదీలకు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. అయితే, హైదరాబాద్ నుంచి మాత్రం ఈ విమానయాన సంస్థ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. అందువల్ల దేశంలోని మిగిలిన నగరాలకు సంబంధించి మాత్రమే టికట్లు బుక్ చేసుకోవచ్చు. మే 30 నుంచి జూన్ 1వ తేదీ వరకు మాత్రమే ఈ బుకింగ్ ఆఫర్ అమలులో ఉంటుంది. ప్రయాణం మాత్రం జూన్ 12 నుంచి అక్టోబర్ 15 వరకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మలేషియా విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా, టాటా సన్స్, టెలెస్ట్రా ట్రేడ్‌ప్లేస్.. ఇవన్నీ కలిసి సంయుక్తంగా ప్రారంభించిన ఎయిర్ ఏషియా ఇండియా సంస్థకు డీసీసీఏ నుంచి ఫ్లయింగ్ లైసెన్స్ అంత సులభంగా దొరకలేదు. ఎట్టకేలకు తొమ్మిది నెలలు వేచి ఉన్న తర్వాత పలు అడ్డంకులు అధిగమించి ఇప్పుడు గాల్లో ఎగరబోతోంది.